చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook
Showing posts with label friendship day. Show all posts
Showing posts with label friendship day. Show all posts

Wednesday, September 8, 2010

ఆస్టేలియా .. కొంచెం అసూయ ... కొంచెం చిన్నచూపు ...

కంగారూ..క్రికెట్..ఈ రెండు పేర్లు చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది ఆస్ట్రేలియా. ఇండియాకు కాస్త దగ్గరగా..అమెరికా తర్వాత మన యూత్‌కి గమ్య స్థానంగా మారిందీ దేశం. ఈ రెండు దేశాల మధ్య సంబంధం ఎలాంటిదంటే.. క్రికెట్‌లో ఈ దేశానికి ఆ దేశం గట్టి పోటీ. చదువుల్లో... ఉద్యోగాలు సంపాదించడంలో అక్కడి స్థానికులకు మన ఫారినర్లు మహా పోటీ. ఎంతంటే..దాన్ని అసూయగా మలచుకుని వీళ్లను వాళ్లు కొందరు కొట్టేంత. అయినా ఆస్ట్రేలియా ఆశ పెంచే దేశమే మనవాళ్లకు. 
అక్కడి వాళ్లలో కలిసిపోయే చిన్న కిటుకు తెలిస్తే చాలు ఇట్టే ఐస్ అయిపోతారు అని చెప్తున్నారు రెండేళ్లుగా మెల్‌బోర్న్‌లో ఉంటున్న మల్టీమీడియా స్టూడెంట్ తుమ్మల సునీల్ రెడ్డి.
నేను ఆస్ట్రేలియా వచ్చి రెండేళ్లవుతోంది. మెల్‌బోర్న్‌లో ఉంటున్నాను. ఇండియాలో డిగ్రీ చదివి మల్టీమీడియాలో డిప్లమా కోర్సు చేయడానికి ఇక్కడికి వచ్చాను. చదువుకుంటూనే రెండు ఉద్యోగాలు చేస్తున్నాను. ఒకటి వాలంటరీ జాబ్. ఇంటర్న్‌షిప్‌లాగా. టెంపరరీ రెసిడెంట్‌షిప్ పొందడానికి సంబంధిత రంగంలో ఆరునెలల ఇంటర్న్ షిప్ చేయడం చాలా అవసరం ఇక్కడ. అందుకే ఉదయం పూట ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ జాబ్ చేస్తున్నాను. ఇంకో ఉద్యోగమేమో 'ది ఏజ్' అనే న్యూస్ పేపర్‌లో మార్కెటింగ్ ఫీల్డ్‌లో. ఆ పత్రికకు చందాదారులను చేర్పించే పనన్న మాట.

వారానికి రెండు రోజులే
నేను ఫ్రెండ్స్‌తో కలిసుంటున్నాను. ప్రతి సోమ, శనివారాలు మాత్రమే కాలేజ్ ఉంటుంది మాకు. వారానికి రెండురోజులే. బ్యాచ్‌లను బట్టి ఇలా విభజిస్తారు. కాలేజ్ స్ట్రిక్ట్‌గా ఏమీ ఉండదు. ఉదయం ఏడింటికల్లా రెడీ అయిపోయి బయటపడతాను. రైళ్లు, ట్రామ్‌లు, బస్‌లు ఉంటాయి. ఇక్కడో విషయం చెప్పాలి.

విదేశాల్లో అన్నీ టైమ్ ప్రకారం జరుగుతాయి అనుకుంటారు కాని ఇక్కడ మాత్రం అంత పంక్చువాలిటీ ఏమీ ఉండదు. ఇవి చాలా వరకు ఆలస్యంగా నడుస్తుంటాయి. మరీ గంటలు గంటలు కాదు కాని ఐదు, పది నిమిషాలు లేట్ అవుతుంటాయి. ఒక్కోసారి రద్దవుతుంటాయి కూడా. మొత్తమ్మీద గంట ప్రయాణం చేసి ఎనిమిదికల్లా ఆఫీస్ చేరుకుంటాను. పదింటి దాకా అక్కడ పని చూసుకుని (కాలేజ్ ఉన్న రోజుల్లో ) కాలేజ్‌కి వెళ్తాను.

మూడింటి వరకు కాలేజ్. పొద్దున్న ఇంట్లో కార్న్‌ఫ్లేక్సే టిఫిన్. ఓపికుంటే వంట చేసుకోవడం లేదంటే బయట తినడం. కాలేజ్‌లో క్యాంటీన్ ఉండదు. మెక్‌డొనాల్డ్స్, కెఎఫ్‌సి లాంటి రెస్టారెంట్లు ఉంటాయి. నార్త్ ఇండియన్ రెస్టారెంట్లు కూడా ఉంటాయి. (ఇండియాలో దొరికే ప్రతి వస్తువు ఇండియన్ స్టోర్స్‌లో దొరుకుతుంది) ఆస్ట్రేలియన్లు మన ఫుడ్‌ని చాలా ఇష్టపడతారు. కాని కారాన్ని భరించలేరు. లంచ్ తర్వాత మూడింటికి 'ది ఏజ్' పత్రిక ఆఫీస్‌కి వెళ్తాను. ఇక్కడ నా పని..ఫోన్లో అప్పాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకోవడం..వాళ్లు ఇచ్చిన టైంకి వాళ్ల దగ్గరకి వెళ్లడం, చందా కట్టించుకోవడం. ఆ పని చూసుకుని ఇంటికి వెళ్లేసరికి రాత్రి పదకొండు అవుతుంది. రాత్రి మాత్రం వంట చేసుకుంటాం.

వాళ్ల పద్ధతుల్ని ఆచరిస్తే....
వీకెండ్స్ మామూలే. శనివారం మార్కెటింగ్ వాళ్లకు ఎక్కువ పనుంటుంది. అందుకే నాకు ఆదివారం ఒక్క రోజే సెలవు. ఆ ఒక్కరోజు బట్టలుతుక్కోవడం, ఇంకేమైనా చిన్న చిన్న పనులు చేసుకోవడంతోనే సరిపోతుంది. టైం ఉంటే సినిమాలు చూస్తాం. ఇక్కడ రెండు థియేటర్స్ ఉన్నాయి, వాటిల్లో హిందీ, తెలుగు సినిమాలు వస్తాయి కాని పెద్ద పెద్ద స్టార్స్‌వి మాత్రమే.

మా చుట్టుపక్కల వాళ్లంతా ఆస్ట్రేలియన్లే. కొంత మంది చాలా బాగా మాట్లాడతారు. పార్టీలకు పిలుస్తుంటారు. కొంతమందైతే అసలు పట్టించుకోరు. వాళ్ల పద్ధతులను, అలవాట్లను మనవిగా చేసుకుంటే మనతో చాలా బాగా ఉంటారు. ఇక్కడ చిన్న వయసులోనే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉండడం మామూలే. దాన్ని కామెంట్ చేసినా...విమర్శించినా...అసలు సహించరు.

చిన్నచూపు ఎక్కువే

పత్రిక చందాదారులను చేర్పించడానికి ఆస్ట్రేలియన్ల దగ్గరకి వెళ్తుంటానని చెప్పాను కదా.... రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. కొంతమంది చాలా సాదరంగా ఆహ్వానిస్తారు. ఇక్కడెలా ఉందని అడుగుతారు, ఉద్యోగ అవకాశాల గురించి ఆరా తీస్తారు. కాని కొన్ని చోట్ల, కొంత మంది దగ్గర తీవ్రమైన పరాభావం ఎదురవుతుంటుంది. ఇండియన్స్ అంటే చాలు..బతకడానికి ఇక్కడి దాకా వచ్చిన వాళ్లని చాలా చిన్న చూపు చూస్తారు. అవమానం అనిపిస్తుంటుంది. కొద్ది క్షణాలు బాధపడి తర్వాత మర్చిపోయి ఉద్యోగ నిర్వహణలో పడిపోతాం.

