చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Thursday, August 5, 2010

భావాన్ని పంచే రోబో

robioలండన్‌: ఇది రోబోల కాలం. కంప్యూటర్‌ తర్వా త వీటిదే రాబోయే కాలమంతా. అయితే రోబోలు ఇప్పటివరకు మనిషికి చేదోడు వాదోడుగా.. అతనికి కావాల్సిన పనులను చేస్తూ.. అవసరాలని తీరుస్తూ.. వచ్చింది. మరీ ఇప్పుడు అవే రోబోలు మరింతగా తెలివిగా పనిచేసేలా శాస్తవ్రేత్తలు రూపొందిస్తున్నారు. మనిషి భావాలకు అనుగుణంగా నడుచుకునేలా వీటిని శాస్తవ్రేత్తలు తయారుచేస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని ఓ యూనివర్సిటీకి చెందిన రోబో శాస్తవ్రేత్తలు వీటికి శ్రీకారం చుట్టారు. ఒంటరిగా ఉన్నప్పుడు తోడు కావానుకుంటాం. ముసలివాళ్లకి ఈ బాధ బాగా తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు వారు చింతించాల్సిన పనిలేదు.

robosఎందుకంటే.. శాస్తవ్రేత్తలు తయారుచేస్తున్న ఈ రోబో లు వారికి కావాల్సిన అవసరాలను ఎంచక్కా తీరుస్తాయి. ఇంటికి కాపాలాగా ఉండే కుక్క స్థానాన్ని రోబో ఎప్పుడో ఆక్రమించింది. ఇప్పుడు డాక్టర్‌, న్యూట్రిషియన్‌, ఓ విషర్‌ స్థానాన్ని పొందేందుకు అది సిద్ధమైంది. శాస్తవ్రేత్తలు రూపొందిస్తున్న ఈ రోబో గతంలో వచ్చిన వాటికన్నా తెలివిగా పనిస్తుందని వీరు ధీమాగా చెపుతున్నారు. మూడు విధాలుగా పనిచేసే ఈ రోబో మనకు హెల్త్‌ రిపోర్ట్‌ని ఇస్తుంది. దాన్ని కూడా అలారమ్‌ కొట్టి మరీ చెపుతుంది. శరీరానికి కావాల్సిన పోషకవిలువల స్థాయిని తెలుపుతుంది. మనం తీసుకునే ఆహారం తాగే నీరు ఎలాంటివో చిటికెలో వాటి రిపోర్ట్‌ని మన ముందుంచుతుంది.

robo-walk ఇంటికి వచ్చిన స్నేహితులని, బంధువులని గుర్తుపడుతుంది. రెండోసారి వారు ఇంటికి వస్తే వారికి హలో కూడా చెపుతుంది. అంతేకాదు వారి యోగక్షేమాలను విచారిస్తుంది. మనకు కావాల్సిన షాపింగ్‌ లిస్ట్‌ని తయారుచేస్తుంది. భావాలను అర్థంచేసుకుని పనిచేసే ఈ రోబోలను పరీక్షించటానికి శాస్తవ్రేత్తలు.. లండన్‌, నెదర్లాండ్‌కి చెందిన ఆరుగురు వృద్ధులను రిసెర్చ్‌ కోసం తీసుకున్నారు. మారుతున్న సమాజంలో ఒకరి బాగోగులను మరొకరు చూసే సమయం ఎవరికి ఉండటం లేదు. మన పెద్దవాళ్ల మీద మనకు శ్రద్ధ ఉన్నప్పటికీ.. పనుల హడావుడిలో పడి వారిని మరచిపోతుంటాం. ఇలాంటి వారి కోసం ఈ రోబోలు చాలా అవసరమంటున్నారు శాస్తవ్రేత్తలు.

No comments:

Post a Comment