ఆల్ప్స్ పర్వతాల ఒడిలో చల్లగా ప్రశాంతంగా టూరిస్టులను ఊరిస్తూ ఉంటుందా దేశం. అక్కడ అద్దెకు ఇల్లు కావాలంటే యాభైవేలు కట్టాలి. ఎవరితోనైనా మర్యాదగా మసులుకోవాలి. మూడు రకాలుగా చెత్తను కూడా వేరు చేసి చెత్తకుండీలో పడేయాలి. లేదంటే బోలెడంత ఫైన్. ఇంగ్లీషు వస్తే చాలు అన్నీ మేనేజ్ చెయ్యొచ్చు అనుకోడానికి అస్సల్లేదండీ బాబూ.. ఎందుకంటే అది అక్కడ అస్సలు పనిచేయదు. ఏ ప్రపంచ యుద్ధంలోనూ పాల్గొనని తటస్థ దేశంగా చిన్నప్పుడు చరిత్రలో చదువుకున్న స్విట్జర్లాండ్ గురించే ఇదంతా. ప్రవాస భారతీయుల జీవన శైలిని పరిచయం చేయడంలో భాగంగా స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న అడుసుమల్లి రమేశ్ లైఫ్ స్టైల్ విశేషాలు.
'నేను యూరప్ వెళ్లి తొమ్మిదేళ్లు అవుతోంది. జర్మనీ, ఆస్ట్రియాల్లో ఏడేళ్లు ఉండి రెండేళ్ల కిందటే స్విట్జర్లాండులోని తున్‌కు వచ్చాను. ఇక్కడి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎంప(ఉక్కఅ ఫెడరల్ రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ)లో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాను.
ఉదయం ఆరున్నరకే ట్రాఫిక్
మాకు వారానికి ఐదు రోజులే వర్కింగ్ డేస్. ఉదయం తొమ్మిది నుంచి సాయం కాలం ఐదు వరకు ఆఫీస్ టైమింగ్స్. నేను ఏడున్నర కల్లా ఆఫీస్‌కి స్టార్ట్ అవుతాను. మా ఇల్లు ఆఫీస్‌కి చాలా దగ్గర. అందుకని సైకిల్ మీదే ఆఫీస్‌కి వెళ్తాను. ఇక్కడ సైకిల్ మీద వెళ్లడం సర్వసాధారణం. (ఈ దేశంలో బస్‌లు, రైళ్లు, ట్రామ్స్ అని మూడు రకాల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. చాలా సౌకర్యంగా ఉంటాయి)ఇండియాలో ఉదయం తొమ్మిది నుంచి పదకొండు దాకా ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుందో ఇక్కడ ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిది వరకు అంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది. వెళ్లగానే అందరినీ విష్ చేయాలి.
పలకరించడమనేది తప్పనిసరి. లేకపోతే అనాగరికులుగా చూస్తారు. ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మధ్య అందరూ వస్తారు. అరగంట బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. వారానికి రెండు సార్లు మాత్రమే మన టిఫిన్స్(ఇడ్లీ, దోస). మిగిలిన రోజుల్లో పాలు, కార్న్‌ఫ్లేక్సే. బ్రేక్‌ఫాస్ట్ అవగానే తొమ్మిదికల్లా ఆఫీస్ పని స్టార్టయి పోతుంది. నేను టెక్నీషియన్స్‌ని డీల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బాస్, సబ్ ఆర్డినేట్ అంటూ ఏమీ ఉండదు. అందరూ కొలీగ్స్‌లాగే ఉంటారు.
మాల్ సైట్ పని విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదు. అయినా ఎవరికి వాళ్లే చాలా బాధ్యతగా ఉంటారు. ప్రణాళికా బద్ధంగా కూడ ఉంటారు. చివరి నిమిషంలోహాడావుడి పడడం లాంటివి ఉండవు. వారానికి ఒకటో, రెండో సెమినార్లు, ప్రెజెంటేషన్లు ఉంటాయి. వాటికి ఒకటి, రెండు రోజుల ముందే ప్లాన్ చేసుకుని ఉంటాం కాబట్టి ఎలాంటి కంగారు లేకుండా ముగుస్తాయి. చాట భారతాల్ని ఇష్టపడరు. ఏదైనా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాలి. టీం వర్క్ బాగుంటుంది. లంచ్ టైం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య ఉంటుంది.