అవసరం అలాంటిది మరి. పర్మనెంట్ రెసిడెంట్స్‌గా ఉండాలని వచ్చేవారికి ఇలాంటి వాటిని సహించే ఓర్పు వచ్చేస్తుంది. అసలు ఈ జాత్యాహంకారం ఇక్కడి యూత్‌లోనే ఎక్కువ. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వాళ్లను చూస్తే వీళ్లు సహించలేరు. ప్రత్యేకించి కారణమేమీ కనపడదు. నేను పరిశీలించినంత వరకు...ఇక్కడ పధ్నాలుగేళ్లకే సంపాదన మొదలుపెడతారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా ఉండదు.

పని చేసుకోవాలి..చదువుకోవాలి.. అంతే.ఇండియన్స్ వచ్చి చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతుంటే.. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మంచి హోదాలు సంపాదించుకుంటున్నారనే అసూయలాంటిదేదో వాళ్లలో కలిగి జాత్యహంకారం చూపిస్తారేమోనని అనిపిస్తుంది. చైనీయుల్ని, లెబనీయుల్ని వీళ్లు ఏమీ అనరు. (చైనీయులు ఇక్కడ ఇన్వెస్టర్స్‌గా ఉంటారు కాబట్టనుకుంటా)ఇంకో విషయం ఏంటంటే..లెబనీయులు కూడా మన మీద పెత్తనం చూపిస్తుంటారు. అసలు ఆస్ట్రేలియన్లకన్నా వీళ్లే ఎక్కువ పెత్తనం చెలాయిస్తుంటారు. అయితే ఎన్ని దాడులు చేసినా భారతీయ స్త్రీల జోలికి మాత్రం వెళ్లినట్టు నేనెక్కడా నోటీస్ చేయలేదు.

క్రీడా ప్రియులు
మనం సంపాదించడానికే ఇక్కడికి వస్తుంటాం కాబట్టి లక్ష్యమంతా డబ్బు సంపాదన మీదే ఉంటుంది. వాళ్లకు సహజంగానే అలా ఉండదు. నేను చూసినంత వరకు ఆస్ట్రేలియన్లు రెండు గంటలు ఏకధాటిగా పని చేయలేరు. ప్రతి అరగంటకు వాళ్లకు కాఫీ బ్రేకో, స్మోక్ బ్రేకో..కావాల్సిందే. వీకెండ్ కోసమైతే అర్రులు చాస్తారు. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి దాకా ఎంజాయ్ మూడ్‌లోనే ఉంటారు. ఆటలంటే వీళ్లకు అమిత ఆసక్తి, ఒక రకంగా చెప్పాలంటే ఆటలు వాళ్ల జీవితంలో భాగం, చదువుకంటే కూడా ఆటలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. క్రికెట్, ఫుటీ(రగ్బీలాంటి గేమ్) లాంటి ఆటల్ని ఎక్కువగా ఇష్టపడతారు. జాతీయభావం ఎక్కువ.

హిందు, పాక్ భాయి భాయి
ఆసియాలో ఇండియా, పాక్ అంటే బద్ధ శత్రువులు కాని ఇక్కడ మాత్రం భాయి..భాయిగా ఉంటారు. పాకిస్తానీ ఆర్గనైజేషన్స్, ఇన్స్‌స్టిట్యూట్‌లో ఇండియన్లకు తగిన ప్రాధాన్యం ఇస్తారు. ఫీజు చెల్లింపు విషయాల్లో కూడా వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటును ఇస్తారు. అందరం ఒక్కటనే భావనే ఉంటుంది. పండగలు లాంటి సమయాల్లో తెలుగు వాళ్లే కాకుండా అందరం కలుసుకుంటాం. తెలుగు వాళ్లమైతే దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాం. ఇక్కడ మురుగన్ గుడి, సాయిబాబా దేవాలయాలున్నాయి. నెలలో రెండు సార్లు వెళ్తుంటాం.

అనుకున్నంత గొప్పగా...
దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇక్కడ అనుకున్నంత గొప్ప అవకాశాలైతే ఏమీ లేవు. మాస్టర్ డిగ్రీ కోర్సులైతే బాగానే ఉంటాయి కాని డిప్లమా కోర్సులను ఇక్కడి కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ స్టాండర్డ్ చదువును ఇండియాలోనే పొందవచ్చు. అయితే ఇక్కడ పిఆర్(పర్మనెంట్ రెసిడెన్సీ) పొందడం కోసం చదువు వంకతో వస్తుంటాం. కాని చాలా కష్టం.

మాస్టర్స్ చేసిన వాళ్లకు కూడా చదువు అయిపోగానే ఉద్యోగాలు వచ్చి వాలడం లేదు. మనకు సంబంధించి ఎవరో ఒకరు లిఫ్ట్ ఇచ్చే వాళ్లు లేకుండా ఇక్కడ ఉండడం ఇబ్బందే. డబ్బుల్లేక, ఫీజు కట్టలేక వెనక్కి వెళ్లిపోయిన వాళ్లెందరో ఉన్నారు. పైగా డిప్లమాలాంటి కోర్సులు చేస్తున్న వాళ్లు జాత్యాహంకారానికి బలైతే భారత ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదని విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ కూడా ప్రకటించారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎవరైనా ఆస్ట్రేలియా వైపు అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎవరినీ నిరుత్సాహ పరచాలని మాత్రం ఇదంతా చెప్పడం లేదు.
జూ సరస్వతి రమ

Sunday, September 5, 2010

వెన్నెల మళ్లీ వచ్చేసింది కానీ....

"చాంద్ ఫిర్ నిక్‌లా- మగర్ తుమ్ న ఆయే
జలా ఫిర్ మెరా దిల్- కరూ క్యా మై హాయ్''
(మళ్లీ వెన్నెల వచ్చేసింది. కానీ, నువ్వే రాలేదు
మనసంతా కాలిపోతోంది. నేనిప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు.)

ఎప్పుడో 1957లో విడుదలైన 'పేయింగ్ గెస్ట్' సినిమాలోని ఈ పాట దేశంలోని కోట్లాది గుండెల్ని పిండేసింది?
దూరంగా ఎక్కడో కొండ గుహల్లో ప్రతిధ్వనిస్తున్నట్లు లతామంగేష్కర్ స్వరం వినిపిస్తోంది. నిజమే మరి! ఆ ప్రియతముడు ఆలస్యంగానైనా వస్తాడో లేదో తెలియదు గానీ, చంద్రుడు మాత్రం వేళకే వేంచేస్తాడు. ప్రియతముడికి ఉన్నన్ని బాధలు చంద్రుడికి కూడా ఉండి ఉంటే అతడు కూడా అందరిలాగే కారణాలు చెప్పేవాడు.

అయినా, తెలియక అడుగుతాను? వేళాపాళా లేనిది మీకేనని మనుషుల్ని వెక్కిరించడానికి కాకపోతే సూర్యచంద్రులూ, నక్షత్రాలూ అంత కచ్చితమైన వేళల్ని పాటించడం ఏమిటండీ?తమవైనవన్నీ తమ చేతుల్లోనే ఉండిపోవడం వల్లే కదా ఆ టెక్కు! అన్నింటి మీదా నియంత్రణ ఉంది కాబట్టి అన్నీ తామనుకున్నట్టే జరిగిపోతే జరిగిపోవచ్చు.

కానీ, మనిషి పరిస్థితి వేరు కదా! అతడేమైనా గ్రహమా? నిర్ణీత కక్ష్యలో పరిభ్రమించడానికి, గోడ గడియారమా? నిర్ణీత క్రమంలో లోలకంలా ఊగడానికి. మనిషి జీవితమేమైనా పుస్తకమా? పేజీ తరువాత పేజీ క్రమం తప్పకుండా రావడానికి. అతనికో జీవితం ఉండి ఏడ్చింది కదా! ఇక్కడ అనుకున్నదొకటైతే జరిగేది మరొకటి. జీవితంలో నవ్వించే క్షణాల కన్నా ఏడ్పించేవే ఎక్కువాయె. అర్థం చేసుకోరు? సమయం మించి పోయిందీ అంటే సంజాయిషీ ఇచ్చుకోవలసిందే కదా!

జీవన స్పృహ ఏ క్షణాన ఆత్మలోకి చొరబడుతుందో ఏమో కానీ, నిలువెత్తు నిప్పురవ్వలా ఉన్నవారు సైతం క్షణాల్లో నీరైపోతారు. మందహాసం కనుమరుగై కళ్లల్లో ఆ విషాదం కదలాడుతుంది. ఎవరో ఎందుకు? నాకైతే ఆ ఎదురింటి అమ్మాయిని చూస్తుంటే ఎంతలో ఎంత మార్పు వచ్చేసిందా అనిపిస్తుంది. ఎప్పుడూ తూనీగలా తారాడే ఆ అమ్మాయి ఇటీవలి కాలంలో ఎప్పుడు చూసినా ఒక శోకమూర్తిలా కనిపిస్తోంది. అనుకున్నవి అనుకున్నట్లే జరిగిన న్ని రోజులు ఎవరైనా తూనీగలే.

వికటించినప్పుడు కదా సమస్య. పరిస్థితులు ఎంతో కొంత తన అధీనంలోనే ఉన్నట్టు మనిషి అనుకుంటాడే కానీ, అంత నియంత్రణలో ఎప్పుడుంది కనుక! కాకపోతే ఆ ప్రతికూల పరిస్థితుల్లోనూ తనను తాను సంభాళించుకునే శక్తి మాత్రం అతనికి ఉంటుంది. నిజానికి గ్రహాల గమనంలో ఏ కాస్త తేడా వచ్చినా విశ్వాంతరాళమంతా క్షణాల్లో తునాతునకలైపోవచ్చేమో కానీ, ఎన్ని తేడాలు వచ్చినా మనిషి చాలా సార్లు ఆ విధ్వంసాన్ని నిలువరించే ప్రయత్నం చేయగలడు. కాకపోతే తన ప్రతి ప్రయత్నమూ ఫలించకపోవచ్చు. ఆ విషాదాన్ని ఆపలేకపోవచ్చు. లేదా మన ప్రయత్నానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండానే కొన్ని విషాదాలు జరిగిపోవచ్చు.

అలాంటి సంఘటనేదో జరిగిపోవడం వల్లే కదా ఆ అమ్మాయి ఒక శోకమూర్తిలా మారిపోయింది. అప్పటి నుంచే కదా సూర్యుడు అస్తమించగానే డాబా మీదికి వచ్చి అదేపనిగా ఆకాశాన్నీ, నేలనూ తేరిపార చూస్తూ ఉంటుంది.

తమలో భాగమై తమ చుట్టే పరిభ్రమిస్తూ తమను ఆవరించుకుని తమ మధ్య తిరగాడిన ఆ వెన్నెలను తలుచుకుంటూ ఎంత సేపు అలా ఉండిపోతుందో తెలియదు. ఆమె డాబా మీదికి వచ్చి అలా ఆకాశంలోకి తదేకంగా చూస్తున్నప్పుడు ఎంత కాదనుకున్నా మనసులో ఆ పాటే వినిపిస్తూ ఉంటుంది. నిజంగా ఆ పాటలోని ఏ పాదం విన్నా మనసు ఇట్టే కరిగి నీరైపోతుంది.

ఈ రోజులింక ముగిసినట్లేనని ఈ రేయి అంటోంది.
నువ్వు నాకింక లేవని నా మనసుకు కూడా తెలిసిపోయింది.
అయినా నా చూపులు పరిచి నీకోసం ఇక్కడే నిలుచున్నాను.
అయ్యో నేనింకేం చేయగలను? నువ్వేమో జ్ఞాపకం వస్తున్నావాయె!
ఎక్కడైతే మాటలు ఆగిపోతాయో అక్కడ పాటలు మొదలవుతాయి అంటారు. అంత భావోద్వేగాన్ని వ్యక్తం చేయడానికి మామూలు మాటలేం సరిపోతాయి. అందుకే పాట ప్రవేశించింది.

మండుతున్న నా ఎదలోంచి పొగలేవో లేస్తున్నాయి
ఇకనన్నా వచ్చేసేయ్ నా శ్వాస విలవిల్లాడుతోంది.
వసంతాల నీడలే నా దేహాన్ని కాల్చేశాయి
అయ్యో నేనింకేం చేయగలను? నువ్వేమో జ్ఞాపకం వస్తున్నావాయె!
గుండె మండిపోతున్నప్పుడు గ్రీష్మరుతువే కానక్కర లేదు. ఒకోసారి వసంతాలు కూడా అగ్నికురుస్తాయి. ఆ భావమే ఈ పాటలో ధ్వనిస్తోంది. జీవితం అక్షర బద్ధమై ఇలా ప్రవహిస్తుంది.
- బమ్మెర

Thursday, September 2, 2010

పాజిటివ్‌ ధికింగ్‌..

ప్రస్తుతం మహిళలే కాదు పురుషులు కూడా అందం అంటే కేవలం ఎర్రని మేనిఛాయగా భావించడం లేదు. సంప్ర దాయ సౌందర్య పట్టికలో ఇప్పుడు ముఖం, కళ, ఫిగర్‌, హెయిర్‌ స్టయిల్‌, నడకతీరు, వ్యక్తిత్వం అన్నిటినీ చేర్చారు. ఎరుపు రంగు స్థానాన్ని ఇప్పుడు ఆత్మవిశ్వాసం, బోల్డ్‌నెస్‌,గ్లామరస్‌ లుక్‌, పాజిటివ్‌ ఆలోచనలు ఆక్రమించుకున్నాయి. మహిళల్లోని సహజమైన తెలివితేటలు, ఆత్మ విశ్వాసంతో కూడిన స్వభావం, పాజిటివ్‌ థింకింగ్‌, సహకరించే మనస్తత్వం లాంటివి ఎరుపు రంగును పక్కన పెట్టేస్తున్నాయి ప్రస్తుతం సౌందర్య కొలమానంలో, సౌందర్య పోటీల్లో కళ్ళు, ఫిగర్‌, చిరునవ్వు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

వ్యాయామమే బెస్ట్‌...

positiveఆకర్షణీయంగా కనిపించడానికి ఒంటి ఛాయ ఎరుపుగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ శరీరాన్ని చురుగ్గా కదిలేలా తయారు చేసుకోవాలి. దినచర్యలో భాగంగా ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, జాగింగ్‌ తప్పకుంగా చేయాలి, టెన్నిస్‌, బ్యాడ్‌మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌లాంటి ఆటలు ఆడాలి. ఇలా చేస్తే హెల్దీగా,చురుగ్గా ఉంటారు.

చామనఛాయ..
ఒక వేళ శరీరం చామన చామనఛాయ కల్గి ఉంటే ఎప్పుడూ సాధారణ మేకప్‌ చేసుకోరాదు. కాలానికి అనుగుణంగా మేకప్‌ చేసుకోవాలి. అప్పుడు చామన ఛాయలో కూడా ఆకర్ష ణీయంగా కనబడతారు.చర్మం కోమలంగా, మెరిసేలా ఉండటం కోసం నెలలో ఒకసారి ఫేషియల్‌,15 రోజుల కొకసారి బ్లీచ్‌ చేయించాలి. కాళ్ళు, చేతులకి వారానికి ఒకసారి మేనిక్యూర్‌, పెడిక్యూర్‌ చేయించాలి. అవాంఛిత ప్రదేశాలలో వెంట్రుకలను రిమూవ్‌ చేసుకోడానికి వాక్సింగ్‌ లేదా హెయిర్‌ రిమూవర్‌ క్రీమ్‌ ఉపయోగించడం మంచిది. వారంలో రెండుసార్లు ముఖం పై ఫేస్‌ స్కృబ్‌ ఉపయోగించాలి. ఇలా చేస్తే చామనఛాయ చర్మం కూడా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. దీనితో ఆకర్షణీయమైన శరీరం మీసొంత మవుతుంది.

పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌
badypఅయితే అందమైన శరీరమే కాదు, చురుకైన మెదడు కూడా ఉండాలి. దీనికోసంమీలోని క్రియేటివిటీని అభివృద్ధి చేసుకోవాలి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ పుస్తకాలు చదవడం ఎంతో ఉపయోగకరం. అల్లికలు, వంటలు, కుట్టుపనులు మొదలైన అంశాల్లో సొంతంగా ప్రావీణ్యం సంపాదించండి. అందాల పోటీలకే కాదు, ఉద్యోగాలకైనా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ఆకట్టుకునే కనుముక్కు తీరు వుండడం ముఖ్యం. అంతే కానీ శరీరఛాయ నలుపు లేదా ఎరుపు రంగులో వున్నదా అన్నది ముఖ్యం కాదు. దీనితో బాటు పాజిటివ్‌ బాడీ లాంగ్వేజ్‌ కూడా అవసరం. అసభ్యత, ఓవర్‌ బోల్డ్‌నెస్‌ ెరీర్‌ను ముందు నడిపించలేవు. ఆఫీసులో పనిచేయ డానికి అందమైన ముఖంతో బాటు పనిలో నిర్దేశిత లక్ష్యాలను సాధించే నేర్పు కూడా ఎంతో అవసరం.

డ్రెస్సు.. సెన్సు...

thinkingబైటికి వెళుతునప్పుడు మనం ధరించే దుస్తులు కూడా మన వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తాయి. దుస్తుల్ని సెలక్ట్‌ చేసుకునేటప్పుడు వాటి రంగు, డిజైన్‌ మీకు సూట్‌ అవుతుందా లేదా అని గమనించండి. చామనఛాయ రంగు ఉన్న అమ్మాయిలు ఆకర్షణీయంగా కనబడే రంగుల దుస్తుల్ని వేసుకోవాలి.బ్రైట్‌ కలర్స్‌ నీలి, రస్ట్‌, గులాబీ, ఆరంజ్‌ రంగులన్నీ చామన ఛాయ రంగున్న వారికి సందర్భోచితంగా సరిపోతాయి. గులాబి రంగు మేని ఛాయ గలవారు వాడవలసిన రంగుల గురించి వివరంగా వర్ణించనవసరం లేదు. వారికి ముదురు రంగులతో పాటుగా, లేత రంగులు కూడా నప్పుతాయి. ఎరుపైనా నలుపైనా తమలో వున్న పాజిటివ్‌ అంశాల వైపు దృిష్టిసారించాలి.

Wednesday, August 18, 2010

ఫోన్ పాడితే జేబు నిండుతుంది!

"అనిత అని టైప్ చేసి 56263 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయండి. మీరు కోరుకున్న పాట క్షణాల్లో డౌన్‌లోడ్ అయిపోతుంది..'' ఒక చిన్న సమాచారం విద్యుత్ వేగంతో జనాల్లోకి వెళ్లిపోయింది. ఒకటి.. రెండు.. మూడు.. వెయ్యి.. పదివేలు.. యాభైవేలు.. లక్ష.. పది లక్షలు.. ఇరవై నాలుగు లక్షల మంది స్పందించారు.

వామ్మో! ఈ అంకెలను చూసి మీకే కాదు, పంపన త్రినాథ్‌కూ దిమ్మతిరిగింది. 'అనితా ఓ అనితా' అనే ప్రైవేటు ఆల్బమ్‌లోని పాటను డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్ల సంఖ్య అది. అక్షరాలా ఇరవై నాలుగు లక్షల మంది. ఒకర్ని చూసి మరొకరు. వాళ్లను చూసి ఇంకొందరు. ఏ కుర్రాడి జేబులో సెల్‌మోగినా ఇదే పాట. ఇంతకూ ఆ పాటలో ఏముంది..? ఎన్నో మధురమైన సినీ గీతాలుండగా, ఈ పాటంటేనే జనాలకు ఎందుకంత పిచ్చి..? అని మీరు కొట్టిపారేయవచ్చు.

అంటే ఆ పిచ్చినే వ్యాపారం చేసుకుంటే ఎలాగుంటుంది..? అనే ఆలోచన మీ బుర్రకు రాలేదన్న మాట. త్రినాథ్ బుర్రకు వచ్చింది. 'కాలర్‌ట్యూన్ల' వ్యాపారంలో అది కేక పుట్టించింది. "ఎప్పుడు ఏ గాలి వీస్తుందో ఎవ్వరికీ తెలీదు. గాలి వీసినప్పుడే తూర్పారబట్టుకోవాలి...'' పంట నూర్పిడి సూత్రాన్నే వ్యాపారానికి అన్వయించిన ఈ కుర్రాడు చదువుకుంది మళ్లీ ఐఐటీనో, ఐఐఎంనో కూడా కాదు. బీఏకంటే వీసమెత్తు మెరుగైన బీకాం అయిందనిపించాడు.
సినిమాల నుంచి వెనక్కి..

అందరి కుర్రాళ్లలాగే త్రినాథ్‌కూ సినిమాల పిచ్చి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ నుంచి చెన్నై చెక్కేశాడు. అమ్మానాన్నలది సాధారణ రైతు కుటుంబం. "నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే యమక్రేజ్. నా సినిమా కలలు సాధ్యం కావాలంటే నా వయసు, అనుభవం సరిపోవని చెన్నై వెళ్లాక తెలిసింది..'' అంటున్న త్రినాథ్ ఒట్టి చేతులతో వెనక్కి రాలేక అక్కడే డీఎఫ్‌టెక్ డిప్లమో చేశాడు.

తర్వాత పెట్టేబేడా సర్దుకుని మన హైదరాబాద్ వచ్చేశాడు. అక్కడక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చక్కర్లు కొట్టాడు. ఉప్పలపాటి నారాయణరావు దగ్గర కొంతకాలం పనిచేశాడు. ఎంతకాలం ఇలా...? తనే సొంతంగా వ్యాపారంలోకి దిగితే, ఆ మాటే తమిళ స్నేహితులతో చెబుతుండేవాడు.

దేశమంతా తిరిగి..

అప్పటికే వాళ్లు యాడ్ఏజెన్సీలు పెట్టి సక్సెస్ అయ్యారు. "నీ ఆలోచనల్లో కొత్తదనం, తపన ఉన్నాయి. చురుగ్గా స్పందించే గుణం ఉంది. నువ్వు కూడా సృజనాత్మకరంగంలోకి అడుగుపెట్టు'' అని ఎప్పుడూ ఉచిత సలహాలు ఇచ్చే స్నేహితులు ఈసారి ఖరీదు సలహా ఇచ్చారు. కానీ, తన దగ్గర పెద్దగా పెట్టుబడి లేదు. ఉన్నది ఒక్క ఆత్మవిశ్వాసమే.

