పెదవుల మీద చెరగని చిరునవ్వుతో కనిపించే దేవితాను చూసిన ఎవరికైనా ఆమె ఓ కమర్షియల్ వ్యాపారవేత్త అని అంటే నమ్మలేరు. అంత సౌమ్యం గా కనిపించే ఆమె వ్యాపార విషయంలో ఏ చిన్న పొరపాటును కూడా ఒప్పు కోరు. అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా వుండటం వల్లే నేడు తాను ఈ స్థాయికి వచ్చానని దేవిత అంటారు.
అన్నీ నిర్ణీత సమయంలోనే...
‘మగవారి పెత్తనడం నడిచే ఈ ప్రపంచంలో ఆడవారు నెగ్గుకు రావడం కష్టమై న వ్యవహారం. కానీ తలచుకుంటే మాత్రం అసాధ్యం కాదు’ అన్నది దేవిత అం తరంగం. ‘మన చుట్టూ వున్నవారిని ఎన్ని ప్రశ్నలు అడిగినా లేదా ఎన్ని సలహా లు అడిగినా ఇస్తారు. ఎందుకంటే ఆడవారు కష్టపడుతుంటే చూడలేరు. అదే వారితో పోటీగా వస్తే మాత్రం సహించలేరు. ఇటువంటి వారితో డీల్ చేయడం అనేది ఓ పెద్ద సవాలు. ఇక బిజినెస్‌లో ఆడ, మగ అని చూడకుండా లాభాలు, నష్టాలు రెంటిని సమన్వయం చేసుకుంటూ విజయం సాధించడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ రోజుల్లో ఆడవారు కూడా అన్ని టా ముందుకొచ్చేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఇక నా వరకు ఇది ఎవరికి సంబంధించి వారి బాధ్యత కూడా. స్వతంత్రంగా బత కడం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుం ది. అది ఉద్యోగమనే కాదు.. మరేదైనా సరే’ అని దేవిత అంటున్నారు.
టెక్నికల్ రంగంపై ఆసక్తి..
లాస్‌ఏంజెల్స్ దక్షిణ కాలిపోర్నియా యూనివర్శిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ గ్రాడ్యుయేషన్ చేసిన దేవిత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి గేమ్ థియ రీ ఆఫ్ స్ట్రాటెజిక్‌లో థింకింగ్ కోర్సును చేశారు. ‘చిన్నతనం నుండి టెక్నికల్ ఫీ ల్డ్ అంటే ఎంతో ఇష్టం. అటువైపుగా వెళ్ళాలని అనుకునేదాన్ని. సొంతంగా అనే క పరికరాలు కూడా రూపొందించేదాన్ని. చిన్న తనంలో ఇంట్లో వుపయోగించే అన్ని రకాల గృహోపకరణాల గురించి తెలుసుకుంటూ వుండేదాన్ని.
వాటిని తయారుచేసే దాన్ని కూడా. నాలో వున్న టాలెంట్‌ని గుర్తించింది నాన్నే. ఆయనే నన్ను ఈ రంగంవైపు ప్రోత్సహించారు. 21 వయసు వున్నప్పుడు ట్రైనీగా జా యిన్ అయ్యాను. 22 వయసులో డైరెక్టర్‌గా మారాను’ అని ఎంతో ఆనందం గా చెబుతున్నారు. ఇంకా ‘టెక్నాలజీని ఇష్టపడినంత మాత్రానా ఏదో అబ్బాయి లా వుంటాననుకుంటే మాత్రం పొరపాటే. నేను అందరి అమ్మా యిల్లాగానే వుంటాను. అలాగే ఈ రంగంలో వుండే అన్ని రకాల పోటీలను అర్థం చేసుకో గలను. వాటికి అనుగుణంగా వ్యాపారాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాను. నా చుట్టూ వుండే వారితో తగిన విధంగా వుండగలను’ అని దేవిత చెబుతోంది.
సమష్టి కృషి వల్లే..!
ఎప్పుడూ ఓ కొత్త ఛాలెంజ్ కోసం దేవిత ఎదురు చూ స్తూ వుంటుంది. గతేడాది ముంబయిలో జరిగిన ఫస్ట్-ఎవర్ వియు టిఇడిఎక్స్ గేట్ వేకు ఎంపికైంది. ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, టెక్ని కల్ విభాగం వారు పాల్గొన్నారు. వీరిలో రాల్ప్ సైమన్, సేమైర్ స్టెయిన్ వంటి ప్రముఖులూ వున్నారు. ఇందులో పాల్గొనడానికి గల క్రెడిట్ మొత్తం ఆమె తన టీమ్‌కే ఇచ్చేశారు. ‘ఇంత గొప్ప విజయానికి కారణం నేను ఒక్కదాన్నే కాదు.. మొత్తం టీమ్ అందరూ కృషి చేయడం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో నిలిచాం. అందరూ ఎంతో కష్టపడ్డారు. ఇందులో ఎంతో మంది కాలేజీ విద్యార్థుల ప్రతిభ కూడా వుంది. నేను చేసింది కేవలం కొన్ని చెక్కుల మీద సంతకాలే’ అని ఎంతో హుందాగా నవ్వుతూ అనేస్తారు.
ఓ సాధారణ అమ్మాయిలాగే..!
దేవిత బిజినెస్‌కు మాత్రమే కాదు.. ఓ సాధారణ ముంబయి అమ్మాయిలాగే సినిమాలకు వెళ్తుంది. స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంది. చిట్ చాట్, ఫోన్‌లో కబుర్లు అన్నీ మామూలే. ‘ఇప్పటి వరకు ప్రపంచంలో 125 ప్రముఖ నగరాలు తిరిగాను. వందల మంది స్నేహితులు నాకున్నారు. అందరిలాగే నేనూ వారితో మాట్లాడతాను. చాట్ చేస్తాను. అలాగే వంట చేయడం అంటే చాలా ఇష్టం. చాలా బాగా చేస్తాను కూడా’ అని దేవిత చెబుతున్నారు.
టెక్నాలజీ రచయితగా....
ఓ జర్నలిస్టుగా దేవిత టెక్నాలజీకి సంబంధించి ఎన్నో కొత్త అంశాలను పరిచయం చేస్తూ వుంటారు. అత్యాధునిక విధానాల ను నేర్చుకుని మరీ అందిస్తుంటారు. ‘ఎప్పటికప్పుడు ప్రపంచం లో జరిగే చిన్న చిన్న మార్పులను, టెక్నాల జీని తెలుసుకుంటూ వుంటాను. ఏ చిన్న విషయం అయినా సరే ముందుగా తెలుసు కున్న తర్వాతే దానికి సంబంధించిన జర్నల్స్ రాస్తాను. ఇప్పుడు సొం తంగా నాకు ఓ కంపెనీ వుంది. దానికి సంబంధించి అభివృద్ధి కోసం కూడా నేను అన్ని విషయాలు తెలుసుకుం టాను’ అని దేవిత చెబుతోంది.
స్ఫూర్తి వీరే : ఇప్పటి వరకు తాను సాధించిన అన్నిటికీ కారణం కొందరి మహిళల జీవిత గమనమే అంటుంది దేవిత. క్వీన్ ఎలిజబెత్, మార్గరెట్, మహా రాణి గాయిత్రీ దేవి, రాణి లక్ష్మీబాయి వంటి వాళ్ళంద రూ తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చారని చెబుతున్నారు.
పోలిక కాదు పోటీ...
దేవిత విజయ రహస్యం చెప్పేందుకు మాత్రం చాలా చిన్నదే. ‘ఎప్పుడూ ఒకరితో పోల్చుకోవడం కన్నా పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే ఎదగగలం. పోల్చుకున్నంత కాలం దానిలా తయారయ్యేందుకు మా త్రమే కృషి చేస్తాం. అదే కొత్తగా ఏదైనా చేస్తే మనకు మనమే ప్రత్యేకం గా వుంటాం. ఇతరులే మనల్ని చూసి నేర్చుకుంటారు. దీనికి నేర్చుకోవాలనే తపన వుండాలి. అది అందరికీ వుపయోగపడాలి. సం తోషాన్ని ఇవ్వాలి. సంతోషంగా నేర్చుకోవాలి. ఇది అందరికీ సాధ్యమని చెప్పలే ను కానీ నేను మాత్రం చేస్తున్నది అదే’.
ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయాలి..
‘ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇంకా చేయాల్సింది.. ప్రయాణిం చాల్సిన దూరం చాలా వుంది. అది సాధించే వరకు నేను ఎటువంటి బంధాల్లో చిక్కుకోవాలని అనుకోవడం లేదు. అలా అని అదేదో బాధ అని చెప్పడం లేదు. నాకున్న ఆశయాలు తీరేందుకు ఇంకా చాలా కాలం పడుతుంది ఆ తరువాతే పెళ్లి’ అని ఈ వ్యాపార వేత్త చెబుతోంది. ఇక చివరిగా ‘ఎంత దూరం వెళ్ళినా సరే.. ఇంకొంచెం దూరం వెళ్ళేందుకు ప్రయత్నించాలి’ అని దేవిత ఈ తరం అమ్మాయిలకు చెబుతోంది. ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు కదూ!
No comments:
Post a Comment