చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Tuesday, August 3, 2010

దూసుకొస్తున్న సోలార్‌ సునామీ

sunలండన్‌: సూర్యుడిపై అయస్కాంత వ్యవస్థల అసహజ కదలికల వల్ల ఏర్పడిన ‘సౌర సునామీ’ ఏ క్షణానైనా భూమిని తాకవచ్చని శాస్తజ్ఞ్రులు హెచ్చరించారు. సూర్యుడిపై అసాధారణ పరిస్థి తుల్లో సంభవించిన పేలుడు కారణంగా విద్యుత్‌ రేణువులతో కూడిన పెద్ద మేఘం ఏర్పడింది. విద్యుత్‌ రేణువులున్న ఈ సౌర సునామీ భూమివైపు వేగంగా దూసుకొస్తోందని శాస్తజ్ఞ్రులు తెలిపారు. సూర్యుడిపై 1092వ బిందువు పైన (సన్‌స్పాట్‌) ఆదివారం జరిగిన ఈ పేలుడును నాసా కేంద్రం న్యూ సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ (ఎస్‌డిఓ)తో సహా అనేక ఉపగ్రహాలు నమోదు చేశాయి.

ఆ సన్‌స్పాట్‌ భూమి అంత పరిమాణంలో ఉందంటున్నారు. ఈ విస్పోటనమే కాక, సూర్యుడి ఉత్తరార్థ గోళం అంతటా చల్లటి వాయువు విస్తరించి ఉన్న పెద్ద ఫిలమెంట్‌ కూడా విశ్వాంతరాళంలో పేలిన సంఘటనను కూడా ఉపగ్రహాలు నమోదు చేశాయి. సూర్యుడిలో ఈ విస్పోటనం భూమి దిశగా సంభవించింది. ఈ పేలుడును ‘కోరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌’ (ఉపరితల ద్రవ్యరాశి విడుదల) అని అంటున్నారు. సూర్యుడి వాతావరణంలోని అయస్కాంత వ్యవస్థల్లో తీవ్రమైన అలజడి కలిగినప్పుడు అవి తమ స్థిరత్వాన్ని కోల్పోతాయి. దాంతో సౌర గురుత్వాకర్షణ శక్తి పరిధి నుంచి వెలుపలికి వచ్చి అంతరిక్షంలోపేలిపోతాయి.

Karonaఆ సమయంలో ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతి, నిప్పు రవ్వలు కనబడతాయి. అంతరిక్షంలో జరగబోయే ఈ అద్భుతాన్ని చూడగల గడం ఒక విశేషమని శాస్తజ్ఞ్రులు చెబుతున్నారు. సౌర అయస్కాంత వ్యవస్థల అసహజ కదలికల వల్ల ఏర్పడిన ఈ సునామీ అంతరిక్షం ద్వారా 930 లక్షల మైళ్లు పయనించి భూమిని చేరాల్సి ఉంది.‘నిజానికి ఇలాంటి సంఘటన 2013లో సంభవిస్తుందని మొదట భావించాం. కానీ ముందే జరిగింది’ అని లండన్‌ యూనివర్శిటీ కాలేజీలోని ముల్లార్డ్‌ స్పేస్‌ సైన్స్‌ లేబోరేటరీ సౌర శాస్తజ్ఞ్రు డు లెన్‌ కల్హాన్‌ చెప్పారు. తీవ్రతతో వాయువు భూమిని రక్షిస్తున్న అయస్కాంత క్షేత్రాన్ని దాటి ఏ క్షణానైనా భూమిని చేరగలదని నిపుణులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment