మన దేశంలో జనాభా గణనకు ఆద్యుడు ఆశిష్‌బోస్. కేంద్రంలో అనేక అత్యున్నత స్థానాలను, పదవులను అధిష్ఠించిన బోస్- తన అనుభవాలను 'హెడ్‌కౌంట్- మెమరీస్ ఆఫ్ ఏ డెమోగ్రాఫర్' పేరిట పుస్తకంగా వెలువరించారు. పెంగ్విన్ సంస్థ ముద్రించిన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం.
"మా మేనమామ అనీల్ కుమార్ చందా 1952లో కాంగ్రెస్ టిక్కెట్ మీద ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆయనను నెహ్రూ ఉప విదేశాంగ మంత్రిగా నియమించారు. ఎన్నికల్లో గెలవక ముందు మామయ్య (చందా) రవీంద్రనాథ్ టాగూర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగాను, శాంతి నికేతన్‌లోని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గాను వ్యవహరించేవారు.
మా మేనత్త రాణి చందా కూడా ప్రముఖ చిత్రకారిణి. మామయ్య ఢిల్లీకి మకాం మార్చిన తర్వాత నెహ్రూ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. అప్పుడు నేను మామయ్య బంగ్లాకు తరుచూ వెళ్తూ ఉండేవాడిని. ఆ సమయంలో నెహ్రూకు సంబంధించిన అనేక వ్యక్తిగత విషయాలు మామయ్య నాకు చెబుతూ ఉండేవారు..
ఒక రోజు రాత్రి భోజనం అయిన తర్వాత నెహ్రూకు బోర్ కొట్టింది. అనీల్ చందాను ఏవైనా సర్దార్‌జీ జోకులు ఉంటే చెప్పమని అడిగారు. నెహ్రూ అలా వెళ్లగా చూసి- చందా నాకు- 'ఏవైనా సర్దార్‌జీ జోకులు ఉంటే చెప్పు' అని ఫోన్ చేశారు.
"కారు పంపుతున్నా. వెంటనే నా దగ్గరకు వచ్చేయ్..'' అని పిలిచారు. నాకు కూడా సర్దార్‌జీ జోకులు తెలియవు. వెంటనే ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న మిగిలిన స్నేహితులందరిని సర్దార్‌జీ జోకులు చెప్పమని అడిగాను. కొన్నింటిని పోగు చేసి మామయ్యకు అందించాను. మామయ్య నెహ్రూ దగ్గరకు వెళ్లి ఆ జోకులు చెప్పారు. అందులో ఒక జోకుకు మాత్రం నెహ్రూ పడిపడి నవ్వారట.. ఆ జోక్ ఏమిటంటే- లేడీ మౌంట్‌బాటెన్, లార్డ్ మౌంట్‌బాటెన్‌లు వైస్రాయ్ బంగ్లాలో ఒకసారి పార్టీ ఇచ్చారు.
దానికి దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ వచ్చారు. అందరూ తనివితీరా తాగుతున్నారు. కొందరు డ్యాన్స్ కూడా చేస్తున్నారు. పార్టీ సాగుతూనే ఉంది. అర్థరాత్రి అయిపోయింది. బయట పెద్దవాన పడుతోంది. అప్పటి రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్ చాలా అన్యమనస్కంగా కనిపిస్తుంటే- మౌంట్‌బాటెన్ వచ్చి ఏమయిందని అడిగాడు. "పెద్ద వాన పడుతోంది.
నేను ఎలా వెడతాను? మధ్యలో కారు ఆగిపోతే ఏం చేయాలి?'' అన్నాడు బల్దేవ్ సింగ్. ఈ మాటలు విన్న లేడి మౌంట్‌బాటెన్- " మీరు ఆందోళనపడద్దు. ఈ భవంతిలో బోల్డు గదులు ఉన్నాయి. మీరు ఇక్కడే గెస్ట్‌రూమ్‌లో పడుకోవచ్చు..'' అని భరోసా ఇచ్చారు. కొద్దిసేపు తర్వాత చూస్తే బల్దేవ్ సింగ్ ఎక్కడా కనబడలేదు. కనీసం గుడ్‌నైట్ కూడా చెప్పకుండా బల్దేవ్ సింగ్ ఎక్కడికి వెళ్లిపోయాడా అని మౌంట్‌బాటెన్ దంపతులు ఆశ్చర్యపోయారు.
తర్వాత కొద్దిసేపటికి బల్దేవ్ సింగ్ హఠాత్తుగా మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. "ఎక్కడికి వెళ్లారు?'' అని లేడి మౌంట్‌బాటెన్ బల్దేవ్ సింగ్‌ను అడిగారు. "మేడమ్.. మీరు నన్ను మీ గెస్ట్‌రూమ్‌లో పడుకోమన్నారు. అందుకే ఇంటికి వెళ్లి నా నైట్ డ్రెస్ తెచ్చుకుని వచ్చా'' అన్నాడు బల్దేవ్ సింగ్. (ఒకప్పుడు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా ఢిల్లీ యూనివర్సిటీలో భాగంగా ఉండేది.
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ యూనియన్ నేతగా ఆశిష్‌బోస్ ఉండేవారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఉన్న గ్వాయర్ హాల్‌లో మేధావులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉండేవారు. అయితే గ్వాయర్ హాల్ పురుషుల అధీనంలో ఉండేది. మహిళలకు ప్రవేశం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో- విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటానికి ఇందిరా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆమెకు ఒక ఉత్తరం కూడా రాశారు. ఆ తర్వాత) ".. ఒక రోజు మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో - చౌకీదార్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. "మీకు ప్రధానమంత్రి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది..'' అని రొప్పుకుంటూ చెప్పాడు. నేను ఆశ్చర్యపోయా. ఎవరైనా ట్రిక్ ప్లే చేస్తున్నారేమో అనుకున్నా. "నేను బిజీగా ఉన్నానని చెప్పు..'' అని చౌకీదారును పంపేశా. వెళ్లిన వాడు వెళ్లినట్లే వెళ్లి మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చాడు.
"నిజంగానే ప్రధానమంత్రి ఇంటి నుంచి ఫోను వచ్చింది. మీ కోసం ఫోన్‌లో వెయిట్ చేస్తున్నారు..'' అన్నాడు. నేను కూడా వెంటనే పరిగెత్తుకుంటూ ఫోన్ దగ్గరకు వెళ్లా. ఫోన్ చేసింది ప్రధాని నెహ్రూ కాదు. ఆయన కూతురు ఇందిరా గాంధీ. "మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించమన్నందుకు కృతజ్ఞతలు. కాని ఢిల్లీ యూనివర్సిటీ స్కాలర్స్‌ను ఉద్దేశించి నేను ఎలా ప్రసంగించగలను? కృష్ణ మీనన్ వంటి మేధావులు మాట్లాడిన చోట నేను మాట్లాడటం అంత సబబుగా ఉంటుందా? నా ప్రసంగానికి అందరూ ఒప్పుకోకపోవచ్చు కదా? '' అంటూ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.
"మీరు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు. మీరు వస్తే చాలు. ఎక్కువ సేపు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు..'' అని నేను హామీ ఇచ్చేసాను. ఇందిరాగాంధీ వచ్చి ప్రసంగించటానికి ఒప్పుకున్నట్లు ఆ మర్నాడు వైస్‌ఛాన్సలర్‌కి తెలిసింది. ఆయన ఆందోళనపడటం మొదలుపెట్టాడు.
నన్ను ఆఫీసు రూమ్‌కి పిలిచాడు. "అసలు నువ్వు ఏం చేస్తున్నావో తెలుస్తోందా? రేపు నాకు తెలియకుండా ప్రధానిని కూడా యూనివర్సిటీకి పిలిచేసేట్లు ఉన్నావు? నేను రాకుండా ఆ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది? నేను రాకపోతే ఇందిరాగాంధీ ఏమనుకుంటుంది? ఏదైనా సమస్య ఏర్పడితే ప్రధాన మంత్రి నన్ను తిడతారు'' అని నన్ను గట్టిగా మందలించాడు.