అందరూ ఒకే సమయానికి తినాలనేమీ ఉండదు. కాకపోతే లంచ్‌కి వెళ్లేప్పుడు 'మాల్ సైట్ 'అని చెప్పి వెళ్లాలి. అంటే మన కొలీగ్స్‌కి మనం లంచ్‌కి వెళ్తున్నామని తెలియజెప్పడం అన్నమాట. వీలైతే వాళ్లూ వస్తారు లేకపోతే లేదు. కాని అలా చెప్పి వెళ్లడం మాత్రం తప్పనిసరి. ఆఫీస్ క్యాంటీన్‌లోనే లంచ్ ఉంటుంది. లంచ్‌లో గ్రిల్డ్ మీట్, ఫ్రైడ్ మీట్ తోపాటు ఉడకబెట్టిన బంగాళదుంప, సలాడ్ ఉంటాయి. వీళ్లకు ఉడికించిన బంగాళదుంప అన్నం లాంటిదన్నమాట. వీటితోపాటు నూడల్స్, పాస్తాలాంటివి కూడా ఉంటాయి. తప్పకుండా స్పూన్‌తోనే తినాలి.
లంచ్ అయిన వెంటనే ఖచ్చితంగా కాఫీ తాగుతారు. మామూలుగానే గంటకు ఒకసారి కాఫీ తాగుతూ ఉంటారు. చలి ప్రదేశం కదా. అందరూ ఒకే టైంకేమీ వెళ్లరు. ఉదయం త్వరగా వచ్చిన వాళ్లు (ఎనిమిది గంటల పని వేళల లెక్కన) సాయంకాలం త్వరగా వెళ్తారు. లేట్‌గా వచ్చిని వాళ్లు లేట్‌గా వెళ్తారు. చెప్పాను కదా ఇక్కడ పని ఒత్తిడే కాదు వర్క్ లోడ్ కూడా చాలా తక్కువ. లీవులు కూడా 25 దాకా ఉంటాయి. ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడెందుకు తీసుకున్నావ్? అప్పుడే తీసుకోలేకపోయావా? లాంటి ప్రశ్నలేమీ ఉండవు.
వైన్, బీర్లు సంస్కృతిలో భాగం
మన బర్త్‌డే, మ్యారేజ్ డేలాంటి అకేషన్స్‌కి ఓ కేక్ తెచ్చి కొలీగ్స్ అందరికీ మెయిల్ పెట్టాలి. ఈ రోజు మన బర్త్‌డే అని, ఫలానా టైంలో పార్టీఅని. ఆ టైంలో కేక్ కట్ చేసి డ్రింక్స్‌తో చిన్న సైజు పార్టీ చేసుకుంటాం. ఇలాంటివన్నీ కంపల్సరీ . వైన్, బీర్‌లు ఇక్కడ సంస్కృతిలో భాగం. ఇక్కడ గాసిప్స్, టైం పాస్ వ్యవహారాలు ఉండవు.
పర్సనల్ వ్యవహారాలు, వివరాల్లో ఇతరులు ఉత్సుకత ప్రదర్శించకూడదు. పంక్చువాలిటీ, డిసిప్లిన్‌లకి ప్రాణం ఇస్తారు. అలాగని ప్రత్యేక నియమనిబంధనలేమీ ఉండవు. ఎవరికి వాళ్లే ఇక్కడి సిస్టమ్‌ను అర్థం చేసుకుంటూ ఆచరించటమే. ఆఫీస్‌కి కూడా ప్రత్యేక డ్రెస్ కోడంటూ ఏమీ ఉండదు. టక్ చేసుకుని వచ్చావా?టై కట్టుకున్నావా? బెల్ట్ పెట్టుకున్నావా? షూ వేసుకున్నావా? అని పరికించి చూడరు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉన్నావా లేదా అన్నదే ముఖ్యం ఇక్కడ. ఖర్చు మాత్రం ఎక్కువే
ఇక్కడ జీవనం ఖరీదైన వ్యవహారం. ఇల్లు అద్దె 1200 ఫ్రాంక్స్ అంటే మన రూపాయల్లో 50 వేలు. ఇంట్లో చెత్తను దేనికి అదే అంటే ఆహార వ్యర్థాలను ఒక టిన్‌లో, ప్లాస్టిక్‌ను మరొకదాంట్లో, పాతబట్టలు, షూస్ ఒకదాంట్లో, ఇలా వేటికవే వేరు చేసి వీథిలో ఉన్న సపరేట్ డబ్బాల్లో వేయాలి. ఒకవేళ అన్నీ కలిపి ఒకేదాంట్లో వేస్తే దాన్ని రస్ట్ అంటారు.
దానికి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు మున్సిపాలిటి వాళ్లు, వీటన్నిటినీ రీసైక్లింగ్ చేస్తారు. పాత బట్టలు, షూస్ లాంటివి రెడ్ క్రాస్ సొసైటీకి వెళ్తాయి. ఇంటి పనులకు గంటలు గంటలు వెచ్చించాల్సిన పని ఉండదు. రాత్రి భోజనం అయ్యాక నెట్ ముందర కూర్చోవడం, ఇండియాకి ఫోన్లు చేసుకోవడంతో సరిపోతుంది. అయితే నేనున్న ఏరియాలో ఇండియన్స్ చాలా తక్కువగా ఉంటారు.
ఇంగ్లీషు పని చేయదు
యూరప్‌లో యుకె తప్పించి ఏ దేశానికి వెళ్లాలన్నా ఆ దేశం అధికార భాష తప్పకుండా వచ్చుండాలి. నేనున్న చోట జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, రొమేనియన్‌లు అధికార భాషలు. వీటిల్లో ఏదో ఒకటి కచ్చితంగా వచ్చుండాలి. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ ఉపయోగం చాలా చాలా తక్కువ. నేమ్ ప్లేట్లు, సైన్ బోర్డులు ఒక్కటేమిటి అన్నీ ఆ భాషల్లోనే ఉంటాయి. ఇంగ్లీష్ ఎక్కడా కనిపించదు. వాళ్ల భాషను తప్పకుండా ఎలా నేర్చుకుని ఉండాలో వాళ్ల సంస్కృతిని కూడా అంతే ఇదిగా అడాప్ట్ చేసుకోవాలి.
ఇక్కడి వాళ్లు సంస్కృతికి ప్రాణమిస్తారు. వాళ్ల అలవాట్లు, వాళ్ల పద్ధతిని గమనించి అనుసరించాలి. ఏ దేశం వాళ్లయినా సరే ఇక్కడ మాత్రం స్థానికుల్లా ఉండాలని వీరు కోరుకుంటారు. అడిగితేనే సాయం చేస్తారు. లేకపోతే లేదు. అమెరికాతో పోల్చుకుంటే ఇండియన్ రెస్టారెంట్లు, హోటల్స్ తక్కువ. ఇండియన్ షాపులుంటాయి. ఎక్కువగా శ్రీలంక వాళ్లు వీటిని నడుపుతుంటారు. మన వస్తువులన్నీ దొరుకుతాయి.
అయితే ఇండియన్ ఫుడ్ అంటే యూరోపియన్లందరూ చెవి కోసుకుంటారు. మన రెస్టారెంట్లలో వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ల సూపర్ మార్కెట్లలో కూడా ఎమ్‌టిఆర్, ప్రియా వాళ్ల ఉత్పత్తులు దొరుకుతాయి. జర్మనీలోని హామ్(జ్చిఝ)లో ఇండియాలో కూడా లేనంత పెద్ద గుడి ఉంది. దీన్ని శ్రీలంక వాళ్లు కట్టారు. ఎన్నో అనుభూతుల్ని, అనుభవాలను ఇచ్చిన ఈ దేశం వదిలి బిట్స్ పిలానీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అవడానికి ఈ నెలాఖరున ఇండియా వచ్చేస్తున్నాను.' జూ సరస్వతి రమ

ఒకరకంగా చెప్పాలంటే అమెరికా జీవన విధానమే ఆస్త్రేలియాలోనూ కనబడుతోంది.చెత్త సాగ్రిగేషన్ తో సహా . కాకుంటే సామాజిక రవాణా వ్యవ్సకన్న ఎన్నో రెట్లు మించి ప్రైవేటు వాహనాలు అమెరికాలో ఎక్కువ. వర్క్ కల్చర్ లో నూ వ్యత్యాసాలేమీ లేవు. కాని భాష నిబంధనలలో అంతరం చాలా వుంది.
ReplyDelete