ఉద్యోగాల నిమిత్తం అమెరికా, యుకె, ఆస్ట్రేలియాలకే కాదు ఆఫ్రికా దేశాలకూ వెళ్తున్నారు మనవాళ్లు. సాధారణంగా ఆఫ్రికా దేశాలనగానే పోషకాహార లోపంతో ఉన్న పిల్లల దృశ్యం ఒకటి కళ్ల ముందు మెదులుతుంది ఎక్కువమందికి. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరి మరోవైపు ఉన్నదేంటి? "అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దానితోపాటు ప్రకృతి వినాశనం ఎక్కువగా జరుగుతోంది కాని ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడుంటే ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది'' అంటున్నారు టాంజానియా వాణిజ్య రాజధానిగా పిలవబడే దార్-ఎస్-సలాంలో ఉంటున్న మంతెన వెంకట కృష్ణమూర్తి రాజు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
సంప్రదాయ వంటల్లో మొక్కజొన్నపిండితో తయారుచేసిన ఉగాలి అనే ఉప్మాలాంటి వంటకం, మనదగ్గర బూరెల్లాగా చేసుకునే 'మందాజి' అనే వంటకం ఫేమస్. ఆహారపు అలవాట్లు కొంచెం పశ్చిమదేశాల అలవాట్లకు దగ్గరగా ఉంటాయి. అందుకనే కాబోలు బంగాళాదుంపల చిప్స్, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.
"దార్-ఎస్-సలాం రావడం అనుకోకుండా జరిగింది. 2006 ఫిబ్రవరిలో గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజిలో వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాను. అదే మేనేజ్‌మెంట్ దార్-ఎస్-సలాంలో ఇంటర్నేషనల్ మెడికల్ అండ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ నడుపుతోంది. నేను గుంటూరులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే... వాళ్లు నన్ను అక్కడికి పర్సనల్ మేనేజర్‌గా పంపించారు. అలా 2007లో వచ్చాను. ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి.
మా యూనివర్శిటీ నగరానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌లో కోటీ నుంచి మియాపూర్ వరకు వెళ్లినంత దూరం. మాకు క్యాంపస్‌లోనే వసతి ఏర్పాటు ఉంది. మొదటి రెండు సంవత్సరాలు ప్రతి ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి టౌన్‌కి వెళ్లి షాపింగ్ చేసేవాళ్లం. అలాగే దేవాలయానికి వెళ్లి కొంతసేపు గడిపి, ఇండియాకి ఫోన్ మాట్లాడుకుని తిరిగి వచ్చేవాళ్లం. గత రెండేళ్లుగా ఇక్కడి తెలుగు వాళ్లు ఏర్పాటుచేసుకున్న తరంగిణి సాంస్కృతిక సంస్థకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాను. దాంతో నగరంలోకి వెళ్లడం ఎక్కువైంది.
ఉగాలి, మందాజిలు బాగుంటాయి
సుమారు ఎనిమిది వందల మంది తెలుగు వాళ్లు ఉన్నారిక్కడ. భారత సంతతి వాళ్లు నివాసముండే ప్రాంతాల్లో నెలకు ఆరు వందల డాలర్లు ఆ పైనే ఉంటాయి అద్దెలు. ఆహారపదార్ధాలు, బట్టలు ఎక్కువగా చైనా వంటి దేశాల నుంచి దిగుమతి అవుతాయి. అందుకే ధర కాస్త ఎక్కువే. ఇక్కడ జీవనం ఖర్చుతో కూడుకున్నదే. మన హైదరాబాద్‌తో పోల్చుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. రూపాయల్లో చూసుకుంటే కూల్ డ్రింక్ 17 రూపాయలు, కేజీ బియ్యం 40 నుంచి 80 రూపాయలు, కేజీ కూరగాయలు 30 నుంచి 40 రూపాయలు ఉంటాయి.
గుజరాతీలు నడిపించే కిరాణా షాపుల్లో దాదాపు అన్ని వస్తువులూ దొరుకుతాయి. బొంబాయిరవ్వ, ఇడ్లీరవ్వ వంటివి మన దేశం నుంచి దిగుమతి చేసి అమ్ముతుంటారు. అందుకని తెలుగు వంట రుచి తగ్గకుండా తినొచ్చు.
ఇక్కడి సంప్రదాయ వంటల్లో మొక్కజొన్నపిండితో తయారుచేసిన ఉగాలి అనే ఉప్మా లాంటి వంటకం, మనదగ్గర బూరెల్లాగా చేసుకునే 'మందాజి' అనే వంటకం ఫేమస్. ఆహారపు అలవాట్లు కొంచెం పశ్చిమదేశాల అలవాట్లకు దగ్గరగా ఉంటాయి. అందుకనే కాబోలు బంగాళాదుంపల చిప్స్, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఫెర్టిలైజర్స్ వాడకుండా పంటలు
కూరగాయలు ఎంతో తాజాగా ఉంటాయి. దానివల్ల వంటకు రుచి పెరుగుతుంది. ఇక్కడో ఆసక్తికర విషయం చెప్పాలి... ఈ ప్రాంతంలో పంటలు పండించడానికి ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ వంటివి వాడరు. కారణం నేల సారవంతంగా ఉండి, సమయానుకూలంగా వర్షాలు పడడమే కావచ్చు. అలాగే మన దగ్గరలాగా ఎంత ఖర్చుపెట్టయినా సరే... ఎకరానికి 50 బస్తాలు పండించాలనే దృక్పథం ఇక్కడి వారికి లేకపోవడం కూడా కావొచ్చు.
మొత్తంమీద ఆర్గానిక్ పంటలన్నమాట. జీడిపప్పు, కొన్ని రకాల సుగంధద్రవ్యాలు విరివిగా లభిస్తాయి. దాంతో జీడిపప్పును మన దగ్గర పల్లీల్లాగా లాగించేస్తుంటారు చాలామంది. వైద్యం విషయానికి వస్తే... సాధారణ వైద్యం వరకు ఫర్వాలేదు. కాని క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం కష్టమే. పక్క దేశాలకి పరుగెత్తాల్సిందే. డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాళ్లు మన దేశాల వంటి దేశాలకు వెళ్తుంటారు.
భాషా సమస్య ఉండదు
ఇక్కడ పనిచేసేందుకు వచ్చేవాళ్లకి భాషతో ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. చాలావరకు ఇంగ్లీష్ మాట్లాడతారు. కింది స్థాయి ఉద్యోగులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ప్రాంతీయ భాష స్వాహిలి తప్పక రావాలి. ఆ భాషకు లిపి లేకపోవడంతో ఇంగ్లీషు అక్షరాల్లో రాస్తారు. అంటే ట్రాన్స్‌లిటరేషన్ అన్నమాట. ఒకప్పుడు బ్రిటీష్ కాలనీగా ఉండడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడడం బాగా అలవాటయ్యింది వీళ్లకు.
దేశవిదేశీ సంస్కృతుల మిశ్రమంగా ఉంటుంది ఇక్కడి సంస్కృతి. సంప్రదాయబద్ధమైన దుస్తులతో పాటు, పాశ్చాత్య దుస్తులను కూడా ధరిస్తారు. జనాభాలో దాదాపు 60 శాతం ముస్లింలు ఉంటారు. మిగతావాళ్లు క్రైస్తవులు. రెండు మతాల సంప్రదాయ పండుగలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కుటుంబ వ్యవస్థకు ఎంతో గౌరవమిస్తారు. ఆచారాలకు కట్టుబడి ఉంటారు. ఇప్పటికీ కన్యాశుల్కం పద్ధతినే అనుసరిస్తారు.
గ్రామాలు, పట్టణాల్లో సదుపాయాలు ఇంకా అభి వృద్ధి చెందాలి. వృత్తివిద్యలు, చెక్కబొమ్మలు తయారుచేయడం, పశువులపెంపకమే (మసాయిలు అనే తెగ పూర్తిగా దీనిమీదే ఆధారపడుతుంది) ఇక్కడి వాళ్లకి జీవనోపాధి. వీటితోపాటు టూరిజం, చేపల పరిశ్రమ కూడా ఉపాధి కల్పిస్తుంది. ఐటి రంగం అంతగా అభివృద్ధిచెందలేదు.
అకౌంట్స్‌లో అవకాశాలు
విదేశాల నుంచి వచ్చే వాళ్లకి అకౌంట్స్ విభాగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిఎ, సిఎ (ఇంటర్) చేసిన వాళ్లకి, ట్యాలీవంటి అకౌంటింగ్ ప్యాకేజీలు చేయగలిగిన వాళ్లకి ఉద్యోగావకాశాలు ఎక్కువ. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకి కనీస ఆదాయం 500 అమెరికన్ డాలర్లు ఉంటుంది. రేడియో, టివి, మల్టీప్లెక్స్ సినిమాలు, క్లబ్బులు, కాసినోవాలు, హోటళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవలేదు. ఇంగ్లీషు, హిందీ సినిమాలు వస్తాయి. స్థానికంగా సినిమాల నిర్మాణం చాలా తక్కువ. మన దేశంలో సినిమాలు విడుదలయినప్పుడే ఇక్కడా విడుదలవుతాయి. అందుకని సినిమాలంటే ఇష్టమున్న వాళ్లకి వాటిని మిస్ అవుతామని ఫీలవ్వక్కర్లేదు.
కిళి మంజారో... భళా భళీ మంజారో...
రెండు వందల ఏళ్ల క్రితం ఇండియాను బ్రిటిష్ వాళ్లు పాలిస్తున్న కాలంలో... టాంజానియా-జాంజిబార్‌లకు రైల్వే లైను వేయడంకోసం కొందరు గుజరాతీలను షిప్పుల్లో టాంజానియాకి తీసుకుని వచ్చారు. అలా ఇక్కడ సెటిలైపోయిన గుజరాతీలు ఇప్పుడు వ్యాపారస్తులుగా మారిపోయారు. టాంజానియా జనాభాలో ఇప్పుడు వాళ్లు రెండు నుంచి మూడు శాతం వరకు ఉంటారు. ఒక రకంగా ప్రధాన ఆదాయ వనరులు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులతో పాటు ఉత్తరభారత దేశ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అందుకని ఇండియన్ రెస్టారెంట్లు ఎక్కువగానే కనిపిస్తాయి. దాంతో ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. తెలుగు వాళ్లం తరంగిణి సాంస్కృతిక సంఘం పెట్టుకున్నట్టే మిగతా భాషల వాళ్లు వాళ్ల సంఘాలు ఏర్పాటుచేసుకున్నారు.
మౌలిక సదుపాయాల దృష్ట్యా కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ శాంతిభద్రతల పరంగా బాగానే ఉంటుంది. నేరాలరేటు కెన్యా, ఉగాండావంటి పొరుగు దేశాలతో పోలిస్తే తక్కువ. పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు బోలెడు ఉన్నాయి ఇక్కడ. సెరంగటి జాతీయ పార్క్, మికూమి నేషనల్ పార్క్, సఫారీలు, కిలిమంజారో పర్వతం... ప్రత్యేక ఆకర్షణలు. రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యమే. భారత సంతతికి చెందిన ఐదుగురు సభ్యులు ఈ సారి పార్లమెంట్‌కి ఎంపికవడం మరో విశేషం .

No comments:
Post a Comment