ఇదిలా ఉండగా విద్యార్థుల వైపు నుంచి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వైస్‌ఛాన్సలర్ మందలించిన మర్నాడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా ఒక సహవిద్యార్థి నా దగ్గరకు వచ్చాడు. "గ్వాయర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించే స్థాయిలో ఇందిరాగాంధీ ఉందా? అసలు ఆమె ఏం చదువుకుంది? ఇందిరకు మనను ఉద్దేశించి ప్రసంగించే అర్హత ఉందా? ప్రధానమంత్రి కుమార్తె కాబట్టి నువ్వు ఆమెను ప్రసంగించటానికి పిలిచావు'' అని గట్టిగా వాదించటం మొదలుపెట్టాడు.
"అవును. అందుకే పిలిచాను. అంతే కాదు. ఆమె అందంగా ఉంటుంది. తెలివైనది కూడా. అందుకోసం కూడా పిలిచాను..'' అని గట్టిగా సమాధానం చెప్పాను. ఇంతలో మరికొందరు విద్యార్థులు ఇందిరకు షేక్‌హ్యాండ్ ఇవ్వొచ్చా? అని అడగటం మొదలుపెట్టారు. "నమస్తే పెట్టండి చాలు. షేక్‌హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు'' అని వాళ్లకు నచ్చచెప్పాల్సి వచ్చింది.
"తర్వాత... ఇందిరాగాంధీ వచ్చింది. అనుకున్న సమయానికి సభ ప్రారంభమయింది. ఇందిరను ఆహ్వానిస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభించా. ప్రసంగం చివర- "నాకు మిమ్మల్ని డిన్నర్‌కి కూడా ఆహ్వానించాలని ఉంది. కాని గ్వాయర్ హాల్‌లో ఒక చిత్రమైన సంప్రదాయం ఉంది. మహిళలను డైనింగ్ రూమ్‌లోకి అనుమతించరు. అందువల్ల మిమ్మల్ని డిన్నర్‌కు ఆహ్వానించలేకపోతున్నా..'' అన్నా. మా వైస్‌ఛాన్సలర్ మొహం పాలిపోయింది. ఆయన మైకు తీసుకున్నాడు.
"గ్వాయర్ హాల్‌లోకి మహిళలను అనుమతిస్తారు కాని ఈ హాల్‌ను నిర్మించిన సర్ మెరైస్ స్మృత్యర్థం.. ఆక్స్‌ఫర్డ్ సంపద్రాయాలను అనుసరించి- డైనింగ్ హాల్‌లోకి మాత్రం మహిళలకు ప్రవేశం లేదు. ఆ ఒక్క నిబంధనను మాత్రమే మేము పాటిస్తాము'' అన్నాడు. ఆ వెంటనే ఇందిరాగాంధీ ప్రసంగం ప్రారంభమయింది. గ్వాయర్ హాల్ సంప్రదాయాల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. " మహిళలను చిన్నచూపు చూసే ఇలాంటి నిబంధనలను మనం తుంగలో తొక్కాలి..'' అని పిలుపునిచ్చారు. గ్వాయర్ హాలు డైనింగ్ రూమ్‌లోకి రాకుండానే వెళ్లిపోయారు.
ఆ తర్వాత కొద్ది కాలానికి గ్వాయర్ హాల్‌కు భారత్‌లో స్వీడిష్ అంబాసిడర్‌గా ఉన్న ఆల్వా మిర్దాల్‌ను (ఆమెకు 1982లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది) డిన్నర్‌కు ఆహ్వానించి- సంప్రదాయానికి తుదివీడ్కోలు ఇచ్చారు. ఆల్వా మిర్దాల్‌కు ఇలాంటి సంప్రదాయాన్ని బద్దలు కొట్టడం అది రెండో సారి. అంతకు ముందు అమెరికాలోని ప్రిన్‌స్టన్ విశ్వవిద్యాలయంలో ఉన్న ఈ తరహా నిబంధనను కూడా ఆమే బద్దలు కొట్టింది.

No comments:
Post a Comment