అదే తన పెట్టుబడి అనుకున్నాడు. నేరుగా హైదరాబాద్‌లోని చందనాబ్రదర్స్ యజమాని దగ్గరికి వెళ్లి, 'సార్, ఒట్టి అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇస్తే తక్కువ మందే చూస్తారు. ప్రజలకు ఉపయోగపడే సమాచారంతో సీడీలు తయారుచేసి, అందులో ప్రకటనలు ఇస్తే మీ సంస్థ గురించి చాలా కుటుంబాలకు తెలుస్తుంది..' అన్నాడు. ఆయన 'సరే, ఒక్కసారి చేసివ్వు చూద్దాం' అన్నారు.

ఒక వీడియో కెమెరా భుజాన తగిలించుకొని ఇండియా మొత్తం చుట్టేసి 'ద్వాదశ జ్యోతిర్లింగాలు' సీడీని ఆయన చేతుల్లో పెట్టాడు త్రినాథ్. అది ఆయనకు తెగ నచ్చింది. ఇంకేముంది..? ఏటా రెండు లక్షల సీడీలు రికార్డు చేసి చందనా వాళ్లకిచ్చే ఆర్డర్ దక్కించుకున్నాడు త్రినాథ్. అక్కడి నుంచి మరికొన్ని మన రాష్ట్రంలోని 'పంచారామక్షేత్రాలు', 'గోదావరి' సీడీలను ప్రమోషన్ కింద కొన్ని సంస్థలకు తయారుచేసిచ్చాడు. అవి కూడా ఏటా కనీసం రెండు లక్షల సీడీలు చేసివ్వాలి. ఈసారి సొంతంగా సీడీ మానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టాడు. పట్టుదల+ఆత్మవిశ్వాసం కలిశాక జీవితంలో కొత్తరుచి దొరికింది త్రినాథ్‌కు. 'మై3 ఆడియో అండ్ వీడియో'సంస్థ ప్రాణం పోసుకుంది.

కాలర్‌ట్యూన్‌ల నాడి పట్టుకొని..

ఇరవైఏడేళ్ల ఈ కుర్రాడికి తోటి కుర్రాళ్ల మనస్తత్వాన్ని పసిగట్టడం చాలా సులువు. తన చిన్న వ్యాపారాన్ని ట్రెండుకు తగ్గట్టు నడపాలనుకున్నాడు. అప్పటికే ప్రముఖ మ్యూజిక్ కంపెనీలు కాలర్‌ట్యూన్, రింగ్‌టోన్‌ల బిజినెస్ చేస్తున్నాయి. రిలీజైన కొత్త సినిమాల ఆడియో హక్కులు ఎంత ఖరీదైనా వారే కొనుక్కుంటున్నారు. 'అంత పోటీలో నువ్వు ఎలా నిలబడదామని అందులోకి దిగావ్..?' అంటే- "నాక్కూడా మొదట్లో అదే భయం కలిగింది.

సంగీతమంటే సినిమాలే కాదు కదా, బయట దొరికే ప్రైవేటు సాంగ్స్, జానపదగేయాలు, పద్యాలు, భక్తి గీతాలు.. వీటి హక్కులు కొని, కాలర్‌ట్యూన్స్ పెడితే ఎలాగుంటుంది..? అన్న ఆలోచన వచ్చింది.

ఏ రాష్ట్రంలో ఎలాంటి కాలర్‌ట్యూన్లు క్లిక్ అవుతున్నాయో తెలుసుకొనేందుకు దక్షణాది ప్రాంతాలన్నీ తిరిగాను. వ్యాపారసంస్థలతో మాట్లాడాను..'' అని చెప్పిన త్రినాథ్ తెలుగులో అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న రెండువేల భక్తిగీతాల డిజిటల్ హక్కులను కొనేశాడు. ఈ పాటలు రాష్ట్రంలోని అన్ని దేవుళ్లపై ఉన్నాయి. మరో 40 చిన్న సినిమాల పాటల డిజిటల్ హక్కులను కూడా కొన్నాడు.

కిటుకు కునుక్కొని..

డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారుడి నుంచి 10 నుంచి 15 రూపాయల దాకా టెలిఫోన్ ఆపరేటర్లకు వెళుతుంది. అందులో డిజిటల్ హక్కులు తీసుకున్న త్రినాథ్ ఖాతాకూ కొంత మొత్తం వెళుతుంది. ఆ కిటుకులన్నీ తెలుసుకున్న త్రినాథ్ ఇప్పటి వరకూ 2,400 కాలర్‌ట్యూన్స్, రింగ్‌టోన్స్‌ను అప్‌లోడ్ చేశాడు. ఇందులో కొన్నే క్లిక్ అయ్యాయి.

"మొదట్లో ఆశించినంత ఫలితం రాలేదు. మన రాష్ట్రంలోని యూత్‌కు వారానికి రెండుసార్లు కాలర్‌ట్యూన్స్ మార్చే అలవాటుంది. వాళ్లకు ఏ పాట నచ్చుతుందో అంచనా వేయడం చాలా కష్టం. "అనితా, ఓ అనితా' ప్రైవేటు ఆల్బమ్‌లోని పాటల్ని విన్నప్పుడు వీటిని కాలర్‌ట్యూన్స్‌గా పెడితే కచ్చితంగా హిట్ అవుతుందనుకున్నా. వెంటనే ఆల్బమ్ చేసిన యువకుడి నుంచి రైట్స్ కొనుక్కున్నా..'' అదే తన దశ తిరిగేలా చేస్తుందని త్రినాథ్ కలలో కూడా ఊహించలేదు.

ఇప్పటివరకు 24 లక్షల మంది ఆ పాటను డౌన్‌లోడ్ చేసుకొని కాలర్‌ట్యూన్‌గా పెట్టుకున్నారు. ఇదొక రికార్డు. టాప్-5 ట్యూన్లలో ఈ పాట చేరిపోయింది. "ఏటా మన రాష్ట్రంలో కాలర్‌ట్యూన్ల వ్యాపారం సుమారు 10 నుంచి 15 కోట్ల రూపాయలు. ట్యూన్లు పెట్టుకుంటున్న వాళ్లు ఎంతమందో తెలుసా రెండు కోట్ల మంది..! ఒకప్పుడు భక్తిపాటలు, సినిమా పాటలు పెట్టుకొనేవారు. ఇప్పుడు తెలంగాణ, బోనాలు, జానపదగేయాలు, తెలుగుతల్లి పాటలు పెట్టుకుంటున్నారు.

తమ వ్యక్తిత్వాన్ని కాలర్‌ట్యూన్స్ ద్వారా అవతలివాళ్లకు వ్యక్తీకరించుకొనే ట్రెండ్ మొదలైంది. మనుషులందరికీ సెల్‌ఫోన్లున్నాయి. వాటికంటే ముందు వారికి ఒక కల్చర్ ఉంది. ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సెంటిమెంట్లున్నాయి. ఎమోషన్లున్నాయి. నా బిజినెస్‌కు ఇవే ముడిసరుకు. ఇన్ని రకాల మనుషులకు ఎన్ని రకాల కాలర్‌ట్యూన్లు కావాలో కనుక్కునే శక్తి మనకున్నంత కాలం.. ఈ బిజినెస్ ఎప్పటికీ ఏదో ఒక కొత్త ట్యూన్‌తో మోగుతూనే ఉంటుంది..'' అంటున్న త్రినాథ్, తన సెల్‌ఫోన్‌కు మాత్రం ఎలాంటి కాలర్‌ట్యూనూ పెట్టుకోలేదు. పక్కా బిజినెస్‌మ్యాన్.

Sunday, August 1, 2010

మిత్రమా ! కుశలమా !!

