ఇప్పటిదాకా బొగ్గు, జలం, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని చూశాం! కాస్తో, కూస్తో సౌర, పవన విద్యుత్ కూడా మనకు అందుబాటులో ఉంది. వాటన్నింటికీ భిన్నంగా, కొంచెం కొత్తగా..భూ ఉష్ణం తెరపైకి వచ్చింది. భూ అంతర్భాగంలోని పొరల్లో నుంచి ఉష్ణాన్ని వెలికితీసి, దాని ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కొత్త ప్రక్రియ మొదలైంది. ఖమ్మంజిల్లా అశ్వారా వుపేటలో 25 మెగావాట్ల జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకానుంది. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి వరంగల్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న నార్తర్న్ డిస్కమ్ (ఎన్పీడిసిఎల్) ఒప్పందం కుదుర్చుకుంది.
ఒప్పంద పత్రాలు త్వరలోనే విద్యుత్ నియం త్రణ మండలి (ఇఆర్‌సి) సమక్షంలోకి రానున్నాయి. దీనిపై ఇఆర్‌సి ఆమోదముద్ర పడగానే విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది. ఈ తరహా విద్యుత్ ఉత్పాదక కేంద్రం ఏర్పాటు కావడం దేశంలో ఇదే తొలిసారి. ముంబాయికి చెందిన జియో థర్మల్ సిండికేట్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఐటి-బొంబాయికి చెందిన డి చంద్రశేఖరం అనే జియో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఈ సంస్థకు సాంకేతిక సహకారాలు అందిస్తున్నారు.
ఈ సంస్థను నెలకొల్పినట్లు సమాచారం. భూ ఉష్ణంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాలు అమెరికా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అమల్లో ఉంది. మనదేశానికి చెందిన టాటా పవర్స్ సంస్థ రూ.3 వేల కోట్లతో 1500 మెగావాట్ల ఇండోనేషియాలో జియోథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సైతం నెలకొల్పడం దీనికి ఉన్న డిమాండ్‌ను సూచిస్తోంది. వంటి కొన్ని దేశాల్లో ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తరువాత..అలాంటి కేంద్రాలనే రాష్ట్రంలో నెలకొల్పడానికి ఆ సంస్థ ఆసక్తి చూపిందని ఎన్పీడిసిఎల్ వర్గాలు ‘మేజర్‌న్యూస్’కు తెలిపాయి.
మాగ్మా కీలకం..
భూ అంతర్భాగంలో నిరంతరం సెగలు గక్కే మాగ్మాను చల్లార్చడం ద్వారా వెలువడయ్యే ఆవిరిని వెలికి తీయడమే ఇందులో కీలకం. మాగ్మా నుంచి వెలువడే ఉష్ణోగ్రత కనీసం 250 డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడుకుని ఉంటుంది. అయితే మరీ అంత లోతుల్లోకి వెళ్లకుండా మాగ్మా ఉపరితలంలో అంటే...70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రత వరకే గొట్టాలను అమర్చుతారు.
ఉష్ణం ఇలా వెలికి తీస్తారు
విద్యుత్ కేంద్రం ఆవరణ నుంచి భూ అంతఃపొరల్లో ఉన్న ఉష్ణాన్ని వెలికితీయడానికి 4-7 కిలోమీటర్ల మేర లోతుల్లో నాలుగు గొట్టాలను వేస్తారు. రెండు గొట్టాల ద్వారా చల్లటి నీటిని, మాగ్మాపైకి ధారగా పోస్తారు. సెగలు కక్కే మాగ్మా ఒక్కసారిగా చల్లబడటం ద్వారా ఉబికి వచ్చే వేడి ఆవిరిని మరో రెండు గొట్టాల ద్వారా నేరుగా... విద్యు త్‌ను ఉత్పత్తి చేసే టర్బయిన్ ఉండే గదిలోకి వదులుతారు. వేడి ఆవిరితో టర్బయిన్ తిరిగి విద్యుదుత్పత్తి అవుతుంది.
అశ్వారావు పేట ఎందుకంటే..?
ఖమ్మంజిల్లా అశ్వారావు పేటను ఆనుకునే గోదావరి ప్రవహిస్తోంది. ఈ ప్రాంతం కృష్ణా-గోదావరి బేసిన్ పరిధి లో ఉండటం వల్ల భూగర్భ జల వనరులు అపారం. దీనివల్ల మాగ్మాను చల్లారబెట్టడానికి నీటిని పెద్దగా వినియోగించాల్సిన పని ఉండదు.
త్వరలో ప్రతిపాదనలు
దీనికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే ఇఆర్‌సి వద్దకు వెళ్లనున్నాయి. దీనిపై విచారణ నిర్వహించిన అనం తరం ఇఆర్‌సి ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేస్తుంది. ఇఆర్‌సి ఆమోదం లభించగానే ఉత్పత్తి మొదలవుతుంది. ఈ కేంద్రం విజయవంతమైతే దేశంలో మరిన్ని భూ ఉష్ణ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటవుతాయనడంలో సందేహాలు అనవసరం. ఇండోనేషియాలో ఈ తరహా కేంద్రాన్ని నెల కొల్పిన టాటా పవర్ సంస్థ మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
No comments:
Post a Comment