చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook
Showing posts with label India. Show all posts
Showing posts with label India. Show all posts

Monday, September 19, 2011

' జీవాలను కాసి జీవితంలో గెలిచా ' - చింతల వెంకటరమణ

 












బాల్యంలో ఉండగా గొర్రెలు కాయడంలోనే ఆనందం ఉందనుకున్నాడు. స్కూల్‌కి వెళ్లడాన్ని ఇష్టపడేవాడు కాదు. కాని ఇప్పుడు... గొర్రెల వెంట వెళ్తే 'గొర్రెతోక బెత్తెడు' సామెతలానే జీవితం ఉంటుందని చెపుతూ అందరూ ఉన్నతమైన చదువులు చదవాలి అంటున్నాడు. చదువుతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తే చాలు ప్రపంచాన్ని ముంగిట్లో నిలుపుకోవచ్చు అంటున్నాడు. పదో తరగతి మూడుసార్లు తప్పి, ఇంటర్మీడియెట్ ఇన్‌స్టంట్‌లో పాసయిన చింతల వెంకటరమణ(28) ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పిహెచ్‌డి స్కాలర్. అంతేకాదు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పేపర్ ప్రెజెంటేషన్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడితను 'నిశ్చింతల' వెంకటరమణ. ఈ ఎదుగుదల గురించి అతని మాటల్లోనే...

"ముందుగా మా కుటుంబనేపథ్యం చెప్తాను. మా స్వగ్రామం చిత్తూరు జిల్లా, సదుం మండలంలోని బక్తలవారిపల్లె. అమ్మ పేరు చిన్నక్క, నాన్న పేరు మల్లయ్య. మా అమ్మానాన్నకి పెళ్లయిన 27 యేళ్ల తరువాత పుట్టాను నేను. మాది కురుమ కులం. గొర్రెల కాపర్ల కుటుంబం మాది. మాకు నలభై గొర్రెలు ఉండేవి. వాటిని మేతకు తీసుకెళ్లి వాటివెంట తిరగడమంటే తెగ ఇష్టం నాకు. అందుకే స్కూల్‌కి సరిగా వెళ్లేవాడ్ని కాదు. ఎలాగోలా ఆ ఊళ్లోనే ఏడవ తరగతి అయ్యిందనిపించాను. ఆ తరువాత చదువు గురించి మళ్లీ ఆలోచించలేదు.
ఎరువుకి తిండిపెట్టే వాళ్లు

రాయలసీమలో వర్షాలు తక్కువ కావడంతో నీళ్ల కరువు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో గొర్రెలకు మేత, నీళ్ల కోసం ఎంత దూరమయినా తీసుకెళ్లే వాళ్లం. మాకున్న నలభై గొర్రెల్ని తోలుకుని నేను, మా నాన్న దాదాపు నెల్లూరు సరిహద్దు వరకు వెళ్లేవాళ్లం. మాతోపాటు మరికొందరు గొర్రెల కాపర్లు కూడా వచ్చేవాళ్లు. గొర్రెల ఎరువు పొలాల్లో వేసినందుకు ఒకరోజు తిండి పెట్టి, ఒక బీడీ కట్ట ఇచ్చే వాళ్లు ఆ పొలాల యజమానులు. మరొక పొలం దొరికే వరకు మేమే తిండి వండుకోవాలి. అందుకని వంటసామాగ్రి కూడా వెంట తీసుకెళ్లాలి. నేను చిన్నోడ్ని కావడంతో రాత్రుళ్లు నిద్రపోయేవాడ్ని. కాని పెద్దవాళ్లు మాత్రం గొర్రెలకు కాపలాగా ఒక్కొక్కరు రెండేసి గంటల చొప్పున నిద్ర మేలుకుని ఉండేవారు.
మాంసం మాకు దండిగా సంవత్సరం పొడవునా ఉండేది. ఎందుకంటే ఊళ్లలో పొట్టేలు మాంసం కొంటారు కాని గొర్రె మాంసం అంతగా అమ్ముడుపోయేది కాదు. (నవ్వుతూ బహుశా ఆడదనేమో...) అందుకని గొర్రెలు చనిపోతే ఆ మాంసాన్ని ఎండ పెట్టి మేమే వాడుకునే వాళ్లం. అలాగే గొర్రెల చర్మం ఒలవడంలో ఒక నేర్పు ఉంటుంది. ఆ నేర్పు నాకు ఏడో తరగతిలోనే అలవడింది. చిన్న వయసులోనే ఆ నేర్పు రావడానికి కారణం లేకపోలేదు. ఒకసారి గొర్రె చర్మం తీస్తున్నప్పుడు చిన్న రంధ్రం పడింది. అది చూసి మా అమ్మ బాగా తిట్టింది. ఎందుకంటే రెండు వందలకు కొనే చర్మం చిన్న రంధ్రం పడితే పది రూపాయలకే అమ్మాలి. అప్పుడు మా బంధువువైన అన్నయ్య ఒకరు నాలుగైదు చర్మాలు తీయరా నష్టం నేను భరిస్తా అన్నాడు. దాంతో బాగా తీయడం వచ్చింది. ఇప్పటికీ గొర్రె చర్మాన్ని కొద్దిగా కూడా డామేజ్ కాకుండా తీయగలను.

కసి రగిలింది

కొన్నాళ్ల తర్వాత మా ఇంట్లో వాళ్లు నన్ను మళ్లీ బడిలో చేర్చేందుకు ప్రయత్నించారు. కాని ఏడో తరగతి తరువాత చాలా గ్యాప్ రావడంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోలేదు. దాంతో పక్క మండలంలోని ప్రైవేట్ స్కూల్‌లో పదవతరగతిలో చేరాను. స్కూల్లో అయితే చేరానే కాని చదువు మీద ధ్యాస ఉండేది కాదు. దాంతో మొదటిసారి రాసిన పబ్లిక్ పరీక్షల్లో మూడు సబ్జెక్ట్స్ ఫెయిలయ్యాను. రెండోసారి రాశాను. మళ్లీ తప్పాను. ఫలితం... రెండోసారీ చదువుకు బ్రేక్ పడింది. చదువు ఇక ఒంటపట్టదనుకున్నాను. మళ్లీ గొర్రెల కాపరిగా వెళ్లడం మొదలుపెట్టాను.

ఒకసారి గొర్రెల్ని తీసుకుని నేను, మా నాన్న ఊరు వదిలి బయటికి వెళ్లినప్పుడు. మా ఊళ్లో పెద్ద గొడవ జరిగింది. మా ఊళ్లో మా కులానికి చెందిన కుటుంబాలు 40 ఉంటే... 39 కుటుంబాలు ఒకవైపూ, మా కుటుంబం ఒక్కటీ ఒకవైపు ఉండిపోయింది. సామాజిక బహిష్కరణ విధించారు మా మీద. బోరింగు పంపు దగ్గర నీళ్లు పట్టుకోనిచ్చే వారు కాదు. గొర్రెల్ని తీసుకుని వాళ్ల ఇళ్ల ముందునుంచి వెళ్లనిచ్చేవాళ్లు కాదు. ఆఖరికి ఉప్పు కొనుక్కోవాలన్నా టౌన్‌కి వెళ్లాల్సిందే. నలుగురూ నాలుగువైపులా తొక్కేయడంతో నాలో కసి రగులుకుంది.
గొర్రెలతో పాటు నడుస్తున్నప్పుడు... నేనేమిటి? నా జీవితం ఏమైపోతోంది? అని ఆలోచించేవాడ్ని. ఆ సమయంలోనే దూరవిద్య ద్వారా పదవతరగతి పాస్ కావొచ్చని మా ఊళ్లో ఉండే వసంత్ చెప్పాడు. అందుకు సంబంధించిన పత్రికా ప్రకటన కటింగ్ తెచ్చి నాకు చూపించాడు. అది నేషనల్ ఓపెన్ స్కూల్ ప్రకటన. అతనే దగ్గరుండి నన్ను తిరుపతి తీసుకెళ్లాడు. వివరాలు కనుక్కుంటే నాలుగువేలు కడితే పదో తరగతి పరీక్షలు రాయొచ్చని చెప్పారు.

ఇంటికి వచ్చి అమ్మానాన్నలకు చెప్పాను. ఒక్కో గొర్రెకు పదిహేను వందల రూపాయలు వస్తాయి. మూడు గొర్రెల్ని అమ్మి ఫీజు కట్టమని డబ్బు ఇచ్చారు. అయితే వసంత్ వాళ్ల నాన్న... డబ్బులు కడితే పాస్ చేస్తారనడం మోసం అన్నాడు. అయినా నేనొక్కడినే తిరుపతి వెళ్లి డబ్బులు కట్టి పుస్తకాలు తెచ్చుకున్నాను. అలా పదో తరగతి మూడోసారి అత్తెసరు మార్కులతో పాసయ్యేందుకు మార్గం ఏర్పడింది. పదో తరగతి పాసవడం అనేది నా జీవితంలో ఊహించని పరిణామం. అయితే పరీక్షా ఫలితాలు ఆలస్యంగా రావడంతో ఇంటర్మీడియెట్ అడ్మిషన్లు పూర్తయిపోయాయి.

ఇక మళ్లీ గొర్రెలే నా జీవితం అనుకుంటున్న సమయంలో మా బంధువులాయన ఒకరు నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డ్‌కి ఫీజు కడితే పరీక్షలు రాయొచ్చని చెప్పాడు. 130 రూపాయలు కట్టి హెచ్ఇసి గ్రూపు తీసుకున్నాను. మొదటి ఏడాది తెలుగు, పాలిటిక్స్ మాత్రమే పాసయ్యాను. మిగతా సబ్జెక్ట్‌లన్నీ ఫెయిల్. అప్పుడు నాకు బట్టీ బట్టి రాయమని సలహా ఇచ్చారు. అలానే చేసి మిగతావన్నీ పాసయ్యాను. కాని మళ్లీ ఇంగ్లీషు సబ్జెక్ట్ పోయింది. ఆ ఒక్కటీ ఇన్‌స్టంట్ పరీక్ష రాసి 37 మార్కులతో పాసయ్యాను. తరువాత డిగ్రీ కోసం పీలేరు వెళ్లడం నా జీవితాన్ని మలుపు తిప్పింది.

బతికించే చదువు వేరు...

డిగ్రీలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్‌ను చంద్రయ్య మాస్టారు బోధించేవారు. ఆయన విద్యతో పాటు జీవితంలో పైకి వచ్చే అవకాశాల గురించి కూడా చెప్పేవారు. అదే నా జీవితపథంలో మార్పు తెచ్చింది. ఆయన ప్రోత్సాహంతోనే గ్రూప్ ఎగ్జామ్స్ ఉంటాయని, సెంట్రల్ యూనివర్శిటీలో చేరి చదవొచ్చనేలాంటి విషయాలు తెలిశాయి. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగా గ్రూప్స్ రాసి సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్‌లోని ఆర్‌సి రెడ్డి కోచింగ్ సెంటర్‌కి వెళ్లమని చెప్పారు సార్.

ఆయన చెప్పినట్టే పది గొర్రెలు అమ్మేసి డబ్బులు తీసుకుని హైదరాబాద్‌లో కోచింగ్ కోసం చేరాను. కాని ఏవో కారణాల వల్ల మెయిన్స్ పరీక్ష జరగలేదు. అప్పుడే సెంట్రల్ యూనివర్శిటీ నోటిఫికేషన్ పడింది. దాంతో యూనివర్శిటీకి వెళ్లి దరఖాస్తు కొన్నాను. కానీ నాకది ఎలా పూర్తి చేయాలో కూడా అర్థంకాలేదు. అది ఇంగ్లీషులో ఉండడంతో ఒకతన్ని అడిగి దరఖాస్తు పూర్తి చేయించాను. అలా ఎమ్మే పొలిటికల్ సైన్సుకి అప్లయ్ చేశాను. ఒబిసి కోటాలో వెయిటింగ్ లిస్ట్ 5 వ నంబరు నాది. ఎవరైనా రాకపోతే సమాచారం చెప్తామన్నారు. అప్పుడు స్టూడెంట్ లీడర్ నగేష్ రెడ్డి నువ్వు ఇంటికెళ్లిపో సీటు వస్తే నేను చెప్తానన్నారు. సరిగ్గా ఒక నెల తరువాత ఫోన్ చేసి సీట్ ఉంది రమ్మన్నారు.

ఒక స్టూడెంట్ జెఎన్‌యుకి వెళ్లిపోవడంతో సీటు వచ్చింది. అలా 2005 లో ఎమ్మేలో చేరాను. పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ పట్ల నాకు ఆసక్తి కలగడానికి కారణం చంద్రయ్య సారే. ఆయన ఎప్పుడూ ఇంగ్లీషు నేర్చుకోండి. వట్టి డిగ్రీలు తిండి పెట్టవనేవారు. అందుకు నా జీవితమే చక్కటి ఉదాహరణ. క్యాంపస్‌లో అడుగుపెట్టినప్పుడు ఒక్క ముక్క ఇంగ్లీషు మాట్లాడడం వచ్చేది కాదు. అప్పటివరకు ఇంగ్లీషులో మార్కులు 37 మించిన దాఖలాలు లేవు. అందుకని హాస్టల్‌లో రూమ్ ఇస్తున్న ఇన్‌చార్జ్ తో చెప్పాను- తెలుగు మాట్లాడడం రాని విద్యార్ధులున్న గదిలో నన్ను ఉంచండని. వాళ్లు నాకు నాగాలాండ్‌కు చెందిన అకాయ్‌తో గది పంచుకోమని చెప్పారు. ఇంగ్లీషులో నా గాడ్‌ఫాదర్ ఆయనే. మొదట్లో బాడీ లాంగ్వేజ్‌తో సంభాషించేవాడ్ని. అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పేవారు అకాయ్. ఎమ్మే పూర్తయ్యేసరికి ఆంగ్లంపై పట్టు వచ్చింది.

"ఐ... ఐ... మార్క్ ్స... తెలుగు మీడియం...''

ఎమ్మేలో చేరిన కొత్తలో ఎగ్జామ్ రాసినప్పుడు హెచ్ఒడి సారంగి నాకు సున్నా మార్కులు వేశారు. ఆయనే పొలిటికల్ సైన్స్ కూడా బోధించేవారు. ఆయనతో మాట్లాడడం కోసం ఆయన గదికి వెళ్లి "ఐ... ఐ... మార్క్స్... తెలుగు మీడియం...'' అని ముక్కలు ముక్కలుగా మాట్లాడాను. అప్పట్లో 'ఐ గాట్' అనాలనే విషయం కూడా తెలియదు. అప్పుడాయన ఒకటే చెప్పారు... చదువు రాలేదని బెదిరిపోయి ఇంటికెళ్లొద్దు. పట్టుదలగా చదువుకో వస్తుందన్నారు. పిజి ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను. ఆ తరువాత ఎంఫిల్ కూడా ప్ర«థమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను.

మరో విషయం ఏమిటంటే ఎమ్మేలో మెరిట్ కమ్ మీన్స్ అనే ఫెలోషిప్ రావడం. సాధారణంగా ఇటువంటివి టాపర్స్‌కి ఇస్తారు. అయితే మా బ్యాచ్‌లో అందరూ ఆర్థికంగా ఉన్నవాళ్లు. దాంతో వాళ్లెవరూ దరఖాస్తు చేసుకోలేదు. అలా నాకు వచ్చింది. 'ఉన్నతవిద్యలో సమానావకాశాలు' అనే అంశంపై పిహెచ్‌డి చేస్తున్నాను. ఇప్పుడు మూడో సంవత్సరం. ఫెలోషిప్ డబ్బుతో ల్యాప్‌టాప్ కొన్నాను. ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తుండగా కనిపించిన అవకాశాలకు దరఖాస్తు చేశాను.

ఫిలిప్పీన్స్, సైప్రస్‌లలో సెమినార్లలో పాల్గొనేందుకు ఎంపికయ్యాను. కాని వాళ్లు స్పాన్సర్ చేయలేదు. సొంత ఖర్చులంటే నాకు కష్టం. అందుకని ఆ అవకాశాలు వదులుకున్నాను. జర్మనీలోని బెర్లిన్ యూనివర్శిటీలో 'సెంటర్ ఫర్ సొసైటీ అండ్ టెక్నాలజీ' డిపార్టుమెంట్ వాళ్లు నిర్వహిస్తున్న సదస్సుకు మాత్రం వాళ్లే అన్ని ఖర్చులు భరిస్తూ నన్ను సెలెక్ట్ చేశారు. ఇందులో పాల్గొనడం కోసం ఈ నెల 28 న బయల్దేరుతున్నాను. 'ప్రపంచీకరణ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతిన్న తీరు'పై పేపర్ సమర్పిస్తున్నాను.

అదృష్టం కూడా తోడ్పడింది

ఈ యూనివర్శిటీ గొప్పతనం గురించి మా వాళ్లకేమీ తెలియదు. ఆ మధ్య 'జర్మనీ వెళ్తున్నాను' అంటే జపాన్‌కా అని అడిగారు. ఆ... అదే అన్నాను. వాళ్లకి అమెరికా, జపాన్ తప్ప వేరే దేశాలు తెలియదు. ఎక్కువసార్లు వినడం వల్ల అమెరికా పేరు, రేడియోలు, ట్రాన్సిస్టర్‌ల వంటివాటివల్ల జపాన్ పేరు వాళ్లకు తెలుసు. నాకు వస్తున్న ఫెలోషిప్ నుంచి కూడబెట్టి ఒకసారి అమ్మా నాన్నల్ని విమానం ఎక్కించి తిరుపతి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను.

నా దగ్గర ఒక వారం రోజులు ఉంచుకుని హైదరాబాద్ అంతా తిప్పి చూపించాను. నాన్నకి 70, అమ్మకి 65 యేళ్లు ఉంటాయి. వాళ్ల కళ్లలో కనిపించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. బాగా స్థిరపడిన తరువాత వాళ్లని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటాను. నేనేది అడిగినా కాదనలేదు. బహుశా నా ఆలోచనలకు వాళ్లిచ్చిన స్వేచ్ఛే నన్ను ఇంతటి వాడ్ని చేసింది కాబోలు. వీటన్నిటితో పాటు నా జీవితంలో అదృష్టం ప్రధాన పాత్ర పోషించింది. ఈ స్థాయికి చేరుకోవడానికి తెల్లవారుఝామునే లేచి చదవడం, విపరీతంగా కష్టపడడం వంటివి చేయలేదు.

కాని చదువుకుంటేనే బతకగలను అనుకున్నాను. 'చదువు దారి మరిచావో... గొర్రెలు కాయాల్సిందే' అనే విషయం హెచ్చరికలా నా బుర్రలో తిరుగుతుండేది. అదే నాలో పట్టుదలని పెంచింది. ఆంగ్లంలో పట్టు సాధించడం కోసం తెలుగు సినిమాలు, చానళ్లు చూడడం మానేశాను. చూసినా, చదివినా అంతా ఇంగ్లీషే. అంత స్ట్రిక్ట్‌గా నా చుట్టూ ఆంగ్ల ప్రపంచాన్ని నిర్మించుకున్నాను.

భవిష్యత్తు కళ్లముందు కనిపించినప్పుడే దేన్నయినా సీరియస్‌గా తీసుకుంటాం. లేకపోతే నేనీ స్థాయికి వచ్చే వాడినా చెప్పండి. 'వాటీజ్ యువర్ నేమ్?' అని అడగడానికే కాళ్లు చేతులు వణికిపోయేవి. అలాంటి నేను ఇప్పటికే మూడు నాలుగుసార్లు స్టేజి ప్రెజెంటేషన్ ఇచ్చాను.''
 
- కిరణ్మయి
ఫోటోలు: మునావర్‌ఖాన్

Wednesday, March 9, 2011

టాంజానియా అన్నీ ఆర్గానిక్ పంటలే

ఉద్యోగాల నిమిత్తం అమెరికా, యుకె, ఆస్ట్రేలియాలకే కాదు ఆఫ్రికా దేశాలకూ వెళ్తున్నారు మనవాళ్లు. సాధారణంగా ఆఫ్రికా దేశాలనగానే పోషకాహార లోపంతో ఉన్న పిల్లల దృశ్యం ఒకటి కళ్ల ముందు మెదులుతుంది ఎక్కువమందికి. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరి మరోవైపు ఉన్నదేంటి? "అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దానితోపాటు ప్రకృతి వినాశనం ఎక్కువగా జరుగుతోంది కాని ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడుంటే ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది'' అంటున్నారు టాంజానియా వాణిజ్య రాజధానిగా పిలవబడే దార్-ఎస్-సలాంలో ఉంటున్న మంతెన వెంకట కృష్ణమూర్తి రాజు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

సంప్రదాయ వంటల్లో మొక్కజొన్నపిండితో తయారుచేసిన ఉగాలి అనే ఉప్మాలాంటి వంటకం, మనదగ్గర బూరెల్లాగా చేసుకునే 'మందాజి' అనే వంటకం ఫేమస్. ఆహారపు అలవాట్లు కొంచెం పశ్చిమదేశాల అలవాట్లకు దగ్గరగా ఉంటాయి. అందుకనే కాబోలు బంగాళాదుంపల చిప్స్, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.

"దార్-ఎస్-సలాం రావడం అనుకోకుండా జరిగింది. 2006 ఫిబ్రవరిలో గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజిలో వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాను. అదే మేనేజ్‌మెంట్ దార్-ఎస్-సలాంలో ఇంటర్నేషనల్ మెడికల్ అండ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ నడుపుతోంది. నేను గుంటూరులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే... వాళ్లు నన్ను అక్కడికి పర్సనల్ మేనేజర్‌గా పంపించారు. అలా 2007లో వచ్చాను. ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి.

మా యూనివర్శిటీ నగరానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌లో కోటీ నుంచి మియాపూర్ వరకు వెళ్లినంత దూరం. మాకు క్యాంపస్‌లోనే వసతి ఏర్పాటు ఉంది. మొదటి రెండు సంవత్సరాలు ప్రతి ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి టౌన్‌కి వెళ్లి షాపింగ్ చేసేవాళ్లం. అలాగే దేవాలయానికి వెళ్లి కొంతసేపు గడిపి, ఇండియాకి ఫోన్ మాట్లాడుకుని తిరిగి వచ్చేవాళ్లం. గత రెండేళ్లుగా ఇక్కడి తెలుగు వాళ్లు ఏర్పాటుచేసుకున్న తరంగిణి సాంస్కృతిక సంస్థకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాను. దాంతో నగరంలోకి వెళ్లడం ఎక్కువైంది.

ఉగాలి, మందాజిలు బాగుంటాయి

సుమారు ఎనిమిది వందల మంది తెలుగు వాళ్లు ఉన్నారిక్కడ. భారత సంతతి వాళ్లు నివాసముండే ప్రాంతాల్లో నెలకు ఆరు వందల డాలర్లు ఆ పైనే ఉంటాయి అద్దెలు. ఆహారపదార్ధాలు, బట్టలు ఎక్కువగా చైనా వంటి దేశాల నుంచి దిగుమతి అవుతాయి. అందుకే ధర కాస్త ఎక్కువే. ఇక్కడ జీవనం ఖర్చుతో కూడుకున్నదే. మన హైదరాబాద్‌తో పోల్చుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. రూపాయల్లో చూసుకుంటే కూల్ డ్రింక్ 17 రూపాయలు, కేజీ బియ్యం 40 నుంచి 80 రూపాయలు, కేజీ కూరగాయలు 30 నుంచి 40 రూపాయలు ఉంటాయి.

గుజరాతీలు నడిపించే కిరాణా షాపుల్లో దాదాపు అన్ని వస్తువులూ దొరుకుతాయి. బొంబాయిరవ్వ, ఇడ్లీరవ్వ వంటివి మన దేశం నుంచి దిగుమతి చేసి అమ్ముతుంటారు. అందుకని తెలుగు వంట రుచి తగ్గకుండా తినొచ్చు.

ఇక్కడి సంప్రదాయ వంటల్లో మొక్కజొన్నపిండితో తయారుచేసిన ఉగాలి అనే ఉప్మా లాంటి వంటకం, మనదగ్గర బూరెల్లాగా చేసుకునే 'మందాజి' అనే వంటకం ఫేమస్. ఆహారపు అలవాట్లు కొంచెం పశ్చిమదేశాల అలవాట్లకు దగ్గరగా ఉంటాయి. అందుకనే కాబోలు బంగాళాదుంపల చిప్స్, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఫెర్టిలైజర్స్ వాడకుండా పంటలు

కూరగాయలు ఎంతో తాజాగా ఉంటాయి. దానివల్ల వంటకు రుచి పెరుగుతుంది. ఇక్కడో ఆసక్తికర విషయం చెప్పాలి... ఈ ప్రాంతంలో పంటలు పండించడానికి ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ వంటివి వాడరు. కారణం నేల సారవంతంగా ఉండి, సమయానుకూలంగా వర్షాలు పడడమే కావచ్చు. అలాగే మన దగ్గరలాగా ఎంత ఖర్చుపెట్టయినా సరే... ఎకరానికి 50 బస్తాలు పండించాలనే దృక్పథం ఇక్కడి వారికి లేకపోవడం కూడా కావొచ్చు.

మొత్తంమీద ఆర్గానిక్ పంటలన్నమాట. జీడిపప్పు, కొన్ని రకాల సుగంధద్రవ్యాలు విరివిగా లభిస్తాయి. దాంతో జీడిపప్పును మన దగ్గర పల్లీల్లాగా లాగించేస్తుంటారు చాలామంది. వైద్యం విషయానికి వస్తే... సాధారణ వైద్యం వరకు ఫర్వాలేదు. కాని క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం కష్టమే. పక్క దేశాలకి పరుగెత్తాల్సిందే. డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాళ్లు మన దేశాల వంటి దేశాలకు వెళ్తుంటారు.

భాషా సమస్య ఉండదు
ఇక్కడ పనిచేసేందుకు వచ్చేవాళ్లకి భాషతో ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. చాలావరకు ఇంగ్లీష్ మాట్లాడతారు. కింది స్థాయి ఉద్యోగులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ప్రాంతీయ భాష స్వాహిలి తప్పక రావాలి. ఆ భాషకు లిపి లేకపోవడంతో ఇంగ్లీషు అక్షరాల్లో రాస్తారు. అంటే ట్రాన్స్‌లిటరేషన్ అన్నమాట. ఒకప్పుడు బ్రిటీష్ కాలనీగా ఉండడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడడం బాగా అలవాటయ్యింది వీళ్లకు.

దేశవిదేశీ సంస్కృతుల మిశ్రమంగా ఉంటుంది ఇక్కడి సంస్కృతి. సంప్రదాయబద్ధమైన దుస్తులతో పాటు, పాశ్చాత్య దుస్తులను కూడా ధరిస్తారు. జనాభాలో దాదాపు 60 శాతం ముస్లింలు ఉంటారు. మిగతావాళ్లు క్రైస్తవులు. రెండు మతాల సంప్రదాయ పండుగలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కుటుంబ వ్యవస్థకు ఎంతో గౌరవమిస్తారు. ఆచారాలకు కట్టుబడి ఉంటారు. ఇప్పటికీ కన్యాశుల్కం పద్ధతినే అనుసరిస్తారు.

గ్రామాలు, పట్టణాల్లో సదుపాయాలు ఇంకా అభి వృద్ధి చెందాలి. వృత్తివిద్యలు, చెక్కబొమ్మలు తయారుచేయడం, పశువులపెంపకమే (మసాయిలు అనే తెగ పూర్తిగా దీనిమీదే ఆధారపడుతుంది) ఇక్కడి వాళ్లకి జీవనోపాధి. వీటితోపాటు టూరిజం, చేపల పరిశ్రమ కూడా ఉపాధి కల్పిస్తుంది. ఐటి రంగం అంతగా అభివృద్ధిచెందలేదు.

అకౌంట్స్‌లో అవకాశాలు

విదేశాల నుంచి వచ్చే వాళ్లకి అకౌంట్స్ విభాగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిఎ, సిఎ (ఇంటర్) చేసిన వాళ్లకి, ట్యాలీవంటి అకౌంటింగ్ ప్యాకేజీలు చేయగలిగిన వాళ్లకి ఉద్యోగావకాశాలు ఎక్కువ. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకి కనీస ఆదాయం 500 అమెరికన్ డాలర్లు ఉంటుంది. రేడియో, టివి, మల్టీప్లెక్స్ సినిమాలు, క్లబ్బులు, కాసినోవాలు, హోటళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవలేదు. ఇంగ్లీషు, హిందీ సినిమాలు వస్తాయి. స్థానికంగా సినిమాల నిర్మాణం చాలా తక్కువ. మన దేశంలో సినిమాలు విడుదలయినప్పుడే ఇక్కడా విడుదలవుతాయి. అందుకని సినిమాలంటే ఇష్టమున్న వాళ్లకి వాటిని మిస్ అవుతామని ఫీలవ్వక్కర్లేదు.

కిళి మంజారో... భళా భళీ మంజారో...

రెండు వందల ఏళ్ల క్రితం ఇండియాను బ్రిటిష్ వాళ్లు పాలిస్తున్న కాలంలో... టాంజానియా-జాంజిబార్‌లకు రైల్వే లైను వేయడంకోసం కొందరు గుజరాతీలను షిప్పుల్లో టాంజానియాకి తీసుకుని వచ్చారు. అలా ఇక్కడ సెటిలైపోయిన గుజరాతీలు ఇప్పుడు వ్యాపారస్తులుగా మారిపోయారు. టాంజానియా జనాభాలో ఇప్పుడు వాళ్లు రెండు నుంచి మూడు శాతం వరకు ఉంటారు. ఒక రకంగా ప్రధాన ఆదాయ వనరులు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులతో పాటు ఉత్తరభారత దేశ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అందుకని ఇండియన్ రెస్టారెంట్లు ఎక్కువగానే కనిపిస్తాయి. దాంతో ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. తెలుగు వాళ్లం తరంగిణి సాంస్కృతిక సంఘం పెట్టుకున్నట్టే మిగతా భాషల వాళ్లు వాళ్ల సంఘాలు ఏర్పాటుచేసుకున్నారు.

మౌలిక సదుపాయాల దృష్ట్యా కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ శాంతిభద్రతల పరంగా బాగానే ఉంటుంది. నేరాలరేటు కెన్యా, ఉగాండావంటి పొరుగు దేశాలతో పోలిస్తే తక్కువ. పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు బోలెడు ఉన్నాయి ఇక్కడ. సెరంగటి జాతీయ పార్క్, మికూమి నేషనల్ పార్క్, సఫారీలు, కిలిమంజారో పర్వతం... ప్రత్యేక ఆకర్షణలు. రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యమే. భారత సంతతికి చెందిన ఐదుగురు సభ్యులు ఈ సారి పార్లమెంట్‌కి ఎంపికవడం మరో విశేషం .

Tuesday, February 22, 2011

ఆరుదైన రంగం.. అదిరెను పనితనం

దేవితా షరాఫ్‌.. జెనిత్‌ కంప్యూటర్స్‌ అండ్‌ ది బ్రెయిన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఒడిస్సీ డాన్సర్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఆన్‌లైన్‌ కాలమిస్ట్‌.. భారతదేశపు శక్తివంతమైన మహిళ జాబితాలో స్థానం సాధించుకున్న యువ తరంగం. సాధించాల్సిన లక్ష్యాల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయడం ఆమెకు ఇష్టం. మగవారికే పరిమితం అయిన టెక్నాలజీ రంగంలో ముందుకెళ్తున్న ఆమెను ఎవరైనా టామ్‌ బాయ్‌ అని అంటే ఒప్పుకోదు. సాధించాల్సిన లక్ష్యాల కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకెళ్తోంది ఈ టెక్నాలజీ తరంగం.


devathasherifపెదవుల మీద చెరగని చిరునవ్వుతో కనిపించే దేవితాను చూసిన ఎవరికైనా ఆమె ఓ కమర్షియల్‌ వ్యాపారవేత్త అని అంటే నమ్మలేరు. అంత సౌమ్యం గా కనిపించే ఆమె వ్యాపార విషయంలో ఏ చిన్న పొరపాటును కూడా ఒప్పు కోరు. అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా వుండటం వల్లే నేడు తాను ఈ స్థాయికి వచ్చానని దేవిత అంటారు.

అన్నీ నిర్ణీత సమయంలోనే...
‘మగవారి పెత్తనడం నడిచే ఈ ప్రపంచంలో ఆడవారు నెగ్గుకు రావడం కష్టమై న వ్యవహారం. కానీ తలచుకుంటే మాత్రం అసాధ్యం కాదు’ అన్నది దేవిత అం తరంగం. ‘మన చుట్టూ వున్నవారిని ఎన్ని ప్రశ్నలు అడిగినా లేదా ఎన్ని సలహా లు అడిగినా ఇస్తారు. ఎందుకంటే ఆడవారు కష్టపడుతుంటే చూడలేరు. అదే వారితో పోటీగా వస్తే మాత్రం సహించలేరు. ఇటువంటి వారితో డీల్‌ చేయడం అనేది ఓ పెద్ద సవాలు. ఇక బిజినెస్‌లో ఆడ, మగ అని చూడకుండా లాభాలు, నష్టాలు రెంటిని సమన్వయం చేసుకుంటూ విజయం సాధించడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ రోజుల్లో ఆడవారు కూడా అన్ని టా ముందుకొచ్చేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఇక నా వరకు ఇది ఎవరికి సంబంధించి వారి బాధ్యత కూడా. స్వతంత్రంగా బత కడం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుం ది. అది ఉద్యోగమనే కాదు.. మరేదైనా సరే’ అని దేవిత అంటున్నారు.
http://bellthebull.com/wp-content/uploads/2009/09/2.jpeg
టెక్నికల్‌ రంగంపై ఆసక్తి..
లాస్‌ఏంజెల్స్‌ దక్షిణ కాలిపోర్నియా యూనివర్శిటీ నుండి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన దేవిత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుండి గేమ్‌ థియ రీ ఆఫ్‌ స్ట్రాటెజిక్‌లో థింకింగ్‌ కోర్సును చేశారు. ‘చిన్నతనం నుండి టెక్నికల్‌ ఫీ ల్డ్‌ అంటే ఎంతో ఇష్టం. అటువైపుగా వెళ్ళాలని అనుకునేదాన్ని. సొంతంగా అనే క పరికరాలు కూడా రూపొందించేదాన్ని. చిన్న తనంలో ఇంట్లో వుపయోగించే అన్ని రకాల గృహోపకరణాల గురించి తెలుసుకుంటూ వుండేదాన్ని.

techinalవాటిని తయారుచేసే దాన్ని కూడా. నాలో వున్న టాలెంట్‌ని గుర్తించింది నాన్నే. ఆయనే నన్ను ఈ రంగంవైపు ప్రోత్సహించారు. 21 వయసు వున్నప్పుడు ట్రైనీగా జా యిన్‌ అయ్యాను. 22 వయసులో డైరెక్టర్‌గా మారాను’ అని ఎంతో ఆనందం గా చెబుతున్నారు. ఇంకా ‘టెక్నాలజీని ఇష్టపడినంత మాత్రానా ఏదో అబ్బాయి లా వుంటాననుకుంటే మాత్రం పొరపాటే. నేను అందరి అమ్మా యిల్లాగానే వుంటాను. అలాగే ఈ రంగంలో వుండే అన్ని రకాల పోటీలను అర్థం చేసుకో గలను. వాటికి అనుగుణంగా వ్యాపారాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాను. నా చుట్టూ వుండే వారితో తగిన విధంగా వుండగలను’ అని దేవిత చెబుతోంది.

సమష్టి కృషి వల్లే..!
ఎప్పుడూ ఓ కొత్త ఛాలెంజ్‌ కోసం దేవిత ఎదురు చూ స్తూ వుంటుంది. గతేడాది ముంబయిలో జరిగిన ఫస్ట్‌-ఎవర్‌ వియు టిఇడిఎక్స్‌ గేట్‌ వేకు ఎంపికైంది. ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, టెక్ని కల్‌ విభాగం వారు పాల్గొన్నారు. వీరిలో రాల్ప్‌ సైమన్‌, సేమైర్‌ స్టెయిన్‌ వంటి ప్రముఖులూ వున్నారు. ఇందులో పాల్గొనడానికి గల క్రెడిట్‌ మొత్తం ఆమె తన టీమ్‌కే ఇచ్చేశారు. ‘ఇంత గొప్ప విజయానికి కారణం నేను ఒక్కదాన్నే కాదు.. మొత్తం టీమ్‌ అందరూ కృషి చేయడం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో నిలిచాం. అందరూ ఎంతో కష్టపడ్డారు. ఇందులో ఎంతో మంది కాలేజీ విద్యార్థుల ప్రతిభ కూడా వుంది. నేను చేసింది కేవలం కొన్ని చెక్కుల మీద సంతకాలే’ అని ఎంతో హుందాగా నవ్వుతూ అనేస్తారు.

ఓ సాధారణ అమ్మాయిలాగే..!
దేవిత బిజినెస్‌కు మాత్రమే కాదు.. ఓ సాధారణ ముంబయి అమ్మాయిలాగే సినిమాలకు వెళ్తుంది. స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తుంది. చిట్‌ చాట్‌, ఫోన్‌లో కబుర్లు అన్నీ మామూలే. ‘ఇప్పటి వరకు ప్రపంచంలో 125 ప్రముఖ నగరాలు తిరిగాను. వందల మంది స్నేహితులు నాకున్నారు. అందరిలాగే నేనూ వారితో మాట్లాడతాను. చాట్‌ చేస్తాను. అలాగే వంట చేయడం అంటే చాలా ఇష్టం. చాలా బాగా చేస్తాను కూడా’ అని దేవిత చెబుతున్నారు.

టెక్నాలజీ రచయితగా....
ఓ జర్నలిస్టుగా దేవిత టెక్నాలజీకి సంబంధించి ఎన్నో కొత్త అంశాలను పరిచయం చేస్తూ వుంటారు. అత్యాధునిక విధానాల ను నేర్చుకుని మరీ అందిస్తుంటారు. ‘ఎప్పటికప్పుడు ప్రపంచం లో జరిగే చిన్న చిన్న మార్పులను, టెక్నాల జీని తెలుసుకుంటూ వుంటాను. ఏ చిన్న విషయం అయినా సరే ముందుగా తెలుసు కున్న తర్వాతే దానికి సంబంధించిన జర్నల్స్‌ రాస్తాను. ఇప్పుడు సొం తంగా నాకు ఓ కంపెనీ వుంది. దానికి సంబంధించి అభివృద్ధి కోసం కూడా నేను అన్ని విషయాలు తెలుసుకుం టాను’ అని దేవిత చెబుతోంది.

స్ఫూర్తి వీరే : ఇప్పటి వరకు తాను సాధించిన అన్నిటికీ కారణం కొందరి మహిళల జీవిత గమనమే అంటుంది దేవిత. క్వీన్‌ ఎలిజబెత్‌, మార్గరెట్‌, మహా రాణి గాయిత్రీ దేవి, రాణి లక్ష్మీబాయి వంటి వాళ్ళంద రూ తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చారని చెబుతున్నారు.

పోలిక కాదు పోటీ...
దేవిత విజయ రహస్యం చెప్పేందుకు మాత్రం చాలా చిన్నదే. ‘ఎప్పుడూ ఒకరితో పోల్చుకోవడం కన్నా పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే ఎదగగలం. పోల్చుకున్నంత కాలం దానిలా తయారయ్యేందుకు మా త్రమే కృషి చేస్తాం. అదే కొత్తగా ఏదైనా చేస్తే మనకు మనమే ప్రత్యేకం గా వుంటాం. ఇతరులే మనల్ని చూసి నేర్చుకుంటారు. దీనికి నేర్చుకోవాలనే తపన వుండాలి. అది అందరికీ వుపయోగపడాలి. సం తోషాన్ని ఇవ్వాలి. సంతోషంగా నేర్చుకోవాలి. ఇది అందరికీ సాధ్యమని చెప్పలే ను కానీ నేను మాత్రం చేస్తున్నది అదే’.

ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయాలి..
‘ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇంకా చేయాల్సింది.. ప్రయాణిం చాల్సిన దూరం చాలా వుంది. అది సాధించే వరకు నేను ఎటువంటి బంధాల్లో చిక్కుకోవాలని అనుకోవడం లేదు. అలా అని అదేదో బాధ అని చెప్పడం లేదు. నాకున్న ఆశయాలు తీరేందుకు ఇంకా చాలా కాలం పడుతుంది ఆ తరువాతే పెళ్లి’ అని ఈ వ్యాపార వేత్త చెబుతోంది. ఇక చివరిగా ‘ఎంత దూరం వెళ్ళినా సరే.. ఇంకొంచెం దూరం వెళ్ళేందుకు ప్రయత్నించాలి’ అని దేవిత ఈ తరం అమ్మాయిలకు చెబుతోంది. ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు కదూ!

Wednesday, August 25, 2010

హాయ్ చెప్పకపొతే అనాగరికులమే

ఆల్ప్స్ పర్వతాల ఒడిలో చల్లగా ప్రశాంతంగా టూరిస్టులను ఊరిస్తూ ఉంటుందా దేశం. అక్కడ అద్దెకు ఇల్లు కావాలంటే యాభైవేలు కట్టాలి. ఎవరితోనైనా మర్యాదగా మసులుకోవాలి. మూడు రకాలుగా చెత్తను కూడా వేరు చేసి చెత్తకుండీలో పడేయాలి. లేదంటే బోలెడంత ఫైన్. ఇంగ్లీషు వస్తే చాలు అన్నీ మేనేజ్ చెయ్యొచ్చు అనుకోడానికి అస్సల్లేదండీ బాబూ.. ఎందుకంటే అది అక్కడ అస్సలు పనిచేయదు. ఏ ప్రపంచ యుద్ధంలోనూ పాల్గొనని తటస్థ దేశంగా చిన్నప్పుడు చరిత్రలో చదువుకున్న స్విట్జర్లాండ్ గురించే ఇదంతా. ప్రవాస భారతీయుల జీవన శైలిని పరిచయం చేయడంలో భాగంగా స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న అడుసుమల్లి రమేశ్ లైఫ్ స్టైల్ విశేషాలు.

'నేను యూరప్ వెళ్లి తొమ్మిదేళ్లు అవుతోంది. జర్మనీ, ఆస్ట్రియాల్లో ఏడేళ్లు ఉండి రెండేళ్ల కిందటే స్విట్జర్లాండులోని తున్‌కు వచ్చాను. ఇక్కడి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎంప(ఉక్కఅ ఫెడరల్ రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ)లో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాను.


ఉదయం ఆరున్నరకే ట్రాఫిక్
మాకు వారానికి ఐదు రోజులే వర్కింగ్ డేస్. ఉదయం తొమ్మిది నుంచి సాయం కాలం ఐదు వరకు ఆఫీస్ టైమింగ్స్. నేను ఏడున్నర కల్లా ఆఫీస్‌కి స్టార్ట్ అవుతాను. మా ఇల్లు ఆఫీస్‌కి చాలా దగ్గర. అందుకని సైకిల్ మీదే ఆఫీస్‌కి వెళ్తాను. ఇక్కడ సైకిల్ మీద వెళ్లడం సర్వసాధారణం. (ఈ దేశంలో బస్‌లు, రైళ్లు, ట్రామ్స్ అని మూడు రకాల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. చాలా సౌకర్యంగా ఉంటాయి)ఇండియాలో ఉదయం తొమ్మిది నుంచి పదకొండు దాకా ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుందో ఇక్కడ ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిది వరకు అంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది. వెళ్లగానే అందరినీ విష్ చేయాలి.


పలకరించడమనేది తప్పనిసరి. లేకపోతే అనాగరికులుగా చూస్తారు. ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మధ్య అందరూ వస్తారు. అరగంట బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. వారానికి రెండు సార్లు మాత్రమే మన టిఫిన్స్(ఇడ్లీ, దోస). మిగిలిన రోజుల్లో పాలు, కార్న్‌ఫ్లేక్సే. బ్రేక్‌ఫాస్ట్ అవగానే తొమ్మిదికల్లా ఆఫీస్ పని స్టార్టయి పోతుంది. నేను టెక్నీషియన్స్‌ని డీల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బాస్, సబ్ ఆర్డినేట్ అంటూ ఏమీ ఉండదు. అందరూ కొలీగ్స్‌లాగే ఉంటారు.


మాల్ సైట్ పని విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదు. అయినా ఎవరికి వాళ్లే చాలా బాధ్యతగా ఉంటారు. ప్రణాళికా బద్ధంగా కూడ ఉంటారు. చివరి నిమిషంలోహాడావుడి పడడం లాంటివి ఉండవు. వారానికి ఒకటో, రెండో సెమినార్లు, ప్రెజెంటేషన్లు ఉంటాయి. వాటికి ఒకటి, రెండు రోజుల ముందే ప్లాన్ చేసుకుని ఉంటాం కాబట్టి ఎలాంటి కంగారు లేకుండా ముగుస్తాయి. చాట భారతాల్ని ఇష్టపడరు. ఏదైనా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాలి. టీం వర్క్ బాగుంటుంది. లంచ్ టైం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య ఉంటుంది.


అందరూ ఒకే సమయానికి తినాలనేమీ ఉండదు. కాకపోతే లంచ్‌కి వెళ్లేప్పుడు 'మాల్ సైట్ 'అని చెప్పి వెళ్లాలి. అంటే మన కొలీగ్స్‌కి మనం లంచ్‌కి వెళ్తున్నామని తెలియజెప్పడం అన్నమాట. వీలైతే వాళ్లూ వస్తారు లేకపోతే లేదు. కాని అలా చెప్పి వెళ్లడం మాత్రం తప్పనిసరి. ఆఫీస్ క్యాంటీన్‌లోనే లంచ్ ఉంటుంది. లంచ్‌లో గ్రిల్డ్ మీట్, ఫ్రైడ్ మీట్ తోపాటు ఉడకబెట్టిన బంగాళదుంప, సలాడ్ ఉంటాయి. వీళ్లకు ఉడికించిన బంగాళదుంప అన్నం లాంటిదన్నమాట. వీటితోపాటు నూడల్స్, పాస్తాలాంటివి కూడా ఉంటాయి. తప్పకుండా స్పూన్‌తోనే తినాలి.


లంచ్ అయిన వెంటనే ఖచ్చితంగా కాఫీ తాగుతారు. మామూలుగానే గంటకు ఒకసారి కాఫీ తాగుతూ ఉంటారు. చలి ప్రదేశం కదా. అందరూ ఒకే టైంకేమీ వెళ్లరు. ఉదయం త్వరగా వచ్చిన వాళ్లు (ఎనిమిది గంటల పని వేళల లెక్కన) సాయంకాలం త్వరగా వెళ్తారు. లేట్‌గా వచ్చిని వాళ్లు లేట్‌గా వెళ్తారు. చెప్పాను కదా ఇక్కడ పని ఒత్తిడే కాదు వర్క్ లోడ్ కూడా చాలా తక్కువ. లీవులు కూడా 25 దాకా ఉంటాయి. ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడెందుకు తీసుకున్నావ్? అప్పుడే తీసుకోలేకపోయావా? లాంటి ప్రశ్నలేమీ ఉండవు.

వైన్, బీర్లు సంస్కృతిలో భాగం
మన బర్త్‌డే, మ్యారేజ్ డేలాంటి అకేషన్స్‌కి ఓ కేక్ తెచ్చి కొలీగ్స్ అందరికీ మెయిల్ పెట్టాలి. ఈ రోజు మన బర్త్‌డే అని, ఫలానా టైంలో పార్టీఅని. ఆ టైంలో కేక్ కట్ చేసి డ్రింక్స్‌తో చిన్న సైజు పార్టీ చేసుకుంటాం. ఇలాంటివన్నీ కంపల్సరీ . వైన్, బీర్‌లు ఇక్కడ సంస్కృతిలో భాగం. ఇక్కడ గాసిప్స్, టైం పాస్ వ్యవహారాలు ఉండవు.


పర్సనల్ వ్యవహారాలు, వివరాల్లో ఇతరులు ఉత్సుకత ప్రదర్శించకూడదు. పంక్చువాలిటీ, డిసిప్లిన్‌లకి ప్రాణం ఇస్తారు. అలాగని ప్రత్యేక నియమనిబంధనలేమీ ఉండవు. ఎవరికి వాళ్లే ఇక్కడి సిస్టమ్‌ను అర్థం చేసుకుంటూ ఆచరించటమే. ఆఫీస్‌కి కూడా ప్రత్యేక డ్రెస్ కోడంటూ ఏమీ ఉండదు. టక్ చేసుకుని వచ్చావా?టై కట్టుకున్నావా? బెల్ట్ పెట్టుకున్నావా? షూ వేసుకున్నావా? అని పరికించి చూడరు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉన్నావా లేదా అన్నదే ముఖ్యం ఇక్కడ. ఖర్చు మాత్రం ఎక్కువే
ఇక్కడ జీవనం ఖరీదైన వ్యవహారం. ఇల్లు అద్దె 1200 ఫ్రాంక్స్ అంటే మన రూపాయల్లో 50 వేలు. ఇంట్లో చెత్తను దేనికి అదే అంటే ఆహార వ్యర్థాలను ఒక టిన్‌లో, ప్లాస్టిక్‌ను మరొకదాంట్లో, పాతబట్టలు, షూస్ ఒకదాంట్లో, ఇలా వేటికవే వేరు చేసి వీథిలో ఉన్న సపరేట్ డబ్బాల్లో వేయాలి. ఒకవేళ అన్నీ కలిపి ఒకేదాంట్లో వేస్తే దాన్ని రస్ట్ అంటారు.


దానికి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు మున్సిపాలిటి వాళ్లు, వీటన్నిటినీ రీసైక్లింగ్ చేస్తారు. పాత బట్టలు, షూస్ లాంటివి రెడ్ క్రాస్ సొసైటీకి వెళ్తాయి. ఇంటి పనులకు గంటలు గంటలు వెచ్చించాల్సిన పని ఉండదు. రాత్రి భోజనం అయ్యాక నెట్ ముందర కూర్చోవడం, ఇండియాకి ఫోన్లు చేసుకోవడంతో సరిపోతుంది. అయితే నేనున్న ఏరియాలో ఇండియన్స్ చాలా తక్కువగా ఉంటారు.


ఇంగ్లీషు పని చేయదు
యూరప్‌లో యుకె తప్పించి ఏ దేశానికి వెళ్లాలన్నా ఆ దేశం అధికార భాష తప్పకుండా వచ్చుండాలి. నేనున్న చోట జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, రొమేనియన్‌లు అధికార భాషలు. వీటిల్లో ఏదో ఒకటి కచ్చితంగా వచ్చుండాలి. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ ఉపయోగం చాలా చాలా తక్కువ. నేమ్ ప్లేట్లు, సైన్ బోర్డులు ఒక్కటేమిటి అన్నీ ఆ భాషల్లోనే ఉంటాయి. ఇంగ్లీష్ ఎక్కడా కనిపించదు. వాళ్ల భాషను తప్పకుండా ఎలా నేర్చుకుని ఉండాలో వాళ్ల సంస్కృతిని కూడా అంతే ఇదిగా అడాప్ట్ చేసుకోవాలి.


ఇక్కడి వాళ్లు సంస్కృతికి ప్రాణమిస్తారు. వాళ్ల అలవాట్లు, వాళ్ల పద్ధతిని గమనించి అనుసరించాలి. ఏ దేశం వాళ్లయినా సరే ఇక్కడ మాత్రం స్థానికుల్లా ఉండాలని వీరు కోరుకుంటారు. అడిగితేనే సాయం చేస్తారు. లేకపోతే లేదు. అమెరికాతో పోల్చుకుంటే ఇండియన్ రెస్టారెంట్లు, హోటల్స్ తక్కువ. ఇండియన్ షాపులుంటాయి. ఎక్కువగా శ్రీలంక వాళ్లు వీటిని నడుపుతుంటారు. మన వస్తువులన్నీ దొరుకుతాయి.


అయితే ఇండియన్ ఫుడ్ అంటే యూరోపియన్లందరూ చెవి కోసుకుంటారు. మన రెస్టారెంట్లలో వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ల సూపర్ మార్కెట్లలో కూడా ఎమ్‌టిఆర్, ప్రియా వాళ్ల ఉత్పత్తులు దొరుకుతాయి. జర్మనీలోని హామ్(జ్చిఝ)లో ఇండియాలో కూడా లేనంత పెద్ద గుడి ఉంది. దీన్ని శ్రీలంక వాళ్లు కట్టారు. ఎన్నో అనుభూతుల్ని, అనుభవాలను ఇచ్చిన ఈ దేశం వదిలి బిట్స్ పిలానీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అవడానికి ఈ నెలాఖరున ఇండియా వచ్చేస్తున్నాను.' జూ సరస్వతి రమ

Tuesday, August 24, 2010

రాజీవ్ అసలు నాయకుడే కాదు!

కుష్వంత్‌సింగ్ ఎప్పట్లాగే మసాలాలతో దట్టించిన మరో కొత్త పుస్తకం తీసుకొచ్చారు. దాని పేరు 'ఆబ్సెల్యూట్ కుష్వంత్'. తిట్టినా, మెచ్చుకున్నా ఏ మాత్రం మొహమాటాలూ లేవు. 'నేను ఎవర్నీ సీరియస్‌గా తీసుకోలేదు నాతో సహా' అంటారొక చోట. 'అరవై ఏళ్లకు పైగా కలిసి ఉన్నా నేనూ, నా భార్యా సంతోషంగా కాపురం చేయలేదెప్పుడూ' అని కూడా చెప్పుకున్నారాయన. ఒంటరితనం, నిరంతర రచన.. ఈ రెండూ తనకిచ్చిన ఆనందం మరేదీ ఇవ్వలేదని చెప్పుకున్న 95 ఏళ్ల కుష్వంత్ సింగ్ పుస్తకంలోంచి కొన్ని భాగాలు...

అన్నింట్లోకి నాకు ఎక్కువ ఇష్టమైంది ఒంటరితనం. అది నాకు విరివిగా లభించడం నా అదృష్టం. ఒంటరితనం ఎన్నో రకాలుగా ప్రయోజనకరం. మెదడుకు బోలెడు విశ్రాంతి దొరుకుతుంది. ఒక రోజంతా మౌనంగా ఉంటే ఎంతో శక్తి చేకూరుతుంది. మెదడును కాసేపు ఖాళీగా ఉంచగలిగితే- ధ్యానం ఉద్దేశం అదే ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

శృంగారం వైపే నేను..
పురుషులు వృద్ధులవుతున్న కొద్దీ శృంగార వాంఛలు శరీరం కింది భాగాల నుంచి పైకి పాకి మెదడులోకి చేరతాయి. యుక్త వయస్సులో ఏం చేయాలనుకుని చేయలేకపోయారో- వాటిని ఊహించుకొని తృప్తిపడుతూ ఉంటారు. శృంగారం, రొమాన్స్‌లలో ఏది ముఖ్యం అని నన్ను అడిగితే- శృంగారమే అని చెబుతాను. రొమాన్స్ పైపూతలాంటిది. కొద్ది కాలం పోయిన తర్వాత తొలగిపోతుంది.

దానికి ఉండే ఆకర్షణ కూడా పోతుంది. రొమాన్స్ చేయటానికి అవసరమైన సమయం కానీ అభిరుచి కానీ నాకు ఎప్పుడూ లేవు. రొమాన్స్ చేయాలంటే చాలా సమయం కావాలి. అపారమైన శక్తియుక్తులను ఖర్చుపెట్టాలి. దాని వల్ల ఫలితం కూడా పెద్దగా ఉండదు. అందుకే శృంగారం వైపే నేను మొగ్గుచూపుతాను. పురుషులు మాత్రమే మహిళల వెనకపడి ఆకర్షించటానికి ప్రయత్నిస్తారనే ప్రచారం నిజం కాదు.

