ప్రస్తుతం మహిళలే కాదు పురుషులు కూడా అందం అంటే కేవలం ఎర్రని మేనిఛాయగా భావించడం లేదు. సంప్ర దాయ సౌందర్య పట్టికలో ఇప్పుడు ముఖం, కళ, ఫిగర్, హెయిర్ స్టయిల్, నడకతీరు, వ్యక్తిత్వం అన్నిటినీ చేర్చారు. ఎరుపు రంగు స్థానాన్ని ఇప్పుడు ఆత్మవిశ్వాసం, బోల్డ్‌నెస్,గ్లామరస్ లుక్, పాజిటివ్ ఆలోచనలు ఆక్రమించుకున్నాయి. మహిళల్లోని సహజమైన తెలివితేటలు, ఆత్మ విశ్వాసంతో కూడిన స్వభావం, పాజిటివ్ థింకింగ్, సహకరించే మనస్తత్వం లాంటివి ఎరుపు రంగును పక్కన పెట్టేస్తున్నాయి ప్రస్తుతం సౌందర్య కొలమానంలో, సౌందర్య పోటీల్లో కళ్ళు, ఫిగర్, చిరునవ్వు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
వ్యాయామమే బెస్ట్...
ఆకర్షణీయంగా కనిపించడానికి ఒంటి ఛాయ ఎరుపుగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ శరీరాన్ని చురుగ్గా కదిలేలా తయారు చేసుకోవాలి. దినచర్యలో భాగంగా ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, జాగింగ్ తప్పకుంగా చేయాలి, టెన్నిస్, బ్యాడ్‌మింటన్, టేబుల్ టెన్నిస్‌లాంటి ఆటలు ఆడాలి. ఇలా చేస్తే హెల్దీగా,చురుగ్గా ఉంటారు.
చామనఛాయ..
ఒక వేళ శరీరం చామన చామనఛాయ కల్గి ఉంటే ఎప్పుడూ సాధారణ మేకప్ చేసుకోరాదు. కాలానికి అనుగుణంగా మేకప్ చేసుకోవాలి. అప్పుడు చామన ఛాయలో కూడా ఆకర్ష ణీయంగా కనబడతారు.చర్మం కోమలంగా, మెరిసేలా ఉండటం కోసం నెలలో ఒకసారి ఫేషియల్,15 రోజుల కొకసారి బ్లీచ్ చేయించాలి. కాళ్ళు, చేతులకి వారానికి ఒకసారి మేనిక్యూర్, పెడిక్యూర్ చేయించాలి. అవాంఛిత ప్రదేశాలలో వెంట్రుకలను రిమూవ్ చేసుకోడానికి వాక్సింగ్ లేదా హెయిర్ రిమూవర్ క్రీమ్ ఉపయోగించడం మంచిది. వారంలో రెండుసార్లు ముఖం పై ఫేస్ స్కృబ్ ఉపయోగించాలి. ఇలా చేస్తే చామనఛాయ చర్మం కూడా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. దీనితో ఆకర్షణీయమైన శరీరం మీసొంత మవుతుంది.
పర్సనాలిటీ డెవలప్‌మెంట్
అయితే అందమైన శరీరమే కాదు, చురుకైన మెదడు కూడా ఉండాలి. దీనికోసంమీలోని క్రియేటివిటీని అభివృద్ధి చేసుకోవాలి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పుస్తకాలు చదవడం ఎంతో ఉపయోగకరం. అల్లికలు, వంటలు, కుట్టుపనులు మొదలైన అంశాల్లో సొంతంగా ప్రావీణ్యం సంపాదించండి. అందాల పోటీలకే కాదు, ఉద్యోగాలకైనా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ఆకట్టుకునే కనుముక్కు తీరు వుండడం ముఖ్యం. అంతే కానీ శరీరఛాయ నలుపు లేదా ఎరుపు రంగులో వున్నదా అన్నది ముఖ్యం కాదు. దీనితో బాటు పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ కూడా అవసరం. అసభ్యత, ఓవర్ బోల్డ్‌నెస్ ెరీర్‌ను ముందు నడిపించలేవు. ఆఫీసులో పనిచేయ డానికి అందమైన ముఖంతో బాటు పనిలో నిర్దేశిత లక్ష్యాలను సాధించే నేర్పు కూడా ఎంతో అవసరం.
డ్రెస్సు.. సెన్సు...
బైటికి వెళుతునప్పుడు మనం ధరించే దుస్తులు కూడా మన వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తాయి. దుస్తుల్ని సెలక్ట్ చేసుకునేటప్పుడు వాటి రంగు, డిజైన్ మీకు సూట్ అవుతుందా లేదా అని గమనించండి. చామనఛాయ రంగు ఉన్న అమ్మాయిలు ఆకర్షణీయంగా కనబడే రంగుల దుస్తుల్ని వేసుకోవాలి.బ్రైట్ కలర్స్ నీలి, రస్ట్, గులాబీ, ఆరంజ్ రంగులన్నీ చామన ఛాయ రంగున్న వారికి సందర్భోచితంగా సరిపోతాయి. గులాబి రంగు మేని ఛాయ గలవారు వాడవలసిన రంగుల గురించి వివరంగా వర్ణించనవసరం లేదు. వారికి ముదురు రంగులతో పాటుగా, లేత రంగులు కూడా నప్పుతాయి. ఎరుపైనా నలుపైనా తమలో వున్న పాజిటివ్ అంశాల వైపు దృిష్టిసారించాలి.
No comments:
Post a Comment