రెండు హృదయాల స్పందన... ఏకమై పాడే రాగాలాపన... నిస్వార్థపూరిత ప్రేరణ... అమూర్తిమత్వ భావన... అచెంచల చిత్రణ... కల్పాంతపు సూచన... అనిర్వచనీయ శోధన... అనునిత్య స్ఫూరణ... ఆదిదేవుళ్లే ప్రతిగా సృష్టిం చిన స్నేహబంధ కీర్తన... వర్ణంలేనిది... వార్ధక్యం రానిఈది... వజ్రం కన్నా దృఢమైనది... త్యాగాన్ని కోరేది... సత్సాంగత్యాన్ని చాటేది... ఈ సృష్టిలో తీయనిది స్నేహమే... ‘‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నా పెన్నిధి స్నేహమే నాకున్నది’’ అంటూ... స్నేహం విలువ తెలి యజేసేది... ‘‘ఇచ్చింది మరచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే’ స్నేహం అని జాతిపిత మహాత్మాగాంధీ స్నేహం విలువను చాటారు.

Friendship_Day3 ఈ సృష్టి ఉన్నంతకాలం నిలిచేది ఒక్క స్నేహమే... ఆదిదేవుళ్లు సృష్టి, స్థితి, లయకారకాలను కచ్చితంగా అమలుపరిచేది తమ స్నేహబంధంతోటే... జగన్మాతలు ముగ్గురూ స్నేహంగా ఉండబట్టే రాక్షస సంహారం గావించబడి లోకాలన్నీ శాంతించినాయి. ద్వాపరయుగంలో లేమికి నిర్వచనంగా చెప్పబడే కుచేలుడు ఇచ్చిన పిడికెడు అటుకులతో అతని స్నేహితుడైన శ్రీకృష్ణుడు అతనికి బంగారు పట్టణాన్నే బహూకరించి స్నేహం విలువను ఈ లోకానికి తెలియజేశాడు. మహాభారతంలో రారాజు ధుర్యోధనుడు, మానసపుత్రుడు కర్ణుడు మధ్యనున్న స్నేహం వెలకట్టలేనిది. స్నేహితుని కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి కర్ణుడు చరిత్ర లో నిలిచిపోయాడు. రామాయణంలో కూడా శ్రీరామునికి, ఆంజనేయునికి మధ్య ఉన్న స్నేహబంధం లతలా పెనవేసుకుపోయి భక్తిబంధంగా రూపుదాల్చింది. ఇలా యుగయుగాలలో భగవంతుడు స్నేహబంధం విలువను ఏదో ఒక రూపంలో మనుషులకు సూచిస్తునే ఉన్నాడు. స్నేహబంధంతో ఇరుదేశాల మధ్య రక్తపాతాన్ని ఆపవచ్చు... కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడ వచ్చు... దేశ ఉన్నతిని కాంక్షించవచ్చు... ఇలా చెప్పు కుంటూ పోతే స్నేహబంధం ఒక నిరంతర గంగా ప్రవాహం... దానిని అదుపు చేయడం గంగ వెల్లువను కమం డలంలో పట్టివుంచి నట్లవుతుంది...

‘జీవితపు టెడారిలో స్నేహాలు ఎండమా వులే... అయినా అక్కడక్కడా లేకపోలేదు అత్మీయతా ఒయాసి స్సులు’ అన్నాడో కవి. అటువంటి ఒయా సిస్సులలో సేదతీరే వారిదే అదృష్టం. స్నేహం లో పెరుగుతారు. స్నేహంలోనే వృద్ధులవుతారు. కొన్ని స్నేహాలు బంధాలవుతాయి. కొన్ని బంధనాలవుతా యి. కానీ అన్నీ సజీవంగానే వుంటాయి. ఇంత గొప్ప మానవ సంబంధానికి ప్రత్యేకంగా ఒక రోజు, వారం అంటూ కేటాయించడం మన సరదా అంతే. మానవ జీవితాలకి ఒక అర్థం కల్పించే స్నేహాలకి సలాం. స్నేహితులకు గులాం... రక్త సంబంధాలకూ, బీరకాయ పీచు బంధు త్వాలకూ, చత్వారపు చుట్టరికాలకూ అతీ తంగా ఉండేది స్నేహం. నిజానికి వాటన్నిటికన్నా అంద మైనదీ, అపురూపమైనదీ, అద్భుత మైనదీ, అత్యున్నతమైనదీ స్నేహమే. ఇటు వంటి ఎన్నో విశేషణాలు జోడించి స్నేహాన్ని వర్ణిం చడానికి చేసిన ప్రయత్నంలో ఎన్నెన్నో కథలు, కవితలు రూపొందాయి. కానీ స్నేహానికి వివరణలు, వర్ణనలు, తాఖీదు లు, హామీలు అవసరం లేదు. ఎందుకంటే స్నేహం మనసుకు సంబంధించిన విషయం. అనుభూతులకు నెలవు. అనుభవాలకు కొలువు. మనుషుల్లో, జంతువుల్లో కూడా సాంగత్యం, తోడు అవసరం. ఏకాకిగా, ఒంటరి గా జీవించడం కష్టం. చాలా మందికి అయిష్టం. అటువంటి తోడు ఎవరినుండైనా, ఎటువైపు నుండైనా రావచ్చు. మరీ చిన్నప్పుడు ‘తోడు’ ఎంచుకునే వీలు, అవకాశం లేక పోవడంతో అందరూ విపరీతంగా కురిపించే ఆప్యాయతా, గారాబాల జడితో తడిసి ముద్దయిపోయినా, వయసు పెరిగే కొద్దీ మనసు కావలసిన వారితోనే జతకట్టడం ప్రారంభమౌతుంది.

Friendship_Day1 అది ఎలా మొదలౌతుందో, ఏ లక్షణాలు, పరిస్థితులు, ప్రభావాలు అందుకు ప్రేరేపిస్తాయో కూడా మనకు తెలీదు. సాధారణంగా సమవయస్కుల తోటే సహవాసం మొదలౌతుంది. అయితే ఇంట్లో సమవయస్కులు వుండడం అరుదు. స్నేహంలో విశేషమదే. ఒకరితో ఒకరు ప్రభావితమవ్వడం, ఒకరికి ఒకరు కలిసి ఎదగ డం. మిగతా సాంగత్యాలలో ఇటువంటివి కాస్త తక్కువ. బంధువుల్లో కూడా కాస్త దగ్గరి వయసున్న వారు ఫ్రెండ్స్‌గా వుండే అవకాశం వుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు వారి బంధుత్వం వారిమధ్య వున్న స్నేహాన్ని అధిగమిస్తుంది. అప్పుడు కొన్ని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తుతాయి. స్నేహానికి పరిధులూ, ఆటంకాలూ, అవరోధాలూ, లేనట్టే నిబంధనలూ, లెక్కలూ, నిర్వచనాలూ వుండవు. అటువంటివన్నీ సరదాగా ఎవరికి వారు తయారు చేసుకున్నవే. ఎప్పుడైతే మానవ సంబంధాలు ప్రారంభమౌతాయో వాటన్నిటి లో అవాంఛనీయ మైన కోపాలు కనిపిస్తాయి. స్నేహాల్లో ద్వేషాలూ, కోపాలు, తాపాలు, కొట్లాటలూ, కలిసిపోవడాలూ, మొహమాటాలూ, మర్యాదలూ, గౌరవాలూ, మన్ననలూ, మోసాలూ... అన్నీ వుండే అవ కాశముంది. అలాంటి పరిస్థి తులు ఎదుర్కొ న్న, అనుభవించి న స్నేహితులు చాలా చోట్ల తార సపడతారు.

స్నేహంపై అరిస్టాటిల్‌ భావన...
Friendship_Dayఅనాది నుంచి నేటి వరకు ఎందరో మహానుభావులు స్నేహాన్ని అనేక రకాలుగా నిర్వచించారు. వారిలో అరిస్టాటిల్‌ ఒకరు. స్నేహాన్ని ఆయన మూడు రకాలుగా వర్గీకరించాడు. కొందరు అవసరం కోసం ఫ్రెండ్‌షిప్‌ చేస్తే... మరికొందరు ఆనందం కోసం చేస్తారు. కానీ, ఈ రెండు రకాల స్నేహాల్లో నిస్వార్థత లేదని అభిప్రాయపడ్డాడు. పైగా ఈ స్నేహాలు అవసరాలు తీర్చేవరకే నిలబడతా యి. అంతేగాని వీటికి ఒక ఖచ్ఛితమైన పునాది అంటూ ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే... ఈ రెండు రకాల స్నేహాలు గాలిమేడల్లాంటివి. ఎప్పుడు నిలబడతాయో, ఎప్పుడు కూలిపోతాయో చెప్పడం కష్టం. ఇక మూడవ రకం స్నేహం వీటికి పూర్తి భిన్నం... అదే నిజమైన స్నేహం (్ఛఠజ్ఛీ జటజ్ఛీఛీటజిజీఞ). ఇది అనంతమైనది. దీనికి ముగింపు అంటూ ఉండదు. ఒకరి అవసరాలను మరొకరు తనవని భావించే సహృద యత ఇందులో మెండుగా ఉంటుంది. ఇదే దీని ప్రత్యేక లక్షణం కూడా. ఇది పూర్తిగా మంచితనంపై ఆధారపడి వుంటుంది. మంచితనం లేని చోట ఇది నిలబడదు. స్వార్థ ప్రయోజనాలకు ఇక్కడ తావు లేదు. రెండు మంచి మనసుల మధ్య మాత్రమే ఈ స్నేహం చిగురిస్తుంది. అరిస్టాటిల్‌ భావన ప్రకారం నిస్వార్థమైన స్నేహం సదా స్నేహితు ని మంచిని తప్ప మరేదీ కోరదు.

‘‘నిజమైన స్నేహం అనేది ఒక సద్గుణాన్ని సూచిస్తుంది. పైగా ఈ సద్గుణం మనిషి జీవి తానికి ఎంతో అవసరం. ఒక మనిషిలో ఎన్ని మంచి లక్షణాలున్నా... స్నేహితుడు లేకుండా ఆ మనిషి జీవితం పరిపూర్ణత సాధించదు’’ అంటారు అరిస్టాటిల్‌. ఆయన నిర్వచించిన మూడు రకాల స్నేహాలను విపులీకరించి చూస్తే...

అవసరాలకోసం చేసే స్నేహం: ఈ స్నేహం తన అవసరాలను తీర్చుకునే సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది. నీ అవసరం తీర్చలేప్పుడు ఈ స్నేహం మరోచోటికి మళ్లిపోతుంది. ఈ స్నేహం కడవరకు సాగడం అసాధ్యం. ఇది ఎన్నో ఒడిదుడు కులకు, అడ్డంకులకు లోనవుతూ ఉంటుంది. ఇలాంటి స్నేహం పెద్దవారిలో, యుక్తవయసులో ఉన్న వారిలో, జీవితంలో పైకి వచ్చే స్థితిలో ఉన్న యువతలో ఈ స్నేహం ఎక్కువగా చిగురిస్తుంది. వీరు ఎక్కువ సమయం కలిసి ఉండలేరు. ఇందులో ఒకిరి గురించి ఒకరు ఆలోచించే అవసరం ఎంతమాత్రం ఉండదు కనుక కష్టాల్లో ఉన్నప్పుడు సైతం ఆ స్నేహితుడు గుర్తుకురాడు. స్నేహితుడు కష్టా ల్లో ఉన్నాడని తెలిసినా అతనికి సహాయం చేద్దామనే ఆలోచన ఈ రకమైన స్నేహంలో లేశమాత్రమైనా కనిపించదు. ఒకవేళ సహాయం చేస్తే తిరిగి మనకు లాభం చేకూరుతుందని భావించిన సందర్భాల్లో తప్ప.

ఉల్లాసం కోసం చేసే స్నేహం: ఈ రకమైన స్నేహం ఎక్కువగా చిన్నవయసులో ఏర్పడుతుంది. ఈ వయసులో తమ భావాలను, ఆసక్తులను గౌరవించుకుంటారు. ఎందుకంటే... వాటిద్వారా వీరు ఎనలేని ఆనందాన్ని పొందుతారు.

అయితే రానురాను అభిప్రాయాలు, ఉద్దేశాలు మారుతున్న కొద్దీ ఈ స్నేహంలో మార్పు వస్తుంది. అందువల్ల ఇలాంటి స్నేహాలు బలపడే అవ కాశాలు ఎంత ఉన్నాయో బ్రేక్‌ అయ్యే అవకాశాలూ అంతే ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ స్నేహంలో అనురాగం అప్యాయతల విష యంలో తేడాలను గమనించవచ్చు.
నిస్వార్థ స్నేహం: ఈ స్నేహాన్ని అరిస్టాటిల్‌ ‘పర్‌ఫెక్ట్‌ ఫ్రెండ్‌షిప్‌’ అని వర్ణిం చాడు. భవనం కలకాలం నిలబడాలంటే పునాది ఎంత గట్టిగా ఉండాలో స్నేహం నిలబడాలంటే మంచితనమనే పునాది కూడా అంతే గట్టిగా ఉం డాలి. ఒకసారి ఈ పునాది పైన ఏర్పడిన స్నేహం కలకాలం నిలుస్తుంది.

విదేశీ ఒరవడి...
Friendship_Day4అమెరికాలో మొదలైన స్నేహితుల దినోత్సవం ఆ తరువాత ప్రపంచదేశాలన్నిటికీ పాకిపోయినట్టే మనదేశంలోకూడా వ్యాపించింది. మనదేశం లోనూ స్నేహితుల దినోత్సవానికి ఎనలేని ఆదరణ ఉంది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొ ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో స్థిరపడినవారం దరూ తమ స్నేహితులకు గ్రీటింగుల ద్వారా తమ ప్రేమను పంచుకుంటా రు. భౌతికంగా దూరంగా జీవి తం గడుపుతున్నా స్నేహితుల మనసుల ను మాత్రం ఏ హద్దు లూ విడదీయలేవు. మనదేశంలో ఫ్రెండ్‌షిప్‌ డే సెలెబ్రేషన్స్‌ ఎక్కువగా స్కూల్స్‌లో, కాలేజీలల్లో ఎక్కువగా జరుపుకుం టారు. దాదాపు వారంరోజుల ముందునుండే ఈ సందడి మొదలవుతుం ది. స్నేహితులకోసం గిఫ్ట్‌‌స, గ్రీటింగ్‌ కార్డ్‌‌స కొనుగోలు చేయడంలో బిజీ గా గడుపుతారు విద్యార్థులు. ఫ్రెండ్‌షిప్‌ డే బాండ్స్‌ను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. కొన్ని కాలేజీల్లో అయితే ఫ్రెండ్‌షిప్‌ డేను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలను రూపొందించుకొని సెలెబ్రేట్‌ చేసుకుంటూ ఉంటారు. డాన్స్‌ ప్రోగ్రామ్స్‌, పాటల పోటీలు లాంటి ఎన్నో కల్చరల్‌ ప్రో గ్రామ్స్‌ నిర్వహిస్తుంటారు. ఇలాంటి ఈవెంట్‌ల ద్వారా స్నేహితులు ఆడు తూపాడుతూ తమ ఫ్రెండ్‌షిప్‌ డేను ఎంజాయ్‌ చేస్తుంటారు. ఫ్రెండ్‌షిప్‌ డే పార్టీలు ఊపందుకుంటాయి.