మహిళలే ఈ కళలో ఆరితేరిన వారని నా గట్టినమ్మకం. నా జీవితంలో- నేను ఆకర్షించటానికి ప్రయత్నించిన మహిళల కన్నా- నన్ను ఆకర్షించటానికి ప్రయత్నించిన మహిళలే ఎక్కువ. నాకు ఎవరి పట్ల అయినా ఆకర్షణ కలిగితే- ఆ విషయం వాళ్లకు చెప్పటానికి చాలా బెరుకుగా అనిపించేది. ఆత్మవిశ్వాసం చాలేది కాదు. కాని చాలా కాలం తర్వాత కలిసినప్పుడు- సందర్భం కుదిరితే చెప్పేవాడిని. అప్పుడు వాళ్లు- "అరే.. ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు?'' అనేవారు.

నెహ్రూ ముచ్చట్లు..
సరుకుల్ని రవాణా చేసే బృందాల నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను ప్రముఖ కవి అలం ఇక్బాల్ ఒకచోట ఇలా చెబుతాడు. "నిగాహ్ బులంద్, సుఖాః దిల్‌నవాజ్, జాన్ పర్ సోజ్- యహీ హై రక్త్ ఎ సఫర్ మీర్ ఎ కార్వాన్ కే లియే'' (విశాల దృక్పథం, అందరినీ ఆకట్టుకొనే మాటతీరు, ఆకర్షించే వ్యక్తిత్వం- కార్వాన్‌ను ముందుకు నడిపించే నేతకు ఉండాల్సిన లక్షణాలు ఇవే).

నెహ్రూకు ఈ మాటలు అతికినట్లు సరిపోతాయి..
నేను నెహ్రూను తొలిసారి లండన్‌లో కలుసుకున్నా. అప్పుడు నేను భారత ఎంబసీలో సమాచార శాఖ అధికారిగా ఉండేవాడిని. నెహ్రూను దగ్గరగా చూసిన తర్వాత ఆయనకు కోపం ముక్కుమీదే ఉంటుందని అర్థమయింది. ఒక్క కోపమే కాదు చాలా అమర్యాదగా కూడా ప్రవర్తిస్తాడని తర్వాత తెలిసింది. బ్రిటన్‌లో ఉన్న ముఖ్యమైన పత్రికల ఎడిటర్లు నెహ్రూను కలవాలనుకున్నారు.

దాంతో నేను ఒక విందు సమావేశం ఏర్పాటు చేశాను. అందరూ భోజనాలు చేస్తున్నారు. ఇంతలో నెహ్రూ హఠాత్తుగా మౌనముద్ర దాల్చాడు. ఎడిటర్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పైకప్పు వైపు చూడటం మొదలుపెట్టాడు. అందరి భోజనాలూ పూర్తికాక ముందే సిగరెట్టు తీసి వెలిగించాడు. గోరుచుట్టుపై రోకలిపోటు అన్నట్లు - మరోపక్క కృష్ణమీనన్ నిద్రపోయాడు.

పబ్లిక్ రిలేషన్స్ ఇంతకన్నా పెద్ద ఉత్పాతం ఏముంటుంది చెప్పండి! మరోసారి నెహ్రూ లండన్‌లో దిగేసరికి అర్థరాత్రి అయింది. నేను ఆయనకు స్వాగతం చెప్పటానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. మర్యాదకు- "నన్ను కూడా మీతో పాటు హోటల్‌కు రమ్మంటారా?'' అని అడిగాను. "డోన్ట్ బీ సిల్లీ.. ఇంటికి వెళ్లి పడుకో'' అని నెహ్రూ కసురుకున్నాడు. ఆ మర్నాడు పేపర్లలో- నెహ్రూ, లేడీ మౌంట్‌బాటెన్‌ల ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి.

ఆ ఫోటోలో- కురచ దుస్తులు వేసుకొని ఉన్న లేడీ మౌంట్‌బాటెన్ తలుపుతీస్తోంది. నెహ్రూ తలుపు దగ్గర ఉన్నాడు. ఒక పత్రికలో ఆ ఫోటో పైన- "లేడీ మౌంట్‌బాటెన్ ఇంటికి అర్థరాత్రి అతిథి'' అనే శీర్షిక పెట్టారు. నెహ్రూకు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. మరోసారి నెహ్రూ, లేడీ మౌంట్‌బాటెన్‌లు కలిసి ఒక గ్రీకు రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ మర్నాడు కూడా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను పత్రికలు ప్రచురించాయి.

నెహ్రూ దగ్గరకు వెళ్లమని నన్ను నా పైఅ«ధికారులు ఆదేశించారు. నేను నెహ్రూ దగ్గరకు వెళ్లాను. ఆయన మూడ్ బావులేదు. "ఎవరు నువ్వు?'' అని నెహ్రూ నన్ను ప్రశ్నించాడు. "సర్.. నేను లండన్‌లో మీ పీఆర్ఓను..'' అని సమాధానమిచ్చాను. "పబ్లిసిటీ ఎలా ఇవ్వాలనే విషయంలో నీకు విచిత్రమైన ఆలోచనలు ఉన్నాయి'' అన్నాడు. అలాంటి సమయాల్లో మౌనమే మంచిదనుకున్నా. నేనేమీ మాట్లాడలేదు.

రాజీవ్ నేత కాదు..
రాజీవ్ గాంధీని కీర్తిస్తూ, అతనిని ఒక ఉన్నత శిఖరాలమీద నిలబెట్టటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ రాజీవ్ కూడా అనేక తప్పులు చేశాడు. వాటిలో కొన్ని తీవ్రమైన తప్పులు కూడా. రాజీవ్‌ను బలవంతంగా రాజకీయాల్లోకి దింపారు. వాటిని అతను సరిగ్గా నిర్వహించలేకపోయాడు. నిజానికి రాజీవ్ చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి. కొన్ని మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ అవి చరిత్రను మార్చేసేటంత గొప్పవైతే కావు.

అసలు అతను ఒక మంచి నాయకుడే కాదు. తన తల్లి అడుగుజాడల్లో నడిచి ఆమె చేసిన తప్పులే అతనూ చేశాడు. టెలికాం, కంప్యూటర్స్ వంటి ఆలోచనలు కూడా ఇందిరాగాంధీ సమయంలో మొదలుపెట్టినవే. శ్రీలంక వ్యవహారాన్ని పూర్తిగా చెడగొట్టాడు. ఒక బహిరంగ సమావేశంలో ఒక మంత్రిని పదవి నుంచి తొలగించాడు. బాబ్రీమసీదు, షాబానో కేసుల్లో అతని పాత్రను మనం తక్కువగా తీసేయలేం.

ఈ రెండు కేసులు మనకు దీర్ఘకాల హాని చేశాయి. ఇందిరాగాంధీ మరణించిన తర్వాత రాజీవ్ ప్రవర్తించిన తీరును చరిత్ర ఎన్నటికీ క్షమించదు. సిక్కులను ఢిల్లీలో సజీవంగా తగలబెట్టేస్తుంటే-"ఒక మహావృక్షం కుప్పకూలినప్పుడు.. చుట్టుపక్కల ఉన్న భూమి కూడా కంపిస్తుంది..'' అన్నాడు. ఆ హత్యలను అతను ఆపి ఉండాల్సింది. ఒక్కసారి బయటకు వెళ్లి- "ఈ హత్యాకాండ ఆపాలి.. రండి..'' అని సైన్యాన్ని పిలిచి ఉంటే సరిపోయేది. కానీ రాజీవ్ అలా చేయలేదు. అంతేకాకుండా తన వ్యాఖ్యల ద్వారా ఆ హత్యాకాండను సమర్థించాడు కూడా.

ఆ పరిస్థితుల్లో నెహ్రూ ఉంటే- ఆ విధంగా చేసి ఉండేవాడు కాదని నేను కచ్చితంగా చెప్పగలను. నెహ్రూకు ధైర్యం ఉంది. బయటకు వెళ్లి అల్లరిమూకలను చెదరగొట్టి ఉండేవాడు. దేశ విభజన సమయంలో నెహ్రూ ఆ విధంగా చేశాడు కూడా. ఒక నేతకు, ఔత్సాహికుడికి మధ్య ఉండే తేడా అదే. అయితే రాజీవ్ సోదరుడు సంజయ్‌గాంధీ చురుకైనవాడు. రాజీవ్ స్కౌట్‌లాంటివాడు.

రాహుల్ శభాష్!
నా దృష్టిలో రాజీవ్ కంటే రాహుల్ చాలా సమర్థుడు. అతనికి ఒక విశాల దృష్టి ఉంది. అది చాలా ముఖ్యమైన విషయం. అతను ప్రవర్తిస్తున్న తీరు కూడా చాలా బావుంది. సరైన దృక్పథమూ ఉంది. అతను చేస్తున్నది పెద్ద పెద్ద పనులు కాకపోయినా- ఆ పనుల వెనకున్న ఆలోచనలు మాత్రం మంచివే. రాహుల్ పరిణతి చెందిన నాయకుడుగా అభివృద్ధి చెందుతున్నాడు.

2014 ఎన్నికలలో- కాంగ్రెస్ గెలిస్తే- రాహుల్ ప్రధాని కావటానికి ఒప్పుకోవచ్చు.. ఒప్పుకోకపోవచ్చు కూడా. అయితే అతని ప్రాధమ్యాలు సరిగ్గానే ఉన్నాయి. అతను కుర్చీల గురించి, పదవుల గురించి పట్టించుకోవటం లేదు. కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలా అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. గత ఏడాది రాహుల్ నాకు ఫోన్ చేశాడు. ఒకసారి వచ్చి కలుస్తాన న్నాడు.

ముందుగా అనుకున్నటు ్ల సాయంత్రం పూట సరిగ్గా నాలుగు గంటలకు వచ్చాడు. ఒక గంటసేపు నాతో కూర్చుని కబుర్లు చెప్పాడు. మేము రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. కాని మా మధ్య జరిగిన మాటల్లో అతని నాయనమ్మ గురించి కానీ, ముత్తాత గురించి కానీ ఎటువంటి ప్రస్తావన రాలేదు.

అనుబంధానికి ‘రాఖీ’

rakhi
అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి... కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నదీ అని ఓ చెల్లెలు తన అన్నయ్య అనురాగం గురించి పాడడంలో ఎంతో అర్థముంది... తనను ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించే అన్నయ్యలంటే ఈ ప్రపంచంలో ప్రతి చెల్లెలికీ అభిమానం, అనురాగం, ఆప్యాయత. ఇంతటి ఆత్మీయతను పంచే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ‘రక్షాబంధన్‌’ పండుగ. దుర్బలులను దుర్మార్గులనుంచి కాపాడాలన్న సంస్కృతికి నాగరకతకు ప్రతీక రాఖీ. ప్రతి యేటా శ్రావణమాసంలో వచ్చేపౌర్ణమినే శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి అంటారు. ఉత్తర భారతంలో ఈ పండుగను కజ్రీ పూర్ణిమ అని కూడా అంటారు. అక్కడ ఈ సమయంలోనే రైతులు గోధుమ, బార్లీ నాట్లు వేయటం విశేషం.

rakhi3
ఒక కుటుంబంలోనే కాక యావత్‌ సమాజంలో సోదర ప్రేమకు, సుహృద్భావానికి రాఖీ ప్రతీక నిలుస్తుంది. సమాజంలో సామరస్యానికి పునాది వేస్తుంది. శాంతియుత సహజీవనానికి రాజమార్గం రాఖీ. గురుదేవులు విశ్వకవి రవీంద్రుడు రాఖీ ఉత్సవాలను భారీ ఎత్తున జరిపించేవారు. ఈ రోజు ‘ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌’గా ప్రచారంలో వున్నది ఒక విధంగా రాఖీ సంప్రదాయానికి కొనసాగింపేనంటే అతిశయోక్తి కాదు. ఒక పురుషుడు సాటియువతిపై హద్దుమీరిన మమకారం పెంచుకున్న సందర్భంలో ఆ సదరు యువతికి అతనిపై ఇష్టం లేనట్లయితే... ఆ మక్కువను స్నేహానికే పరిమితమని అది సోదర ప్రేమగా మాత్రమే ఉంటే బాగుంటుందని సున్నితంగా సూక్షంగా రాఖీ ద్వారా తెలియజేస్తుంది. అలాంటి పవిత్ర సోదర ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగ మూలాలు ఇప్పటివి కావు. చరిత్రలో ఎందరో ప్రముఖులు రాఖీ ద్వారా తమ సోదరప్రేమను చాటుకున్నారు.

అలెగ్జాండర్‌కు రాణీ సంయుక్త రాఖీ
rakhi2పురుషోత్తమ మహారాజుకు అలెగ్జాండర్‌కు మధ్య జరిగిన యుద్ధంలో పురుషోత్తముడు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తన చేతిలో పరాజితుడైన పురుషోత్తముడిని అలెగ్జాండర్‌ బందీని చేసి తీసుకువెళ్తున్న సమయంలో ఆ విషయం తెలుసుకున్న పురుషోత్తముని భార్య రాణీ సంయుక్త వెంటనే అలెగ్జాండర్‌ వద్దకు వెళ్లి అతని చేతికి రాఖీ కడుతుంది. దాంతో సంయుక్తను చెల్లెలిగా అంగీకరించిన అలెగ్జాండర్‌ ఏమి కావాలో కోరుకోమంటాడు. యుద్ధంలో పరాజితుడై బందీగా పట్టుకున్న తన భర్త పురుషోత్తముడిని బంధ విముక్తుడిని చేయాలని ఆమె వేడుకుంటుంది. దీనికి అలెగ్జాండర్‌ ఒప్పుకొని పురుషోత్తముని విడిచి పెట్టడంతోపాటు అతని రాజ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేస్తాడు. రాఖీ కట్టి సోదరి అయిన రాణీ సంయుక్తను విలువైన కానుకలతో సత్కరించి తిరిగి వెళతాడు.

బలి చక్రవర్తి కాలంలో...
దానవుల రాజుగా వాసికెక్కిన బలి చక్రవర్తి కాలంలో అతనికి బందీలైన వారంతా
‘‘యేన బద్ధో బలీరాజా... దానవేంద్రో మహాబలః...
తేనత్వాం అభిబద్ధామి... రక్షేమాచల మాచల’’... ఆయన చేతికి రాఖీ కట్టి తమను తాము కాపాడుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
సుదూర ప్రాంతాల్లోని సోదరులకు సైతం ‘రాఖీ’లు
‚అయితే ఈ రాఖీ పండుగను వివిధ ప్రాంతాల వారు వివిధ పేర్లతో పిలిచినా ఎక్కువగా ‘రక్షాబంధన్‌’ పేరుతో వ్యవహరిస్తారు. పెళ్లై అత్తవారింట్లో ఉన్న సోదరీ మణులు సైతం పండుగ రోజున తమ పుట్టింటికి వచ్చి సోదరులకు రాఖీ కడుతుంటారు. ప్రస్తుత ఆధునిక కాలంలో రాఖీలను దూర ప్రాంతాల్లో ఉన్న తమ అన్నదమ్ములకు ప్రత్యేకంగా రాఖీలను పంపుతుంటారు అక్కా చెల్లెళ్లు.

క్రిష్ణుడి చేతికి ద్రౌపది రాఖీ..
rakhi4ద్వాపరయుగం కాలంలో సైతం రాఖీ పండుగ అత్యంత విశిష్టతను చాటుకుంది... శ్రీకృష్ణుని చేతికి ద్రౌపది రాఖీ కట్టి తనను రక్షించా లని కోరుతుంది. ఇదే క్రమంలో ఆమెకు కష్టం వచ్చిన ప్రతిసారి శ్రీకృష్ణుడు వచ్చి ఆదుకునేవాడు. ఇలా చెప్పుకుం టూ వెళితే మన పురాణాల్లో మరెన్నో సంఘటనలు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తాయి.

‘రాఖీ కేరాఫ్‌ ధూల్‌పేట్‌‌‌’
నగరంలోని ధూల్‌పేట్‌ రాఖీల తయారీకి పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో ఏ సీజన్‌కు ఆ వస్తువులను తయారుచేయడం ప్రత్యేకత. అయితే రాఖీ పండు గకు రెండు నెలల ముందునుంచే పెద్ద ఎత్తున, రకరకాల రాఖీలను తయా రు చేస్తూ వందలాది కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. గతంలో పెద్ద సైజులో మెరుపు కాగితాలతో వీరు రాఖీలను తయారు చేసేవారు అయితే మారుతున్న కాలంతో పాటే వీరు కూడా రాఖీలను అందంగా అర్థవంతంగా తయారుచేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. నగరంలోనేగాక రాష్ట్రంలోని ఇతర ప్రాం తాలకు, దేశ, విదేశాలకు సైతం వీరు తయారుచేసిన రాఖీలే వెళుతుండడం విశేషం. రాఖీ పండుగ దగ్గరపడడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రంగురంగుల, అందమైన రాఖీలు మార్కెట్‌లో కొలువుదీరాయి.

rakhi1రాఖీ రాజ్యాల మధ్య బాంధవ్యం నెలకొల్పిందనేదది చారిత్రక సత్యం. రాజ్‌పుట్‌, మరాఠా రాణులు మొగలాయి చక్రవర్తులకు రాఖీలు పంపి సామరస్య బాంధవ్యాలు నెలకొల్పిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలు. రాఖీ పౌర్ణమి నాడు అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు కట్టే రాఖీ కేవలం దారానికి పూలు, మెరుపు కాగితాలు అలంకరించిన ఒక ఆభర ణంగా మాత్రమే భావించడానికి వీలులేదు. ఇది అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ముడిపడి ఉన్న బలమైన ప్రతీక. తమ సోదరులు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెల్లెళ్లు కోరుకుంటే, తమ అక్కా చెల్లెళ్లు సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని అన్నద మ్ములు కోరుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ రాఖీ పండుగను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు ప్రత్యేకంగా జరుపుకొంటారు. రాఖీ పండుగ ఈనాటిది కాదని తరతరాలుగా ఈ సంప్రదాయం వుంద నడానికి ఎన్నో గాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి.

కేవలం స్వగ్రామంలోనే ఉన్న సోదరులకేగాక దేశ, విదేశాల్లో స్థిరపడ్డ అన్నదమ్ములకు సైతం రాఖీలు పంపే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పండుగలు సైతం ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుం టున్నాయి. నేడు విదేశాల్లో ఉన్న తమ సోదరులకు చాలామంది యువతలు ఇంటర్‌నెట్‌ కేవలం ఒక మౌస్‌ క్లిక్‌తో రాఖీ కట్టేస్తున్నారు. కొన్ని సంస్థలు ఇంటర్నెట్‌ ద్వారా ఆర్డర్లు తీసుకొని రాఖీలను చేరవేస్తున్నాయి. వారు వెబ్‌సైట్లలో ముందే పొందు పరిచిన రాఖీ నమూనాల నుండి మనకు ఇష్టమైన రాఖీని ఎంచుకొని విదేశాల్లో ఉన్న సోదరులకు పంపవచ్చు.


ఎంత దూరమైనా ఒక్కరోజులోనే సోదరులకు ‘రాఖీ’
ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా విదేశాల్లో ఉన్న సోదరులకు ఇప్పటివరకు పోస్టు ద్వారా రాఖీలను పంపేవారు. దీనివలన షిప్‌లలో వెళ్లే మెయిల్‌కయితే అమెరికా, యుకె వంటి సుదూర దేశాలకు రాఖీ అందడానికి కనీసం పక్షం రోజులైనా పట్టేది. ఒకవేళ విమానంలో పంపినా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే కొన్ని సంస్థలు ఈ సమస్యకు పరిష్కారంగా ప్రత్యేక వెబ్‌సైట్‌లను ప్రారంభించాయి. ఈ వెబ్‌సైట్‌లలో లాగిన్‌ అయి ఆర్డర్‌ చేస్తే తాము కోరుకున్న ప్రాంతంలోని చిరునామాకు అదే రోజున రాఖీ అందే ఏర్పాటు చేస్తూ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా మంగళవారం ఓ ప్రైవేట్‌ సంస్థ నెలకొల్పిన ఠీఠీఠీ.జీజ్టట2టజీ.ఛిౌఝ ప్రత్యేక వెబ్‌సైట్‌ను హీరో వరుణ్‌ సందేశ్‌, వర్ధమాన నటి శరణ్య మోహన్‌లు ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్‌చేసిన రోజునే అమెరికా, యు.కె, కెనడా వంటి దేశాల్లో ఉన్నవారికి రాఖీలు అందే ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
- ఏముల ఈశ్వర్‌బాబు,

ప్రేమను బంధాం రాఖీ బంధాం

బలహీనమైన దారాలే బలమైన అనుబంధాలకు ఆలంబన కావడం మన సంస్కృతిలోని ఒక వైచిత్రి. భార్యాభర్తల బంధానికి మంగళ సూత్రం ఒక చిహ్నమయితే సోదరీసోదరుల అనుబంధానికి రాఖీ అందమైన ప్రతీకగా మారింది. సారంలోనే కాదు రూపంలోనూ ఇది ఏటా కొత్త అందాన్ని సంతరించుకుంటోంది. మార్కెట్‌లో ఉన్న కొన్ని కొత్త రాఖీల గురించి తెలుసుకుందాం.

రాఖీ అంటే ఇప్పుడు కేవలం ఒక ఎర్రదారం కడితే సరిపోదు. మీ సోదరుల పట్ల మీ ప్రేమ ప్రత్యేకమైనదని తెలియజెప్పాలంటే మీరు ఎంచుకునే రాఖీకి అలాంటి ప్రత్యేకత ఏదో ఉండాలి మరి. స్టోన్ వర్క్, కుందన్, ముత్యాలు, రుద్రాక్ష, చమ్కీ, బటన్ హోల్, వెల్‌వెట్, త్రిజోన్, సింగిల్ పీస్, ఫ్యాన్సీ మెటల్, జరీ, డోరీలు, చందన్, రేషం, కోల్‌కత్తా పర్ని, పంజాబి, లుంబ, క్రిస్టల్ బీడ్స్, జర్దోసీ వర్క్ ఇన్ని రకాల రాఖీలున్నాయి కాబట్టి వాటిల్లోంచి మీకూ మీ సోదరుడికీ ఏది నచ్చుతుందో ఆలోచించి ఎంపిక చేసుకోవచ్చు.

కాస్త కాస్ట్‌లీ
ఒక రూపాయి నుంచి 300 రూపాయల వరకు రాఖీలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఇంకా కాస్త కాస్ట్‌లీవి కావాలంటే విలువైన రుద్రాక్షలు, రాళ్లు అద్దినవి, మోతీ, వెండి, డైమండ్ రాఖీలను మీ స్థోమతని బట్టి ఎంచుకోవచ్చు. పది, వంద, ఐదు వందల రూపాయల నోటు పెట్టి అల్లిన రాఖీలు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

పిల్లలకు ప్రత్యేకం
పిల్లల రాఖీలంటేనే స్పెషల్‌గా ఉంటాయి. వారి ఆల్‌టైమ్ ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ రాఖీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మగధీర, బాల హనుమాన్ , జూజూ రాఖీలు ఇప్పుడు కొత్తగా వచ్చాయి. బైక్స్, మిక్కీ మౌస్, టామ్ అండ్ జెర్రీ, పవర్ రేంజర్స్, జంతువులు, పక్షుల బొమ్మలున్న రాఖీలు కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్ముతున్నారు.

భయ్యా బాబీ రాఖీలు
కేవలం సోదరుల కోసమే కాదు అన్నా వదిన, తమ్ముడు మరదలు కోసం ప్రత్యేకమైన రాఖీ సెట్లు భయ్యా బాబీ రాఖీల పేరుతో దొరుకుతున్నాయి. అంతేకాదు వేరే ఊర్లో ఉండి స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని వారు కొరియర్ చేసేందుకు వీలుగా కుంకుమ, గంధం, అంక్షింతలు ఉన్న ప్యాకేజీలు కూడా ఉన్నాయి.

ఫోటో రాఖీలు
ఈ రక్షాబంధన్‌కి 'సువా గిఫ్ట్స్' వాళ్లు ప్రత్యేక రాఖీలు తయారుచేశారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని ప్రయోగాన్ని వాళ్లు చేశారు. చుట్టూ మెటల్ బీడ్స్, స్టోన్స్, జరీ మధ్యలో రాఖీ కట్టించుకునే అన్న ఫోటో లేదా వాళ్ల పక్కన మీరున్న ఫోటో ఉండటమే ఈ రాఖీ ప్రత్యేకత. పది రోజుల కిందట మార్కెట్లోకి వచ్చిన ఈ రాఖీలు ఇప్పటికే వెయ్యికి పైగా అమ్ముడయ్యాయి.

మీకు కావాల్సిన ఫోటో ఇస్తే అరగంట వ్యవధిలో చేసి ఇస్తారు. ఈ రాఖీలకు రాష్ట్రం నుంచే కాదు దేశం నలుమూలల నుంచి మంచి డిమాండు వస్తోందని చెప్పారు వీటి రూపకర్తలు సిద్ధార్థ జైన్, పవన్ రాజ్ జైన్‌లు. కుంకుమ, అక్షింతలు, ఒక డైరీ మిల్క్ చాక్‌లెట్ మధ్యన ఈ రాఖీ ఒదిగి అందమైన ప్యాక్‌లో లభిస్తుంది. కాబట్టి రాఖీ కట్టగానే కుంకుమ, అక్షింతలు, స్వీట్ కోసం వెతుక్కునే పనికూడా ఉండదు. బావుంది కదూ ఈ ఏర్పాటు.

రేటు కాస్త ఎక్కువే 225 రూ. ఇవీ, ధూల్‌పేటలో తయారయ్యే కొన్ని రకాల రాఖీలు మినహా ఎక్కువ రాఖీలు మనకు ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల నుండి వస్తాయి. వీటిలో కోల్‌కతా ఫ్యాన్సీ రాఖీలకు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు. హోల్‌సేల్ డీలరు సురేష్ యాదవ్.

ఇంటర్ నెట్ రాఖీలు
విదేశాల్లో ఉండేవారు ఇక్కడ తమ వారికి రాఖీని, కానుకలను పంపేందుకు కొన్ని వెబ్‌సైట్లు సహకరిస్తున్నాయి. అందులో మనం ఎంచుకున్న రాఖీని, కానుకలను మనం ఇచ్చిన చిరునామాకు ఆ పోర్టల్స్ పంపుతాయి. అందుకోసం కొంత ఛార్జి తీసుకుంటున్నాయి. అలాంటి కొన్ని వెబ్‌సైట్లు ఇవి.

www.sendrakhigiftstoindia.com
rakhi.rediff.com
rakhi.indiangiftsportal.com
www.virtualrakhi.com
www.rakhiindia.com

Monday, August 23, 2010

నలందోదయం

nalanda
ఎన్నో దేశాలు కన్ను తెరవకముందే చదువుల్లో కీర్తి బావుటను నలంద ఎగరవేసింది. ప్రపంచానికి జ్ఞానజ్యోతులని పంచింది. భారత ఖ్యాతిని ్రపపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. ఎన్నో ఏళ్ల చరిత్ర గల నలందా విశ్వవిద్యాలయం....మరికొన్ని రోజుల్లో కొత్త రూపురేఖను సంతరించుకోవటానికి ఓ అడుగు (బిల్లు) దూరంలో ఉంది. నలంద విశ్వవిద్యాలయం తిరిగి ప్రాచీన వైభవాన్ని సంతరించుకోవాలంటే లోక్‌సభ ఓటింగ్‌ కీలకం. నలంద విశ్వవిద్యాలయ బిల్లు 2010ని రాజ్యసభ ఆమోదించింది. యూనివర్సిటీ ఆఫ్‌ నలంద యాక్ట్‌ 2007లో బీహార్‌ అసెంబ్లీలో తొలిగా ప్రవేశెపెట్టింది. 2007లో జరిగిన దక్షిణాసియా సదస్సులో దీని మీద చర్చలు జరిగాయి. 2009 అక్టోబర్‌ 25న థాయ్‌లాండ్‌లో జరిగిన 4వ దక్షిణాసియా సదస్సులోను దీన్ని ప్రస్తావించారు.

నలంద ఖ్యాతి
nalaబీహార్‌ రాజధాని పాటా్ని ( పాటలీపుత్రం) 55 కిలోమీటర్ల దూరంలో నలంద విశ్వవిద్యాలయం ఉంది. గుప్తుల రాజైన కుమారగుప్త సమయంలో దీన్ని నిర్మించారు. బుద్ధులు సందర్శించే పవిత్ర స్థలాల్లో నలంద కూడా ఒకటి. 10వేల విద్యార్థులు, 2వేల ఉపాధ్యాయులు మరెంతో మంది సిబ్బందికి ఒకేసారి బోధనను అందించే సదుపాయం ఇక్కడ ఉండేది. ఖగోళ, వాస్తు ప్రకారం దీన్ని నిర్మించారు. ఇక్కడ 8 అద్భుత భవనాలు, ఓ సూర్యాలయంతో పాటూ పది ఇతర దేవాలయాలుండేవి. యోగా, ధ్యానం కోసం ప్రత్యేక గదులుండేవి. కొలనులు, సుందర ఉద్యానవనాలతో పరిసర ప్రాంతాలు కళకళలాడుతుండేవి. 9 అంతస్థుల భవనంలో గ్రంథాలయం ఉండేది. గణితం, సాహిత్యం, భాష, ఖగోళం ఇలా ఒకటేమిటి ప్రతి అంశం మీద బోధించటానికి సుశిక్షితులైన అధ్యాపకులుండేవారు.

కొరియా, జపాన్‌, చైనా, టిబెట్‌, ఇండోనేషియా, పర్షియా, టర్కీ విద్యార్థులు నలందలో చదువుకోవటానికి ఎక్కువగా వస్తుండేవారు. 427 బిసి నుంచి 1197 సంవత్సరం వరకు బౌద్ధులకి విద్యా బోధనా కేంద్రంగా ఉంది. చరిత్రలో మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది నలందనే. మౌర్య రాజులు, అశోకుడు, గుప్తులు ఇక్కడ చారిత్రక కట్టడాలను నిర్మించారు. భక్తయార్‌ ఖిల్జి (1193) పరిపాలనలో నలంద పతనం ప్రారంభమైంది. విశిష్టమైన కట్టడాలెన్నింటినో ధ్వంసం చేశారు. ఎంతోమందిని తరిమేశారు. ఎన్నో విలువైన గ్రంథాలను, సాహిత్యాలను తగులబెట్టారు. ఇక్కడ ఉన్న గ్రంథాలయాన్ని కాల్చితే.... అందులో ఉన్న పుస్తకాలు మూడు నెలల పాటూ కాలుతూనే ఉన్నాయంటే ..ఎన్ని కోట్ల సాహిత్యాన్ని నాశనం చేశారో అర్థం చేసుకోవచ్చు.

అమర్త్వసేన్‌ నాయకత్వంలో..
నలంద పునరుద్ధరణకు కొన్ని సంస్థలు, దేశాలు ముందుకొచ్చినా....ఆర్థికశాస్త్రంలో భారత్‌కి తొలి నోబెల్‌ని అందించిన అమర్త్వసేన్‌ ఆధ్వర్యంలో ఓ బృందం ఏర్పాటైంది. దేశానికి చెందిన ప్రముఖ ప్రొఫెసర్లు, మేఘనాథ్‌ దేశాయ్‌, సుగోత్‌ బోస్‌, నంద్‌ కిషోర్‌ సింగ్‌, చైనా ఫ్రొఫెసర్‌ వాంగ్‌ బెన్‌వాయి ( బీజింగ్‌ విశ్వవిద్యాలయం) సింగపూర్‌ విదేశాంగ మంత్రులు హిరయామ, జార్జి యో ఇందులో ఉన్నారు. వీరందరూ కలసి వివిధ పట్టణాల్లో నలంద పునరుద్ధరణ పైన ఆరు సమావేశాలను నిర్వహించారు.నలందలో ప్రవేశపెట్టబోయే కోర్సులు వాటి బోధనా విధానంపైన వీరు కసరత్తు చేస్తున్నారు.

ప్రపంచానికి కాంతులు
amartya-sen నలంద పునరుద్ధరణకు అంతర్జాతీయంగా 1951లోనే నవ నలందా మహావీరా పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. పాట్నాకి 100 కిలోమీటర్ల దూరంలో ప్రధాన కేంద్రం ఉంది.దేశ తొలి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్‌ దీనికి పునాది రాయి వేశారు. 1956లో మొదటి భవనాన్ని సర్వేపల్లి రాధాకృష్ణనన్‌ ప్రారంభించారు. 1981లో రాష్టప్రతి నీలం సంజీవ రెడ్డి విదేశీ విద్యార్థుల కోసం అంతర్జాతీయ హస్టల్‌ భవన నిర్మాణానికి పునాది వేశారు. 2008 - 2009 సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 397 విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.

బర్మా, శ్రీలంక, థాయ్‌లాండ్‌, కాంబోడియా, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన 95 మంది సన్యాసులున్నారు. 2006లో సింగపూర్‌, చైనా, భారత్‌, జపాన్‌తో పాటూ మరికొన్ని దేశాలు నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించటానికి ముందుకొచ్చాయి. ఇప్పటి వరకు లభించిన మనుస్క్రిప్ట్స్‌ను నలందా మ్యూజియంలో జనవరి 26, 2008న తొలిసారిగా 3డిలో ప్రదర్శించారు. నలంద కాంతి దశదిశలా మళ్లీ వ్యాపించాలి. అందరికి జ్యోతిని ( విద్య) పంచాలి. నలంద కిరణాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి.

కొత్తదనంతో రూ. కోట్లకు పడగెత్తిన ఆ నలుగురు !


కొత్తదనం అందరినీ ఆకట్టుకుంటుంది. వ్యాపారంలో ఇది మరింతగా వర్తిస్తుంది.విశిష్ట బ్రాండ్‌లను రూపొందించి, వైవిధ్యభరిత వాణిజ్య విధానాలను అనుసరిస్తున్న 30 మంది పారిశ్రామికవేత్తల జాబితాను ఇంక్‌ మంత్లీ బిజినెస్‌ మ్యాగజైన్‌ రూపొందించింది. వీరంతా అమెరికాకు చెందిన వారే. వీరిలో నలుగురు భారతీయులు ఉండడం విశేషం. నూతన తరం పారిశ్రామికవేత్తలు ఒంటరిగా వ్యాపారం చేయదలచుకోలేదు.భాగస్వాములతో కలసి వారు ఈ వ్యాపారాలను ఆరంభిస్తున్నారు. వారికి ఈ వ్యాపారం అనేది తమ సామాజిక జీవనాన్ని విస్తరించుకునే సాధనంగా ఉపకరిస్తోందని ఇంక్‌ పత్రిక పేర్కొంది.

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ అప్లికేషన్‌తో...
navin 
నవీన్‌ సెల్వదురై (28) ఫోర్‌స్క్వేర్‌ అనే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ అప్లికేషన్‌కు సహవ్యవస్థాపకుడు. వికాస్‌ రెడ్డి (26) ఆక్సిపిటల్‌ అనే టెక్నాలజీ ఆధారిత సంస్థకు సహవ్యవస్థాపకుడు. సచిన్‌ అగర్వాల్‌ (30) పోస్టరస్‌ సంస్థను స్థాపించాడు. స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ ఒశామా గార్జ్‌ (22) కూడా ఈ జాబితాలో స్థానం సాధించాడు. వీరంతా కూడా మార్కెట్‌లో ఎంతో వినూత్నతను ప్రదర్శించారని ఇంక్‌ పత్రిక పేర్కొంది. నవీన్‌ సెల్వదురై మొన్నటి వరకూ సాఫ్ట్‌వేర్‌ అర్కిటెక్ట్‌గా ఉండేవారు.

2009లో ఆయన ఫోర్‌స్క్వేర్‌ను మరికొందరితో కలసి ఏర్పాటు చేశారు. ఫోర్‌స్క్వేర్‌ అనేది ఓ మొబైల్‌ అప్లికేషన్‌. ఇది ఫ్రెండ్‌ఫైండర్గా, సోషల్‌ సిటీ గైడ్‌గా మాత్రమే గాకుండా ఓ గేమ్‌గా కూడా పని చేస్తుంది.దీన్ని సుమారు 20 లక్షల మంది ఉపయోగిస్తున్నారు. దీని ప్రస్తుత వ్యాపార విలువ 100 మిలియన్‌ డాలర్లు అని అంచనా. ఈ సంస్థ నిలకడగా దినదినాభివృద్ధి చెందుతోంది. వారానికి లక్ష మంది కొత్త సభ్యులు ఇందులో చేరుతున్నారు. త్వరలో దీన్ని భారీగా రీడిజైన్‌ చేయనున్నారు.