విద్యార్థులే కాకుండా ఉద్యోగరీత్య ఎక్క డెక్కడో స్థిరపడిన ప్రాణస్నేహితులు ఫ్రెండ్‌షిప్‌ డే రోజున కలుసుకొని పార్టీలు చేసుకుంటారు. ఆరోజు డిస్కో థెక్‌లు, బార్లు స్నేహితులతో నిండిపోతాయి. ఇలాంటి పార్టీల ద్వారా కొత్త ఫ్రెండ్స్‌ పరిచయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటీవలికాలంలో అమెరికాతో పాటు అన్ని దేశాల్లో ఫ్రెండ్‌షిప్‌ డే ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. స్నేహితుల దినోత్సవం వస్తుందనగానే వ్యాపారసంస్థల సందడి మొదల వుతుంది రంగురంగుల గ్రీటింగ్స్‌ను డిజైన్‌ చేసి స్నేహితులను ఆకట్టుకు నే ప్రయత్నం చేస్తాయి. బార్లు, రెస్టారెంట్ల సంస్కృతి పెరిగిపోవడంతో స్నేహితులకోసం ఇవి స్పెషల్‌ డిస్కౌంట్లతో అదరగొడతాయి.
Friendship_Day5
‘ఏ ఫ్రెండ్‌ ఇన్‌ నీడ్‌ ఈజ్‌ ఏ ఫ్రెండ్‌ ఇన్‌డీడ్‌’
స్నేహితుల దినోత్సం పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాయి వ్యాపార సంస్థలు. నిజానికి ఫ్రెండ్‌షిప్‌ డే గురించి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. ఈ రోజును ఫలానా తేదీనే జరుపుకోవాలని ఎటువంటి నియమ నిబంధనలు కూడా లేవు. మరి ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్‌షిప్‌ డే కి ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది. ఈ స్నేహితుల దినోత్సవానికి సం బంధించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పౌరాణికేతిహాసాల్లో ఎందరో మహానుభావులు స్నేహానికి ఎనలేని ప్రాధాన్యతను కల్పించారు. మనిషి జీవితంలో అన్ని బంధాల్లోకెల్లా విలువైనది స్నేహబంధం. స్నేహం గురించి ఇంగ్లీష్‌లో ఓ సామెత ఉంది. ‘ఏ ఫ్రెండ్‌ ఇన్‌ నీడ్‌ ఈజ్‌ ఏ ఫ్రెండ్‌ ఇన్‌డీడ్‌’ కష్టాల్లో తోడునిలిచి ప్రోత్సాహం అం దించేవాడే నిజమైన స్నేహితడని దాని అర్ధం. ప్రతి సంవత్సరం ఆగస్ట్‌ మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్‌షిప్‌ డేను జరుపుకోవడం ఆనవాయితి. అయితే ఆ రోజునే ఎందుకు ఫ్రెం డ్‌షిప్‌ డే ను జరుపుకోవాలి? అసలు ఫ్రెండ్‌షిప్‌ డేకి బీజం ఎలా పడిం ది? దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? మనదేశంలో ఫ్రెండ్‌షిప్‌ డేను ఎలా సెలెబ్రేట్‌ చేసుకుంటారు? అనే విషయాలను తెలుసుకుందాం... మనదే శంలో విద్యార్థులు, ఉద్యోగస్థులు, ప్రముఖులు ఈ రోజును ఎలా జరు పుకుంటారో చూద్దాం...

అంతర్జాతీయ గుర్తింపు
1935వ సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్‌ తొలిసారిగా ఫ్రెండ్‌షిప్‌ డే ను వెలుగులోకి తీసుకువచ్చింది. ఆగస్టు నెలలో వచ్చే తొలి ఆదివారం రోజున జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుండి అది ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవంగా మారిపోయింది. అలాం టి ఒక గొప్ప ఐడియా సృష్టిలోనే విలువైన స్నేహబంధాన్ని మరింత పటిష్టం చేసింది. అనతికాలంలోనే ఫ్రెండ్‌షిప్‌ డే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొంది అంతర్జాతీయ పండుగగా గుర్తింపుపొందింది. అమెరికా లో ఎంతో పాపులర్‌ అయిన స్నేహితుల దినోత్సవం అనతికాలంలోనే ఇతర ప్రపంచదేశాలకు పాకింది. అంతేకాదు ప్రఖ్యాత అమెరికన్‌ రచ యిత రాసిన ‘విన్నీ-ద-పూహ్‌’ను 1997లో ఫ్రెండ్‌షిప్‌ డే అంబాసిడర్‌ గా ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. మనదేశంలోకూడా ఇది విశేష ఆదరణను పొందింది. ఫ్రెండ్‌షిప్‌ డే వస్తోందనగానే స్నేహితుల్లో ఉత్సా హం ఉరకలేస్తుంది. తమ ప్రాణాతిప్రాణమైన మిత్రులకు విభిన్న రీతులలో శుభకాంక్షలు తెలియజేయడానికి తహతహలాడుతూ ఉంటారు. ఫ్రెండ్‌షిప్‌ డే ప్రపంచవ్యాప్తంగా వివిధ తేదీల్లోకూడా జరుపుకోవడం విశేషం.
Friendship_Day2
ఆ వివారాలు ఒకసారి పరిశీలించినట్లయితే. ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సం జరుపుకోవడం మనకు తెలి సిందే. అయితే పలురకాలైన ఫ్రెండ్‌షిప్‌డేలు కూడా ఉన్నాయి. ఆగస్టు మూడో ఆదివారం ‘వుమెన్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’, ఫిబ్రవరి మాసాన్ని ‘ఇంటర్నే షనల్‌ ఫ్రెండ్‌షిప్‌ మంత్‌’గా కూడా జరుపుకోవడం విశేషం. అంతేకాకుం డా మే మూడవ వారాన్ని ‘ఓల్డ్‌ ఫ్రెండ్స్‌, న్యూ ఫ్రెండ్స్‌ వీక్‌’గా జరుపుకుం టారు. అయినా స్నేహాన్ని పంచుకోవడానిక ఒక సందర్భం అవసరంలే దు. స్నేహానికి హద్దులు లేవు. స్నేహాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక దినం అవసరంలేదనేది మాత్రం సత్యం. స్నేహం యొక్క విశిష్టతను శ్రీ కృష్ణుడు మహాభారతంలో ఆనాడే వర్ణించాడు. సృష్టిలో స్నేహానికన్నా విలువైనది మరేదీ ఉండదని ఆయన ప్రభోదించారు. స్నేహం అంటే నిస్వార్థంలేని ప్రేమ, సోదరభావం, రక్షణ, మార్గదర్శకం, అనుబంధం ఇలా స్నేహానికి ఎన్నో పర్యాయపదాలు.

స్నేహం... ఇది మనిషి జీవితానికి ఒక పరిపూర్ణ అర్ధాన్ని చేకూర్చే దివ్య ఔషధం. మన ఆశయాలకు మార్గదర్శకాలను ఏర్పరుచుకోవటంలో స్నే హితుని పాత్ర ఎనలేనిది. బాల్య స్నేహితుడైనా... ఇటీవలే పరిచయం అయిన కొత్త స్నేహితుడైనా... అతని పాత్ర ఎంతో విశిష్టమైనది. అలాం టి స్నేహితున్ని ప్రస్తుతిస్తూ... జరుపు కు నే అరుదైన పండుగ ‘స్నేహి తుల దినోత్సవం’... హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే...
- ఎస్‌.కె