కమర్షియల్‌ అప్లికేషన్‌

vikas-reddy 
వికాస్‌ రెడ్డి 2008లో ఆక్సిపిటాల్‌ అనే టెక్నాలజీ సంస్థను నెలకొల్పాడు. ఈ సంస్థ రెడ్‌ లేజర్‌ అనే బెస్ట్‌ సెల్లింగ్‌ ఐఫోన్‌ అప్లికేషన్‌ను రూపొందించింది. దీంతో యూజర్లు బార్‌కోడ్‌లను స్కాన్‌ చేసుకోగలరు. 2009 మేలో ఆరంభ మైంది మొదలు దీన్ని 20 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మార్కెట్లోని అత్యుత్తమ పెయిడ్‌ ఐఫోన్‌ అప్లికేషన్‌గా ఇది మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఇటీవలే ఈ ఉత్పాదనను ఇ-బే సంస్థకు విక్రయించింది వచ్చిన మొత్తం ద్వారా మరిన్ని వినూత్న ఉత్పాదనలను రూపొందించనుంది. 2009లో ఆక్సిపిటల్‌ ఒక మిలియన్‌ డాలర్లను ఆర్జించింది. ఈ ఏడాది 2.5 మిలియన్లను ఆర్జించాలన్నది దీని లక్ష్యం.


sachin-agarwal 
బ్లాగింగ్‌ ఎంతో సులభం యాలన్నది దీని లక్ష్యం. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఈ కంపెనీ ఇప్పటికే 5 మిలియన్‌ డాలర్లను ఆర్జించగలిగింది. వై కాంబి నేటర్‌ అనే అమెరికన్‌ ప్రోత్సాహక సంస్థ దీనికి అండగా నిలిచింది. ఫోటోలు పోస్ట్‌ చేసేందుకు ఫేస్‌బుక్‌లోకి లాగిన్‌ అయ్యే బదులుగా లేదా బ్లాగింగ్‌ సైట్‌లో మీ ఆలోచనలు వెల్లడించేందుకు ఆ సైట్‌లోకి ప్రవేశించేందుకు బదులుగా ఇలాంటి వాటిని అన్నింటినీ ఇ-మెయిల్‌ అకౌంట్‌లోనుంచే చేసే సదుపాయాన్ని ఈ ఉత్పాదన అందిస్తుంది. ప్రస్తుతం ఈ సేవను ఉచితంగానే అందిస్తు న్నప్పటికీ, దీన్ని ప్రీమియం సర్వీస్‌గా మార్చే యోచనలో సంస్థ ఉంది. దీని వల్ల యూజర్లకు మరింత స్పేస్‌ అందించవచ్చన్నది సంస్థ భావన.

రిక్రూట్‌మెంట్‌ ఎంతో తేలిక
ooshma-garg 
స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ గార్గ్‌ (22) అనాపటా అనే ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ సైట్‌ను ఆరంభించింది. వివిధ న్యాయవిద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేట్లను ఎంచుకోవడంలో లా ఫర్మ్‌లకు ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని బిజినెస్‌ స్కూల్‌ రిక్రూటర్లకు కూడా విస్తరింపజేయాలన్న యోచనలో గార్గ్‌ ఉంది.

Tuesday, August 17, 2010

"ఒక విలువ..ఒక విశ్వాసం''

పరిశ్రమ అంటే చాలా మందికి టాటానే గుర్తుకొస్తుంది. మనం వాడే వాహనాల దగ్గర నుంచి వేసుకునే మందుల దాకా- ప్రతి విషయంలోను టాటా కంపెనీలు తమ ఉత్పత్తుల ద్వారా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలాంటి గ్రూపుకు రతన్ టాటా తర్వాత వారసుడు ఎవరు? అతను మళ్లీ పార్సీనే అవుతాడా? మరెవరన్నానా? ఇలాంటి అనేక ప్రశ్నలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ - "టాటా- ద ఇవల్యూషన్ ఆఫ్ ఏ కార్పొరేట్ బ్రాండ్' అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ప్రముఖ రచయిత మోర్జిన్ విట్‌జెల్ రాసిన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం...

"నేను ఆఫీసులో కూర్చుని అకౌంట్స్ చూసుకుంటున్నా. ఇంతలో తలుపు తెరుచుకుంది. విచిత్రమైన వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. నా టేబుల్ దగ్గర నిలబడి ఒక నిమిషం నావైపు చూశాడు. ఆ తర్వాత- ' నేను ఇండియాలో ఒక స్టీల్ మిల్లు నిర్మించాలనుకుంటున్నా. మీరు వచ్చి స్థలాన్ని చూడండి. డిజైన్ చేయండి. దీనికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తా' అన్నాడు. నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. కాని అతను మాత్రం గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిలా కనబడ్డాడు...''

ఈ వాక్యాలు రాసింది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైనింగ్ ఇంజినీర్ చార్లెస్ పేజీ పిరిన్. అతని ఆఫీసుకి వెళ్లింది జమ్‌షెడ్‌జీ ఎన్ టాటా. టాటా గ్రూపు చరిత్ర ప్రారంభమయ్యేది ఈయనతోనే. ముంబాయిలో టాటా గ్రూపు ప్రధాన కార్యాలయం 'బోంబే హౌస్'కు వెళితే పాలరాతితో చేసిన జమ్‌షెడ్‌జీ టాటా విగ్రహమే ముందు కనిపిస్తుంది.

జెమ్‌షెడ్‌జీ చనిపోయి వందేళ్లు పూర్తయిన తర్వాత కూడా- ఆ గ్రూపు కార్యకలాపాలపై ఆయన ప్రభావం స్పష్టంగా మనకు తెలుస్తూనే ఉంటుంది. 'నమ్మకం..సేవ' ఈ రెండు విలువలను జెమ్‌షెడ్‌జీ గాఢంగా నమ్మారు. ఆయన చేసిన వ్యాపారాలన్నింటిలోను వీటిని చొప్పించటానికి ప్రయత్నించారు.

జెమ్‌షెడ్‌జీ నసీర్‌వాన్‌జీ టాటా గుజరాత్‌లోని నవసారి అనే పట్టణంలో 1839, మార్చి 3వ తేదీన జన్మించారు. జెమ్‌షెడ్‌జీ తండ్రి పేరు నసీర్‌వాన్‌జీ. ముంబాయిలో పేరు ప్రఖ్యాతులుగాంచిన బ్యాంకింగ్ వ్యాపారస్తుడు. అతని పూర్వీకులందరూ పర్షియాకు చెందినవారు. మతపరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి భారత్‌కు పారిపోయి వచ్చినవారు. అందుకే వారికి పార్సీలనే పేరువచ్చింది. పర్షియా నుంచి వచ్చిన తర్వాత కూడా వీరందరూ జొరాస్ట్రియన్ మతాన్నే గాఢంగా నమ్మేవారు.

వ్యాపారంలో వీరు గణనీయంగా రాణించటానికి వెనకున్న కారణాలను టాటా కుటుంబ చరిత్రపై కొన్ని పుస్తకాలు రాసిన ఆర్.ఎం.లాల్ విశ్లేషించారు. దీని ప్రకారం హిందు మత వ్యవస్థలో ఉన్న నిబంధనలు పార్సీలకు లేవు. ముఖ్యంగా విదేశీయానం చేయకూడదనే నిబంధన హిందూ మతస్థులపై తీవ్ర ప్రభావం చూపింది. కానీ పార్సీలకు ఆ పరిమితి లేకపోవడంతో విదేశాలలో విస్తృతంగా పర్యటించేవారు. బహుశా జెమ్‌షెడ్‌జీ ప్రపంచవ్యాప్తంగా పర్యటించటానికి, అక్కడ ఉన్న కొత్త అంశాలను భారత్‌లో ప్రవేశపెట్టడానికి కారణం ఇదే కావచ్చు..

(అందరి కన్నా భిన్నంగా ఆలోచించటం జెమ్‌షెడ్‌జీ ప్రత్యేకత. 90 శాతం భారతీయులకు కరెంట్ అంటే తెలియని రోజుల్లో జలవిద్యుత్ గురించి ఆలోచించటం.. కంపెనీలు పెట్టి లాభసాటిగా విక్రయించటం వంటి అనేక విషయాలకు ఆ రోజుల్లోనే జెమ్‌షెడ్‌జీ తెరతీశారు) తొలిసారిగా..

1868లో టాటా ముంబాయి సమీపంలో ఉన్న చించ్‌పోకిలి అనే ప్రాంతంలో అలగ్జాండ్రియా అనే కాటన్ మిల్లును ప్రారంభించారు. రెండేళ ్లపాటు లాభాలతో నడిపిన తర్వాత ఆ కంపెనీని విక్రయించారు. ఆ తర్వాత విదేశాలలో ఉన్న అత్యాధునిక పరిజ్ఞానాన్ని తీసుకురావటానికి ఇంగ్లాండ్‌కు వెళ్లారు. మళ్లీ 1877లో మహారాణి విక్టోరియా పేరిట ఎంప్రస్ మిల్స్‌ను స్థాపించారు. ఆ సమయంలో మన దేశంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభ దశలో ఉంది. 'స్వదేశీ' అనే పదం భారతీయుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.

అందుకే 1877లో స్థాపించిన మరొక మిల్లుకు టాటా స్వదేశీ మిల్లు అని పేరుపెట్టారు. జెమ్‌షెడ్‌జీకి ఆ సమయంలో మన గొప్ప నాయకుల్లో ఒకరైన దాదాభాయ్ నౌరోజీ సన్నిహిత మిత్రుడు. దాదాభాయ్ ప్రభావం వల్లనే 1885లో ప్రారంభమైన భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశాల్లో జెమ్‌షెడ్‌జీ కూడా పాల్గొన్నారు. అయితే పార్టీ వ్యవస్థాపకుల్లో టాటా పేరు ఎక్కడా కనిపించదు. కానీ ఆయన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారని, జీవితాంతం పార్టీ సభ్యుడిగా కొనసాగారని అనడానికి ఆధారాలు ఉన్నాయి.

వారసత్వం మొదలు..
జెమ్‌షెడ్‌జీ టాటా చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు దోరబ్ -టాటా సన్స్‌కు ఛైర్మన్ అయ్యాడు. పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1910లో ' నైట్‌హుడ్' బిరుదును కూడా ప్రసాదించింది. మొదటి ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత ఆర్థిక మాంద్యం వంటి క్లిష్ట సమయాల్లో టాటా కంపెనీలను ఆయన సమర్థంగా నడిపించాడు.

దోరబ్ మరణానంతరం ఆయన సమీప బంధువు సర్ నౌరోజీ సక్‌లత్‌వాలా ఛైర్మన్ అయ్యాడు. ఆయన తర్వాత జేఆర్‌డీ టాటా కంపెనీ ఛైర్మన్‌గా 1938లో బాధ్యతలు స్వీకరించాడు. జేఆర్‌డీ టాటా తండ్రి ఆర్.డి. టాటా- ఈ గ్రూపును స్థాపించిన జెమ్‌షెడ్‌జీకి సమీప బంధువు. ఆర్.డి. టాటా కూడా టాటా సన్స్‌లో డైరక్టర్‌గా వ్యవహరించేవాడు. యూరప్‌లో టాటా గ్రూపు వ్యవహారాలను చూసేవాడు. అతని భార్య సుజాన్ బ్రిరీ ఫ్రెంచ్ దేశస్థురాలు. వీరిద్దరికి పుట్టిన జేఆర్‌డీ చిన్నతనం అంతా ఫ్రాన్స్‌లోనే గడిచింది.

1926లో ఆర్.డి. టాటా మరణించాడు. అతని స్థానాన్ని భర్తీ చేయటానికి జే.ఆర్.డీ.టాటా ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఎటువంటి వ్యాపారానుభవం లేని జేఆర్‌డీని టాటా గ్రూపు ఛైర్మన్‌గా చేయటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. జేఆర్‌డీ కూడా- కొద్దిసేపు మానసికంగా తప్పుదోవ పట్టడం వల్ల డైరక్టర్లు అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని వ్యాఖ్యానించాడు. కాని జేఆర్‌డీని ఛైర్మన్ చేయటం వెనక రెండు కారణాలు ఉండి ఉంటాయని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. మొదటిది- జేఆర్‌డీ టాటా కుటుంబానికి చెందినవాడు కావటం.

రెండోది- డైరక్టర్లు అతనిలోని శక్తియుక్తులను ముందే గ్రహించటం. జేఆర్‌డీ 53 ఏళ్ల పాటు టాటా సన్స్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. ఆయన ఆధ్వర్యంలో గ్రూపు గణనీయంగా ఎదిగింది. 1939లో టాటా సన్స్‌లో మొత్తం 13 కంపెనీలు ఉండేవి. ఈ కంపెనీలు 290 కోట్ల విక్రయాలు జరిపేవి. 1993నాటికి (జేఆర్‌డీ పదవిని త్యజించిన రెండేళ్ల తర్వాత) ఈ గ్రూపులో 50కి పైగా కంపెనీలు ఉన్నాయి. విక్రయాల విలువ పదిహేను వేల కోట్ల రూపాయలు ఉంది. ఈ లెక్కల ఆధారంగా చూస్తే- జేఆర్‌డీ ఎంత విజయవంతమయిన నాయకుడో అర్థమవుతుంది.

ఎన్నో సమస్యలు..
1991లో టాటాసన్స్ ఛైర్మన్‌గా జేఆర్‌డీ వైదొలగాడు. రతన్‌టాటా పదవిని చేపట్టాడు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1991 దాకా ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వమే నియంత్రిస్తూ ఉండేది. 1991లో ఆర్థిక సంస్కరణల తర్వాత అనేక మార్పులు రావటం మొదలుపెట్టాయి. ఇన్ఫోసిస్, విప్రో, ర్యాన్‌బాక్సీ వంటి కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించాయి.

వాటి వృద్ధి రేటు ఎక్కువగా ఉండేది. ఈ సమయంలో కొందరు టాటా గ్రూపు చరిత్రలో భాగమైపోయిందని కూడా భావించారు. టాటా గ్రూపును అందరూ నమ్ముతారు. ఆరా«ధిస్తారు. గౌరవిస్తారు. దేశాభివృద్ధిలో ఈ గ్రూపు పోషించిన పాత్రను అందరూ గుర్తుకుతెచ్చుకుంటూ ఉంటారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రూపు కూడా మారాల్సిన అవసరం లేదా? గత వైభవాన్ని తలుచుకుంటూ ఉండిపోవాల్సిందేనా? ఈ ప్రశ్నలతో పాటు- టాటా గ్రూపులో ఉన్న కొన్ని మౌలిక సమస్యలు తీవ్రమయ్యాయి.

1980ల నాటికి టాటా గ్రూపులో ఉన్న డైరక్టర్లు కంపెనీలపై తమ ఆధిపత్యాన్ని చలాయించటం మొదలుపెట్టారు. కంపెనీలో పనిచేసే సిబ్బంది వారికి మాత్రమే విశ్వాసపాత్రులుగా ఉండటం మొదలయింది. అనేక కంపెనీలు కాంట్రాక్టుల కోసం ఒక దానితో మరొకటి పోటీ పడటం మొదలయింది. "కొన్ని సామంత రాజ్యాలు ఉండేవి. అందరూ తమకు నచ్చిన దారిలో వెళ్లటం మొదలుపెట్టారు. ఒకే బిజినెస్‌లో ఉన్న కంపెనీలు ఒక దానితో మరొకటి పోటీ పడటం మొదలుపెట్టాయి.

ఎవరికి తోచిన విధంగా వారు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు..'' అని రతన్ టాటా ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. కంపెనీ బ్రాండ్ విషయంలో కూడా తీవ్రమైన అసందిగ్ధత ఉండేది. "మా కంపెనీ పదిహేను నుంచి ఇరవై భిన్నమైన బ్రాండులుగా ప్రజలలోకి వెళ్లేది..'' అని రతన్‌టాటా చేసిన వ్యాఖ ్యలు దీనికి నిదర్శనం. 1981లో, టాటా సన్స్ బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పుడు- రతన్‌టాటా గ్రూపు మొత్తానికి ఒక వ్యూహం ఉండాలని..

దీని కోసం ఒక ప్రత్యేకమైన ఫోరం ఉండాలని ప్రతిపాదించాడు. దీనిని వివిధ కంపెనీల డైరక్టర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. తమపై అధిపత్యం కోసమే ఇలాంటి ఫోరంను ఏర్పాటు చేస్తున్నారని కంపెనీ డైరక్టర్లు భావించారు. జేఆర్‌డీ నుంచి బాధ్యతలు తీసుకున్న తర్వాత రతన్‌టాటా గ్రూపులో ఉన్న కంపెనీలకు టాటా సన్స్‌కు మధ్య సమన్వయాన్ని పెంచే చర్యలు చేపట్టారు. రతన్‌టాటా బాధ్యతలు చేపట్టే సమయానికి టాటాసన్స్‌కు- గ్రూపులో ఉన్న వివిధ కంపెనీలలో ఉన్న వాటా గణనీయంగా తగ్గిపోయింది. ఒక దశలో స్టీలును తయారుచేసే కంపెనీ టిస్కోలో టాటా సన్స్ వాటా కన్నా బిర్లాల వాటా ఎక్కువగా ఉండేది.

అంతే కాకుండా టాటా కుటుంబానికి టాటాసన్స్‌లో ఉన్న వాటా కూడా 1.5 శాతానికి పడిపోయింది. టాటాసన్స్‌లో ప్రముఖ వాణిజ్యవేత్త పలోంజి మిస్త్రీీ వాటా 17.5 శాతం ఉండేది. "ప్రస్తుతం మాకు ఈ కంపెనీలను న డిపే నైతికమైన హక్కు ఉండొచ్చు. కానీ చట్టపరమైన హక్కు మాత్రం లేదు'' అని రతన్‌టాటా చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి అద్దం పడతాయి. రతన్‌టాటా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని కంపెనీలలోను టాటా సన్స్ వాటాను 26 శాతానికి పెంచటానికి చర్యలు తీసుకున్నాడు.

Thursday, August 12, 2010

పెట్స్ కోసం లండన్ టు ఢిల్లీ బైరోడ్

ఒక జీపు..
ఇద్దరు వ్యక్తులు..
15 దేశాలు..
51 రోజులు..
13,500 కిలోమీటర్లు..
లండన్ నుంచి న్యూఢిల్లీ వరకు..
అంతా రోడ్డు ప్రయాణమే.

పెంపుడు జంతువుల కోసం ఒక జంట జరిపిన అవగాహన యాత్ర ఇది. లండన్‌లో నివసిస్తున్న తుషార్, పూజ దంపతులు ఈ వినూత్న ప్రయాణం చేసి ఎన్నో అనుభవాలు మూటగట్టుకున్నారు. ఆ మహాయాత్రలోని కొన్ని మైలురాళ్లను ఇమెయిల్ ద్వారా ఇలా పంచుకున్నారు.

ప్లాన్ ఎ
లాంగ్ డ్రైవ్ అందరికీ ఒక కల. ఆ కలకు ఒక ప్రతిఫలం ఉండాలి. అది చరిత్రలో నిలిచిపోవాలి. అప్పుడే మనస్సుకు తృప్తి. పడ్డ కష్టానికి ప్రయోజనం. పెంపుడు జంతువుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఢిల్లీకి చెందిన ఫ్రెండికోస్ స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించటం మా యాత్ర ఉద్దేశ్యం. పదిహేను దేశాల మీదుగా ప్రయాణం అంటే అంత సులువు కాదు.

రూట్ మ్యాప్ సరిగ్గా ఉండాలి. వీసాలు, పర్మిట్లు, వెహికిల్, ఇన్సూరెన్స్, వసతి, వనరులు, ఆహారం.. ఇన్ని చూసుకోవాలి. ఆరునెలల పాటు ఇంటర్‌నెట్‌లో సర్చ్‌చేసి ఒక ప్లాన్ రూపొందించాం. వీసాలు, పర్మిట్లు, ఇన్సూరెన్స్‌లు, కార్నెట్లు, స్పాన్సర్లను రెడీ చేసుకోవడానికి తలప్రాణం తోకకొచ్చింది.

ప్లాన్ బి
మాకు అన్ని సదుపాయాలూ ఉండే ఒక వాహనం కావాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది దాని ధర. ఎందుకంటే ఫారిన్ వెహికిల్ ఇండియాలో తిరగాలంటే కార్నెట్ డి ప్యాసెజ్ డాక్యుమెంట్ ఉండాలి. అందుకోసం వాహనం ధరలో 15శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. చాలా వాహనాలు పరిశీలించిన తర్వాత చెరోకీ 2.5 లీటర్ స్పోర్ట్ జీప్‌ని ఎంపికచేశాం.

దానికి గూఫీ అని పేరు పెట్టాం. అది ఢిల్లీలోని మా కుక్క పేరు. ఆహారం, మందులు, ఎంపీ3 సీడీలు, జెర్రీ క్యాన్లు, పోర్టబుల్ కిచెన్, పోర్టబుల్ టాయ్‌లెట్, ల్యాప్‌ట్యాప్, డిజిటల్ కెమెరా, వీడియోక్యామ్, ఛార్జర్లు అన్నీ జీపులో ఎక్కించేందుకు 12 బ్యాగులు రెడీ చేసుకున్నాం.

డే1 : ఏప్రిల్ 17, 2010 ఉ. 7.15, మెహు యానిమల్ సెంటర్, లండన్
ఇండియన్ హై కమిషన్ ఫస్ట్ సెక్రటరీ జితేందర్‌కుమార్ జెండా ఊపి మా జర్నీని ప్రారంభించారు. డోవర్ మీదుగా ఫ్రాన్స్‌లోని డన్‌కిర్క్‌లో ల్యాండ్ అయ్యాం. ఆదిలోనే హంసపాదు అన్నట్లు జిపిఎస్ పనిచేయడం మానేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మేం తప్పుగా వెళ్తున్నట్లు అర్థమౌతోంది. అట్లస్ వెతుకుదామంటే అది వెనక ఏ బ్యాగ్‌లో ఉందో తెలియదు.

ఎలాగోలా బెల్జియం చేరుకున్నాం. యాంట్‌వర్ప్‌లో జంతువుల కోసం పనిచేస్తున్న ఆస్త సంస్థని కలిశాం. వారు మాకు రెండు బస్తాల జంతువుల ఆహారం ఇచ్చారు. మా జిపిఎస్ పనిచేయడం మొదలెట్టింది. నైస్ పీపుల్. ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ మీదుగా రాత్రి 11.30కి ఫ్రాంక్‌ఫర్ట్ చేరుకున్నాం. రాత్రి అక్కడే బసచే శాం.

డే 13 : ఏప్రిల్ 29, 2010
ఉక్రెయిన్‌లో ఉన్నాం. ఇది ఇంత పెద్ద దేశం అనుకోలే దు. ఇప్పటివరకు ఈ దేశంలో 1600 కిలోమీటర్లు ప్రయాణించాం. కీవ్ నుంచి ఖార్కివ్ వెళ్తున్నప్పుడు మధ్యలో లంచ్ కోసం ఆగాం. ఆ కేఫ్‌లో ఎవరూ ఇంగ్లిష్‌లో మాట్లాడడం లేదు. మెనూ కూడా రష్యన్ భాషలో ఉంది. రష్యన్ టు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ బుక్ చూసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. డిమిత్రో మా ఉక్రెయినీ ఫ్రెండ్.

రాత్రికి వాళ్లింటికి డిన్నర్‌కి తీసుకెళ్లాడు. డిమ్ మంచి యానిమల్ లవర్. ఉక్రెయినియన్లు కూడా జంతువులను చాలా ఇష్టపడతారని డిమ్ చెప్పాడు. మేం ఇప్పుడు ఉక్రెయిన్ - రష్యా బార్డర్ దాటుతున్నాం. ఉదయాన్నే ఓల్గోగ్రాడ్ చేరుకుంటాం. మాకు చాలాసంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ మా అమ్మనాన్నలుంటారు. రష్యా నుంచి కజఖస్తాన్ వరకు మాతో వస్తారు. ఓహ్ మళ్లీ ఇంటిభోజనం తినబోతున్నాం.

డే 28 : మే 14, 2010
ఉజ్బెకిస్తాన్ గుండా వెళ్తూ ఖివా, బుఖారా, సమర్కండ్ లాంటి చరిత్రాత్మక ప్రదేశాలు చాలా చూశాం. సమర్కండ్‌లో బాబర్ తాత అమీర్ తైమూర్ విగ్రహాలు చాలా ఉన్నాయి. ఢిల్లీని, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కొల్లగొట్టిన ఆయన ఉజ్బెకిస్తాన్‌లో మాత్రం హీరో. ఆయన ధైర్యసాహసాల గురించి కథలు కథలుగా చెబుతుంటారు.

బుఖారాలో మేం కేథరిన్‌ని కలిశాం. ఆమె అజర్‌బైజాన్ బ్రిటిష్ ఎంబసీలో పనిచేస్తోంది. ముంబాయి బ్రిటిష్ ఎంబసీలో పనిచేస్తున్నప్పుడు దత్తత తీసుకున్న 'స్పైక్' అనే పిల్లిని అజర్‌బైజాన్‌కు తెచ్చుకుంది. ఇక్కడ ఎవరైనా సారీ చెప్పేటప్పుడు కుడిచేయిని గుండెలపై పెట్టుకుని చెబుతారు.

ఉజ్బె కిస్తాన్ మర్యాదలు.. కజఖస్తాన్ ఒంటెపాలు
'లండన్ టు ఢిల్లీ భై రోడ్' కంటే ముందు విషయాలు చెప్పండి.
'లండన్ టు ఢిల్లీ బై రోడ్' కల ఎప్పటి నుంచో ఉంది. దీనికోసం మేం ఒక సంవత్సరం పాటు రీసెర్చ్ చేశాం. ముందు ప్లాన్ చేసుకున్నదానికి, బయలుదేరే ముందు ప్లాన్‌కి చాలా మార్పులు జరిగాయి.

ఫ్రెండికోస్ గురించి రెండు మాటలు?
పెంపుడు జంతువుల కోసం 1979 నుంచి పనిచేస్తున్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అది. ఈ జర్నీ ద్వారా మేం ఆరు వేల డాలర్ల ఫండ్స్ కలెక్ట్ చేశాం. దక్షిణ దేశాల వారితో పోల్చుకుంటే మన దేశంలో పెంపుడు జంతువుల పట్ల అంతగా అవేర్‌నెస్ లేదు.

రకరకాల దేశాల్లో రకరకాల మనుషుల్ని చూశారు కదా. మీకేం అనిపించింది? ఎన్నో ప్రతికూలతలున్నా చాలామంది ఎంత సంతోషంగా జీవిస్తున్నారో చూశాం. టిబెట్ లాంటి ప్రాంతంలో టాయ్‌లెట్స్‌లాంటి కనీస సదుపాయలు లేకపోయినా వారంతా ఎంతో ఆనందంగా బతుకుతున్నారు.

మీకు ఎప్పటికీ గుర్తుండి పోయే ఒక ఐదు విషయాలు చెప్పండి.
1. ఉజ్బెకిస్తాన్ వారి అతిథి మర్యాదలు మరువలేనివి.
2. టిబెట్‌లో 16,400 అడుగుల ఎత్తయిన కొండమీది నుంచి ప్రయాణిస్తున్నప్పుడు పూజకు ఊపిరాడలేదు. కిందికి వచ్చాక ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునే వరకు ఇబ్బంది పడింది. రాత్రి మూడు గంటలప్పుడు కారు ఆగిపోయింది. ఏం చేయాలో అర్థంకాలేదు. లక్కీగా వెంటనే స్టార్ట్ అయిందనుకోండి. కానీ అది ఓ భయంకరమైన రాత్రి.
3. కజఖస్తాన్‌లో గుర్రం, ఒంటె పాలు తాగడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
4. ప్రతిదేశంలోనూ పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఆపడం మాకు రొటీన్ అయిపోయింది. అఫ్‌కోర్స్ ఒకదశలో దాన్ని కూడా ఎంజాయ్ చేశామనుకోండి.
5. నేపాల్ ఇండియా బార్డర్‌లో 'వెల్‌కమ్ టు ఇండియా' అనే సైన్ బోర్డు చూసిన క్షణం.

డే 35 : మే 21, 2010
చైనాలో ఉన్నాం. ఇప్పటికి 8000 కిలోమీటర్లు ప్రయాణించాం. మ్యాప్ చూస్తూ "వుయ్ ఆర్ హియర్'' అని గర్వంగా ఫీలయ్యాం. కానీ అసలైన ఛాలెంజ్ అప్పుడే మొదలైంది. మీరు ఊహించగలరా? జీపులో అంత ఎత్తయిన పర్వతాన్ని ఎక్కడం! బయటి ఉష్ణోగత్ర 15 డిగ్రీలుంది. ప్రకృతి అందాలను చూస్తూ సరదాగా ఫొటోలు తీస్తూ వెళ్తున్నాం.

సడన్‌గా ఎవరో స్విచ్ఛాప్ చేసినట్లు ఉష్ణోగ్రత ఒక్కసారిగా సున్నా డిగ్రీలకు పడిపోయింది. సూర్యుడి స్థానంలో నల్లని మేఘాలొచ్చాయి. మంచు కురవడం మొదలైంది. రోడ్డు కనిపించడం లేదు. జారే బురదలో జీపు నడపడం కష్టంగా ఉంది. ఇప్పుడు మేం 10,500 అడుగుల ఎత్తయిన కొండపైన ఉన్నాం. ఓష్ నుంచి సారిటాష్‌కు వెళ్తున్నాం. సాహసం చేస్తున్నట్లుగా ఉంది.

డే 45 : మే 31, 2010
నేను పూజని. నిన్ననే నేపాల్ చేరుకున్నాం. మొన్న సగాలో చైనీస్ టీవీలో చూశాను. ఒక డాక్టర్ పాములతో మసాజ్ చేస్తారట. అది వింటేనే ఒళ్లు జలదరిస్తుంటే ఇక స్నేక్ వైన్ గురించి? పెద్ద వైన్ బ్యారెల్‌లో రెండు మూడు పాముల్ని వేస్తారట.

40 రోజుల తర్వాత తీస్తే స్నేక్ వైన్ రెడీ. మరి పాములు బతికుంటాయో లేదో తెలియదు. సరే.. ఆ విషయం వద్దుగానీ మేం చైనా బార్డర్ దాటుతున్నప్పుడు ఆర్మీవాళ్లు మా కెమెరాలోని ప్రతి ఫొటోని చూశారు. మా ప్రతి బ్యాగ్‌ని చెక్‌చేశారు. త్వరలో మేం ఢిల్లీ చేరుకోబోతున్నాం. ప్రతి రోజూ (బ్లాగ్) మమ్మల్ని ఫాలో అవుతూ ప్రోత్సహిస్తున్నందుకు మీకందరికీ థ్యాంక్స్.

డే 51 : జూన్ 6, 2010
మళ్లీ నేనే పూజను. యస్... మేం సాధించాం. మా కల నెరవేరింది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని కుతుబ్‌మినార్ దగ్గరికి చేరుకున్నాం. 15 వందల లీటర్ల పెట్రోలు, 9 టైమ్‌జోన్లు, లెక్కలేనన్ని అనుభవాల తర్వాత 51వ రోజు ఇక్కడున్నాం. ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదు. మీడియా వాళ్లు చుట్టుముట్టారు.

కెమెరా ఫ్లాష్‌లైట్లు టకటకా వెలుగుతున్నాయి. నాకైతే తుషార్‌ని మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఉంది. ఫ్రెండికోస్ కోఫౌండర్ గౌతమ్ భరత్ మాతో ఉన్నాడు. ఈ జర్నీ ఇంతటితో అయిపోలేదు. మా అనుభవాలన్నీ పుస్తకంగా రాయబోతున్నాం. 

-బీరెడ్డి నగేష్ రెడ్డి

Sunday, August 8, 2010

ఆ ఆలోచన.. నాన్న ప్రోత్సాహమే... నన్ను ఐఏఎస్‌ను చేసింది - డాక్టర్‌ ఐవీ సుబ్బారావు

I.V.-Subba-Rao3రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రెండు ఉప ఎన్నికలతో పాటు, 2009 సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి సక్సెస్‌ ఫుల్‌ సీఈఓగా అందరి మన్ననలు పొందిన డాక్టర్‌ ఐవీ సుబ్బారావు పూర్తి పేరు ఇలపావులూరి వేంకట సుబ్బారావు. పుట్టిన ఊరు బాపట్ల (గుంటూరు జిల్లా). తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉండడంతో అక్కడే ఉన్నతాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్‌ (ఇంగ్లీష్‌), ఎంఏ (ఇంగ్లీష్‌), బి.ఇడి చదివారు. అనంతరం జేఎన్‌యూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలన్న అభి లాషతో సివిల్స్‌ రాయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆయన ఆలోచనకు తండ్రి ప్రోత్సాహం లభించడంతో 1979లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. పదిహేడేళ్లపాటు ఐఏఎస్‌ అధికారి గా పనిచేశాక దీర్ఘకాలిక సెలవుపై అమెరికా వెళ్లి అక్కడ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో పిహెచ్‌డీ పూర్తి చేశా రు. అమెరికాలో పిహెచ్‌డీ అడ్మిషన్‌ కోసం జీఆర్‌ఇ, టోఫెల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడమేగాక, ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన పిహెచ్‌డీ డిగ్రీని కేవలం 2 సంవత్సరాల మూడు నెలల్లోనే పూర్తిచేసి ఘనత సాధించారు. డాక్టరేట్‌ పట్టా సాధించి తిరిగొచ్చాక ప్రభుత్వం ఆయనను టీటీడీ ఈవో గా నియమించింది.

I.V.-Subba-Rao1 అంతకుముందే పలు కేంద్ర, రాష్ట్ర విభాగాలలో కీల క బాధ్యతలు నిర్వహించిన డాక్టర్‌ ఐవీ ఈఓగా చేసిన తర్వాత పాఠశాల విద్య, హెల్త్‌, రెవెన్యూ విభాగాలలో ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2008 మార్చి 31 నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత కొద్ది కాలంలోనే ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. అర్హులైన వారందరికీ ఫోటో ఓటరు గుర్తింపు కార్డులుండేలా సంస్కరణలు చేపట్టారు. 18 ఏళ్లు దాటిన యువతీ యువకులు అందరికీ ఓటు హక్కు కల్పించేందుకు విశేషంగా కృషి చేశారు. ఇందుకోసం పోస్టాఫీసులు, విశ్వవిద్యాలయాలు, కాలేజీలు తది తర సంస్థలు పాలుపంచుకునేలా చేశారు. ఓటర్ల నమోదు కోసం ‘యువతరంగ్‌’ వంటి పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం అర్హులైన పౌరు లందరి పేర్లూ ఓటర్ల జాబితా లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వారందరికీ ఓటరు గుర్తింపు కార్డు లు అందేలా చర్యలు చేపట్టారు.

ప్రతి ఎన్నికల కు ముందు ఓటర్ల జాబి తాను అన్ని రాజకీయ పక్షాలతో సమీక్షించి అప్‌డేట్‌ చేయడం వంటి కీలకమైన కార్యక్రమాలను సమర్ధ వం తంగా నిర్వహించారు. అంతేగాక అత్యంత పారద ర్శకంగా ఎన్నికలను నిర్వ హించడంలో ఐవీ సుబ్బా రావు తనదైన శైలిని ప్రద ర్శించారు. 2008 మేలో జరిగిన ఉప ఎన్నికలు, 2009 సాధారణ ఎన్ని కలను విజయవంతంగా నిర్వహించారు. తాజాగా తెలంగాణాలోని 12 నియోజకవర్గాలలో జరిగి న ఎన్నికలను ప్రశాంతం గా, అత్యంత పారదర్శకం గా, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా నిర్వహించి తనదైన పరిపాలనా ముద్రను నిరూపించుకున్నా రు. ప్రతి ఎన్నికల్లోనూ ఎన్నికల కోడ్‌ని తు.చ. తప్పకుండా పాటించేలా చర్యలు చేపట్టారు. నియమావళి ఉల్లం‘ఘను’లెవరైనా చర్యలు ఒకే విధంగా ఉంటాయని నిరూపించారు. తాజా ఎన్నికలలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల విశ్వసనీయతను కొందరు అనుమానించినా వాటి లో వాస్తవం లేదని నిరూపించిన ఘనత ఐవీకే దక్కుతుంది. ఈ నేప థ్యంలో డాక్టర్‌ ఐవీ సుబ్బారావు ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన అంశాలు.. అనుభూతులు.. ‘సూర్య ప్రతినిధి’తో ఇలా పంచుకున్నారు.

జీవితంలో తొలి టర్నింగ్‌ పాయింట్‌...
I.V.-Subba-Rao ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు)లో అసిస్టెం ట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నపుడు ప్రజలకు సేవ చేయాలన్న అభిలాష కలిగింది. దాంతో సివిల్‌ సర్వీసెస్‌ రాయలన్న ఆలోచన వచ్చింది. అందుకు నాన్నగారు డాక్టర్‌ ఐవీ పాండురంగారావు పూర్తిస్థాయిలో ప్రోత్సాహమందించారు. ఆయన సంపూర్ణ సహాయ, సహకారాలతో ప్రిపేరయ్యాను 1979లో ఐఏఎస్‌కు ఎంపికయ్యాను. ఇది నా జీవితం లో తొలి టర్నింగ్‌ పాయింట్‌.

నచ్చిన చోటే అవకాశం మరో మలుపే...
1992లో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖామంత్రి చింతామోహన్‌ తనవద్ద ప్రైవేట్‌ కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే అనుకో కుండా మంత్రివర్గం నుంచి ఆయనను తప్పించారు. అప్పుడు ఏ విభా గంలోకెళ్లాలో తెలియని తరుణంలో ఎడ్యుకేషన్‌ సెక్రెటరీ నన్ను పిలిచి, నా విద్యార్హతలను బట్టి నన్ను విద్యా విభాగంలో పనిచేయమన్నారు. నాకు నచ్చిన విభాగంలో అవకాశం రావడం గొప్పగా అనిపించింది.

ప్రొఫెసర్‌ దవేతో గొప్ప అనుభవం...
ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌ దవే ఛైర్మన్‌గా విద్యావిధానానికి సంబం ధించి కేంద్రం నియమించిన నేషనల్‌ కమిటీలో సభ్యుడిగా పనిచేశా ను. నాలుగేళ్లపాటు ప్రొఫెసర్‌ దవేతో కలిసి పనిచేసిన రోజులు ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం.

అమెరికాలో పిహెచ్‌డి...
దాదాపు 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత స్టడీ లీవు తీసుకుని జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది అమెరికాలోని పెన్సిల్వే నియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్‌ విభాగంలో పిహెచ్‌డి అడ్మిషన్‌ పొంది రెండున్నరేళ్ల లోపే పిహెచ్‌డి పూర్తిచేసి డాక్టరేటు పొందాను.

టీటీడీలో సంస్కరణలు...
అమెరికాలో పిహెచ్‌డి పూర్తి చేసి ఇండియాకు రాగానే తిరుమల తిరు పతి దేవస్థానంలో ఈఓగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఏడాదిన్నరపాటు అక్కడ పనిచేశాను. దైవ దర్శనానికి భక్తులు పడే ఇక్కట్లను గమనించాను. వారి ఇబ్బందులను తగ్గించేందుకు గాను ‘సుదర్శనం’ పద్ధతిని ప్రవేశపెట్టాం. కంప్యూటర్‌ ద్వారా భక్తులకు టోకెన్‌లను ఇచ్చి.. వారు గంటల తరబడి క్యూ లైన్లలో నిల బడకుండా వారికి కేటాయించిన సమయంలో వస్తే దైవదర్శనం లభించేలా చర్యలు తీసుకున్నాం. అమెరికా నుంచి రాగానే టీటీడీ ఈఓగా పనిచేసే అవకాశం రావడం ఆ శ్రీవేంకటేశ్వరుడే తనకు కల్పించిన అద్భుత అవకాశంగా భావిస్తాను.

చెన్నారెడ్డి హయాంలో...
మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయనకు సం యుక్త కార్యదర్శిగా పనిచేశాను. రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకుని ప్రాం తాలు, ప్రజల అభివృద్ధి కోసమని అప్పట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమానికి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాను. ఈ కాలం లో అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమూల, గిరిజన ప్రాంతాలను అభివృద్ది చేయడంలో నా శాయాశక్తులా కృషిచేశాను.

ఈసీ ధ్యేయమదే...
- ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఎన్నికల ను ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడడమేగాక ప్రజలకు సులభతరమైన విధానాలను అందుబాటులోకి తీసుకువ చ్చేందుకు ఎన్నికల సంఘం ఎప్పుడూ కృషి చేస్తుంది.

- ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లంతా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, ప్రభావాలకు లొంగకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నదే ఈసీ ధ్యేయం.
- డాక్టర్‌ ఐవీ సుబ్బారావు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా డాక్టర్‌ ఐవీ చేపట్టిన సంస్కరణలు... తీసుకున్న చర్యలు...
I.V.-Subba-Rao2-ఈవీఎంలపై అవగాహనకు రాష్టవ్య్రాప్తంగా గ్రామగ్రామాన విస్తృత ప్రచారం.

-మారుమూల పల్లెలు, గ్రామాలలోనూ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు.

-ఈ సేవా కేంద్రాల ద్వారా ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దు కునే అవకాశం.

-ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలయ్యేలా చర్యలు.

-రాజకీయ పార్టీల అడ్డగోలు ప్రచారానికి, ప్రసంగాలకు చెక్‌.

-సమస్యాత్మక ప్రాంతాలనుగుర్తించి ముందస్తు చర్యల చేపట్టడం ద్వారా ఎన్నికల ప్రశాంత నిర్వహణ.

-వృద్ధులు, మహిళలు, వికలాంగులకు పోలింగ్‌ కేంద్రంలో గంటల తరబడి నిలబడే ఇబ్బంది లేకుండా నేరుగా లోపలికి వెళ్లి ఓటేసే అవకాశం.

-అంధులు సైతం స్వతంత్రంగా ఓటేసేలా బ్రెయిలీ లిపితో కూడిన ఈవీఎంలను ఏర్పాటు చేయించిన ఘనత ఐవీకే దక్కుతుంది.

-ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసే మద్యం, నల్లధనం పంపిణీని కట్టడి.

- అక్రమ మద్యం దుకాణాల భరతం పట్టారు.

-ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారినెవరినీ వదిలిపెట్టలేదు.

-రాజకీయ నాయకులతోపాటు నియమాలను ఉల్లంఘిస్తే రాష్ట్ర డిజిపిని సైతం ఉపేక్షించలేదు.

-తాజా ఉప ఎన్నికల్లో మోడల్‌ కోడ్‌ను ఉల్లంఘించినందుకు పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో సహా టీఆర్‌ఎస్‌ నేత కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీలపై చర్యలు చేపట్టిన ఐవీ గత సాధారణ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌కు సైతం ఈసీ తరపున నోటీసులందించారు.
ప్రొఫైల్‌
అందరికీ తెలిసిన పేరు : డాక్టర్‌ ఐవీ సుబ్బారావు

పూర్తిపేరు : డాక్టర్‌ ఇలపావులూరి వెంకట సుబ్బారావు

పుట్టిన రోజు : ఆగస్టు 12, 1955

పుట్టింది : బాపట్ల, గుంటూరు జిల్లా

విద్యార్హతలు : బీఏ ఆనర్స్‌ (ఇంగ్లీష్‌), ఎంఏ (ఇంగ్లీష్‌), బిఇడి, ఢిల్లీ యూనివర్సిటీ పిహెచ్‌డి (ఎడ్యుకేషన్‌), యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, అమెరికా

తండ్రి : డాక్టర్‌ ఇలపావులూరి పాండురంగారావు (ఎంఏ, హిందీలో గోల్డ్‌ మెడలిస్టు,1955లో నాగ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి చేసి హిందీ విభాగంలో డాక్టరేటు అందుకున్న తొలి ఆంధ్రుడుగా చరిత్రకెక్కారు), యూపీఎస్‌సిలో భాషా విభాగ డైరెక్టర్‌గా, భారతీయ జ్ఞానపీఠ్‌ అవార్డ్‌‌స డైరెక్టర్‌గా పనిచేశారు.
తల్లి : రాధాదేవి
భార్య : రేఖారావు
సంతానం : సమీరజ్‌ (కొడుకు), మానస (కుమార్తె)
తమ్ముడు : రఘు
చెల్లెల్లు : వాంగ్మయి, అనూప, సువర్ణ

ఐఏఎస్‌ కంటే ముందు...
జె.ఎన్‌.యూ(ఢిల్లీ)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(ఇంగ్లీష్‌)గా పనిచేశారు.
ఐఏఎస్‌ బ్యాచ్‌ : 1979

శిక్షణ : మస్సోరిలో అకాడమీ ట్రైనింగ్‌, కరీంనగర్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా శిక్షణ (1979-81)

తొలి పోస్టింగ్‌: వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా (1981-83)

కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌: అనంతపురం జిల్లా (1986-87)

ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా: పాఠశాల విద్య (2000-2004), ఆరోగ్య శాఖ (2004-06), రెవెన్యూ విభాగం (2006-08)

ప్రస్తుతం: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (మార్చి 31,2008 నుంచి)

- ఉదయ్‌,

Tuesday, July 27, 2010

ఇందిరకు ప్రసంగించే అర్హత ఉందా?

మన దేశంలో జనాభా గణనకు ఆద్యుడు ఆశిష్‌బోస్. కేంద్రంలో అనేక అత్యున్నత స్థానాలను, పదవులను అధిష్ఠించిన బోస్- తన అనుభవాలను 'హెడ్‌కౌంట్- మెమరీస్ ఆఫ్ ఏ డెమోగ్రాఫర్' పేరిట పుస్తకంగా వెలువరించారు. పెంగ్విన్ సంస్థ ముద్రించిన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం.

"మా మేనమామ అనీల్ కుమార్ చందా 1952లో కాంగ్రెస్ టిక్కెట్ మీద ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆయనను నెహ్రూ ఉప విదేశాంగ మంత్రిగా నియమించారు. ఎన్నికల్లో గెలవక ముందు మామయ్య (చందా) రవీంద్రనాథ్ టాగూర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగాను, శాంతి నికేతన్‌లోని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గాను వ్యవహరించేవారు.

మా మేనత్త రాణి చందా కూడా ప్రముఖ చిత్రకారిణి. మామయ్య ఢిల్లీకి మకాం మార్చిన తర్వాత నెహ్రూ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. అప్పుడు నేను మామయ్య బంగ్లాకు తరుచూ వెళ్తూ ఉండేవాడిని. ఆ సమయంలో నెహ్రూకు సంబంధించిన అనేక వ్యక్తిగత విషయాలు మామయ్య నాకు చెబుతూ ఉండేవారు..

ఒక రోజు రాత్రి భోజనం అయిన తర్వాత నెహ్రూకు బోర్ కొట్టింది. అనీల్ చందాను ఏవైనా సర్దార్‌జీ జోకులు ఉంటే చెప్పమని అడిగారు. నెహ్రూ అలా వెళ్లగా చూసి- చందా నాకు- 'ఏవైనా సర్దార్‌జీ జోకులు ఉంటే చెప్పు' అని ఫోన్ చేశారు.

"కారు పంపుతున్నా. వెంటనే నా దగ్గరకు వచ్చేయ్..'' అని పిలిచారు. నాకు కూడా సర్దార్‌జీ జోకులు తెలియవు. వెంటనే ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న మిగిలిన స్నేహితులందరిని సర్దార్‌జీ జోకులు చెప్పమని అడిగాను. కొన్నింటిని పోగు చేసి మామయ్యకు అందించాను. మామయ్య నెహ్రూ దగ్గరకు వెళ్లి ఆ జోకులు చెప్పారు. అందులో ఒక జోకుకు మాత్రం నెహ్రూ పడిపడి నవ్వారట.. ఆ జోక్ ఏమిటంటే- లేడీ మౌంట్‌బాటెన్, లార్డ్ మౌంట్‌బాటెన్‌లు వైస్రాయ్ బంగ్లాలో ఒకసారి పార్టీ ఇచ్చారు.

దానికి దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ వచ్చారు. అందరూ తనివితీరా తాగుతున్నారు. కొందరు డ్యాన్స్ కూడా చేస్తున్నారు. పార్టీ సాగుతూనే ఉంది. అర్థరాత్రి అయిపోయింది. బయట పెద్దవాన పడుతోంది. అప్పటి రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్ చాలా అన్యమనస్కంగా కనిపిస్తుంటే- మౌంట్‌బాటెన్ వచ్చి ఏమయిందని అడిగాడు. "పెద్ద వాన పడుతోంది.

నేను ఎలా వెడతాను? మధ్యలో కారు ఆగిపోతే ఏం చేయాలి?'' అన్నాడు బల్దేవ్ సింగ్. ఈ మాటలు విన్న లేడి మౌంట్‌బాటెన్- " మీరు ఆందోళనపడద్దు. ఈ భవంతిలో బోల్డు గదులు ఉన్నాయి. మీరు ఇక్కడే గెస్ట్‌రూమ్‌లో పడుకోవచ్చు..'' అని భరోసా ఇచ్చారు. కొద్దిసేపు తర్వాత చూస్తే బల్దేవ్ సింగ్ ఎక్కడా కనబడలేదు. కనీసం గుడ్‌నైట్ కూడా చెప్పకుండా బల్దేవ్ సింగ్ ఎక్కడికి వెళ్లిపోయాడా అని మౌంట్‌బాటెన్ దంపతులు ఆశ్చర్యపోయారు.

తర్వాత కొద్దిసేపటికి బల్దేవ్ సింగ్ హఠాత్తుగా మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. "ఎక్కడికి వెళ్లారు?'' అని లేడి మౌంట్‌బాటెన్ బల్దేవ్ సింగ్‌ను అడిగారు. "మేడమ్.. మీరు నన్ను మీ గెస్ట్‌రూమ్‌లో పడుకోమన్నారు. అందుకే ఇంటికి వెళ్లి నా నైట్ డ్రెస్ తెచ్చుకుని వచ్చా'' అన్నాడు బల్దేవ్ సింగ్. (ఒకప్పుడు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా ఢిల్లీ యూనివర్సిటీలో భాగంగా ఉండేది.

ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ యూనియన్ నేతగా ఆశిష్‌బోస్ ఉండేవారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఉన్న గ్వాయర్ హాల్‌లో మేధావులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉండేవారు. అయితే గ్వాయర్ హాల్ పురుషుల అధీనంలో ఉండేది. మహిళలకు ప్రవేశం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో- విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటానికి ఇందిరా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆమెకు ఒక ఉత్తరం కూడా రాశారు. ఆ తర్వాత) ".. ఒక రోజు మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో - చౌకీదార్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. "మీకు ప్రధానమంత్రి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది..'' అని రొప్పుకుంటూ చెప్పాడు. నేను ఆశ్చర్యపోయా. ఎవరైనా ట్రిక్ ప్లే చేస్తున్నారేమో అనుకున్నా. "నేను బిజీగా ఉన్నానని చెప్పు..'' అని చౌకీదారును పంపేశా. వెళ్లిన వాడు వెళ్లినట్లే వెళ్లి మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చాడు.

"నిజంగానే ప్రధానమంత్రి ఇంటి నుంచి ఫోను వచ్చింది. మీ కోసం ఫోన్‌లో వెయిట్ చేస్తున్నారు..'' అన్నాడు. నేను కూడా వెంటనే పరిగెత్తుకుంటూ ఫోన్ దగ్గరకు వెళ్లా. ఫోన్ చేసింది ప్రధాని నెహ్రూ కాదు. ఆయన కూతురు ఇందిరా గాంధీ. "మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించమన్నందుకు కృతజ్ఞతలు. కాని ఢిల్లీ యూనివర్సిటీ స్కాలర్స్‌ను ఉద్దేశించి నేను ఎలా ప్రసంగించగలను? కృష్ణ మీనన్ వంటి మేధావులు మాట్లాడిన చోట నేను మాట్లాడటం అంత సబబుగా ఉంటుందా? నా ప్రసంగానికి అందరూ ఒప్పుకోకపోవచ్చు కదా? '' అంటూ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

"మీరు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు. మీరు వస్తే చాలు. ఎక్కువ సేపు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు..'' అని నేను హామీ ఇచ్చేసాను. ఇందిరాగాంధీ వచ్చి ప్రసంగించటానికి ఒప్పుకున్నట్లు ఆ మర్నాడు వైస్‌ఛాన్సలర్‌కి తెలిసింది. ఆయన ఆందోళనపడటం మొదలుపెట్టాడు.

నన్ను ఆఫీసు రూమ్‌కి పిలిచాడు. "అసలు నువ్వు ఏం చేస్తున్నావో తెలుస్తోందా? రేపు నాకు తెలియకుండా ప్రధానిని కూడా యూనివర్సిటీకి పిలిచేసేట్లు ఉన్నావు? నేను రాకుండా ఆ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది? నేను రాకపోతే ఇందిరాగాంధీ ఏమనుకుంటుంది? ఏదైనా సమస్య ఏర్పడితే ప్రధాన మంత్రి నన్ను తిడతారు'' అని నన్ను గట్టిగా మందలించాడు.

ఇదిలా ఉండగా విద్యార్థుల వైపు నుంచి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వైస్‌ఛాన్సలర్ మందలించిన మర్నాడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా ఒక సహవిద్యార్థి నా దగ్గరకు వచ్చాడు. "గ్వాయర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించే స్థాయిలో ఇందిరాగాంధీ ఉందా? అసలు ఆమె ఏం చదువుకుంది? ఇందిరకు మనను ఉద్దేశించి ప్రసంగించే అర్హత ఉందా? ప్రధానమంత్రి కుమార్తె కాబట్టి నువ్వు ఆమెను ప్రసంగించటానికి పిలిచావు'' అని గట్టిగా వాదించటం మొదలుపెట్టాడు.

"అవును. అందుకే పిలిచాను. అంతే కాదు. ఆమె అందంగా ఉంటుంది. తెలివైనది కూడా. అందుకోసం కూడా పిలిచాను..'' అని గట్టిగా సమాధానం చెప్పాను. ఇంతలో మరికొందరు విద్యార్థులు ఇందిరకు షేక్‌హ్యాండ్ ఇవ్వొచ్చా? అని అడగటం మొదలుపెట్టారు. "నమస్తే పెట్టండి చాలు. షేక్‌హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు'' అని వాళ్లకు నచ్చచెప్పాల్సి వచ్చింది.

"తర్వాత... ఇందిరాగాంధీ వచ్చింది. అనుకున్న సమయానికి సభ ప్రారంభమయింది. ఇందిరను ఆహ్వానిస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభించా. ప్రసంగం చివర- "నాకు మిమ్మల్ని డిన్నర్‌కి కూడా ఆహ్వానించాలని ఉంది. కాని గ్వాయర్ హాల్‌లో ఒక చిత్రమైన సంప్రదాయం ఉంది. మహిళలను డైనింగ్ రూమ్‌లోకి అనుమతించరు. అందువల్ల మిమ్మల్ని డిన్నర్‌కు ఆహ్వానించలేకపోతున్నా..'' అన్నా. మా వైస్‌ఛాన్సలర్ మొహం పాలిపోయింది. ఆయన మైకు తీసుకున్నాడు.

"గ్వాయర్ హాల్‌లోకి మహిళలను అనుమతిస్తారు కాని ఈ హాల్‌ను నిర్మించిన సర్ మెరైస్ స్మృత్యర్థం.. ఆక్స్‌ఫర్డ్ సంపద్రాయాలను అనుసరించి- డైనింగ్ హాల్‌లోకి మాత్రం మహిళలకు ప్రవేశం లేదు. ఆ ఒక్క నిబంధనను మాత్రమే మేము పాటిస్తాము'' అన్నాడు. ఆ వెంటనే ఇందిరాగాంధీ ప్రసంగం ప్రారంభమయింది. గ్వాయర్ హాల్ సంప్రదాయాల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. " మహిళలను చిన్నచూపు చూసే ఇలాంటి నిబంధనలను మనం తుంగలో తొక్కాలి..'' అని పిలుపునిచ్చారు. గ్వాయర్ హాలు డైనింగ్ రూమ్‌లోకి రాకుండానే వెళ్లిపోయారు.

ఆ తర్వాత కొద్ది కాలానికి గ్వాయర్ హాల్‌కు భారత్‌లో స్వీడిష్ అంబాసిడర్‌గా ఉన్న ఆల్వా మిర్దాల్‌ను (ఆమెకు 1982లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది) డిన్నర్‌కు ఆహ్వానించి- సంప్రదాయానికి తుదివీడ్కోలు ఇచ్చారు. ఆల్వా మిర్దాల్‌కు ఇలాంటి సంప్రదాయాన్ని బద్దలు కొట్టడం అది రెండో సారి. అంతకు ముందు అమెరికాలోని ప్రిన్‌స్టన్ విశ్వవిద్యాలయంలో ఉన్న ఈ తరహా నిబంధనను కూడా ఆమే బద్దలు కొట్టింది.