అంతకుముందే పలు కేంద్ర, రాష్ట్ర విభాగాలలో కీల క బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ ఐవీ ఈఓగా చేసిన తర్వాత పాఠశాల విద్య, హెల్త్, రెవెన్యూ విభాగాలలో ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2008 మార్చి 31 నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత కొద్ది కాలంలోనే ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. అర్హులైన వారందరికీ ఫోటో ఓటరు గుర్తింపు కార్డులుండేలా సంస్కరణలు చేపట్టారు. 18 ఏళ్లు దాటిన యువతీ యువకులు అందరికీ ఓటు హక్కు కల్పించేందుకు విశేషంగా కృషి చేశారు. ఇందుకోసం పోస్టాఫీసులు, విశ్వవిద్యాలయాలు, కాలేజీలు తది తర సంస్థలు పాలుపంచుకునేలా చేశారు. ఓటర్ల నమోదు కోసం ‘యువతరంగ్’ వంటి పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం అర్హులైన పౌరు లందరి పేర్లూ ఓటర్ల జాబితా లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వారందరికీ ఓటరు గుర్తింపు కార్డు లు అందేలా చర్యలు చేపట్టారు.
ప్రతి ఎన్నికల కు ముందు ఓటర్ల జాబి తాను అన్ని రాజకీయ పక్షాలతో సమీక్షించి అప్‌డేట్ చేయడం వంటి కీలకమైన కార్యక్రమాలను సమర్ధ వం తంగా నిర్వహించారు. అంతేగాక అత్యంత పారద ర్శకంగా ఎన్నికలను నిర్వ హించడంలో ఐవీ సుబ్బా రావు తనదైన శైలిని ప్రద ర్శించారు. 2008 మేలో జరిగిన ఉప ఎన్నికలు, 2009 సాధారణ ఎన్ని కలను విజయవంతంగా నిర్వహించారు. తాజాగా తెలంగాణాలోని 12 నియోజకవర్గాలలో జరిగి న ఎన్నికలను ప్రశాంతం గా, అత్యంత పారదర్శకం గా, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా నిర్వహించి తనదైన పరిపాలనా ముద్రను నిరూపించుకున్నా రు. ప్రతి ఎన్నికల్లోనూ ఎన్నికల కోడ్‌ని తు.చ. తప్పకుండా పాటించేలా చర్యలు చేపట్టారు. నియమావళి ఉల్లం‘ఘను’లెవరైనా చర్యలు ఒకే విధంగా ఉంటాయని నిరూపించారు. తాజా ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విశ్వసనీయతను కొందరు అనుమానించినా వాటి లో వాస్తవం లేదని నిరూపించిన ఘనత ఐవీకే దక్కుతుంది. ఈ నేప థ్యంలో డాక్టర్ ఐవీ సుబ్బారావు ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన అంశాలు.. అనుభూతులు.. ‘సూర్య ప్రతినిధి’తో ఇలా పంచుకున్నారు.
జీవితంలో తొలి టర్నింగ్ పాయింట్...
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు)లో అసిస్టెం ట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నపుడు ప్రజలకు సేవ చేయాలన్న అభిలాష కలిగింది. దాంతో సివిల్ సర్వీసెస్ రాయలన్న ఆలోచన వచ్చింది. అందుకు నాన్నగారు డాక్టర్ ఐవీ పాండురంగారావు పూర్తిస్థాయిలో ప్రోత్సాహమందించారు. ఆయన సంపూర్ణ సహాయ, సహకారాలతో ప్రిపేరయ్యాను 1979లో ఐఏఎస్‌కు ఎంపికయ్యాను. ఇది నా జీవితం లో తొలి టర్నింగ్ పాయింట్.నచ్చిన చోటే అవకాశం మరో మలుపే...
1992లో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖామంత్రి చింతామోహన్ తనవద్ద ప్రైవేట్ కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే అనుకో కుండా మంత్రివర్గం నుంచి ఆయనను తప్పించారు. అప్పుడు ఏ విభా గంలోకెళ్లాలో తెలియని తరుణంలో ఎడ్యుకేషన్ సెక్రెటరీ నన్ను పిలిచి, నా విద్యార్హతలను బట్టి నన్ను విద్యా విభాగంలో పనిచేయమన్నారు. నాకు నచ్చిన విభాగంలో అవకాశం రావడం గొప్పగా అనిపించింది.ప్రొఫెసర్ దవేతో గొప్ప అనుభవం...
ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ దవే ఛైర్మన్‌గా విద్యావిధానానికి సంబం ధించి కేంద్రం నియమించిన నేషనల్ కమిటీలో సభ్యుడిగా పనిచేశా ను. నాలుగేళ్లపాటు ప్రొఫెసర్ దవేతో కలిసి పనిచేసిన రోజులు ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం.అమెరికాలో పిహెచ్‌డి...
దాదాపు 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత స్టడీ లీవు తీసుకుని జీఆర్‌ఈ, టోఫెల్ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది అమెరికాలోని పెన్సిల్వే నియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ విభాగంలో పిహెచ్‌డి అడ్మిషన్ పొంది రెండున్నరేళ్ల లోపే పిహెచ్‌డి పూర్తిచేసి డాక్టరేటు పొందాను.టీటీడీలో సంస్కరణలు...
అమెరికాలో పిహెచ్‌డి పూర్తి చేసి ఇండియాకు రాగానే తిరుమల తిరు పతి దేవస్థానంలో ఈఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఏడాదిన్నరపాటు అక్కడ పనిచేశాను. దైవ దర్శనానికి భక్తులు పడే ఇక్కట్లను గమనించాను. వారి ఇబ్బందులను తగ్గించేందుకు గాను ‘సుదర్శనం’ పద్ధతిని ప్రవేశపెట్టాం. కంప్యూటర్ ద్వారా భక్తులకు టోకెన్‌లను ఇచ్చి.. వారు గంటల తరబడి క్యూ లైన్లలో నిల బడకుండా వారికి కేటాయించిన సమయంలో వస్తే దైవదర్శనం లభించేలా చర్యలు తీసుకున్నాం. అమెరికా నుంచి రాగానే టీటీడీ ఈఓగా పనిచేసే అవకాశం రావడం ఆ శ్రీవేంకటేశ్వరుడే తనకు కల్పించిన అద్భుత అవకాశంగా భావిస్తాను.చెన్నారెడ్డి హయాంలో...
మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయనకు సం యుక్త కార్యదర్శిగా పనిచేశాను. రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకుని ప్రాం తాలు, ప్రజల అభివృద్ధి కోసమని అప్పట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమానికి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాను. ఈ కాలం లో అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమూల, గిరిజన ప్రాంతాలను అభివృద్ది చేయడంలో నా శాయాశక్తులా కృషిచేశాను.ఈసీ ధ్యేయమదే...
- ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఎన్నికల ను ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడడమేగాక ప్రజలకు సులభతరమైన విధానాలను అందుబాటులోకి తీసుకువ చ్చేందుకు ఎన్నికల సంఘం ఎప్పుడూ కృషి చేస్తుంది. - ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లంతా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, ప్రభావాలకు లొంగకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నదే ఈసీ ధ్యేయం.
- డాక్టర్ ఐవీ సుబ్బారావు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా డాక్టర్ ఐవీ చేపట్టిన సంస్కరణలు... తీసుకున్న చర్యలు...
-ఈవీఎంలపై అవగాహనకు రాష్టవ్య్రాప్తంగా గ్రామగ్రామాన విస్తృత ప్రచారం.-మారుమూల పల్లెలు, గ్రామాలలోనూ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.
-ఈ సేవా కేంద్రాల ద్వారా ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దు కునే అవకాశం.
-ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలయ్యేలా చర్యలు.
-రాజకీయ పార్టీల అడ్డగోలు ప్రచారానికి, ప్రసంగాలకు చెక్.
-సమస్యాత్మక ప్రాంతాలనుగుర్తించి ముందస్తు చర్యల చేపట్టడం ద్వారా ఎన్నికల ప్రశాంత నిర్వహణ.
-వృద్ధులు, మహిళలు, వికలాంగులకు పోలింగ్ కేంద్రంలో గంటల తరబడి నిలబడే ఇబ్బంది లేకుండా నేరుగా లోపలికి వెళ్లి ఓటేసే అవకాశం.
-అంధులు సైతం స్వతంత్రంగా ఓటేసేలా బ్రెయిలీ లిపితో కూడిన ఈవీఎంలను ఏర్పాటు చేయించిన ఘనత ఐవీకే దక్కుతుంది.
-ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసే మద్యం, నల్లధనం పంపిణీని కట్టడి.
- అక్రమ మద్యం దుకాణాల భరతం పట్టారు.
-ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారినెవరినీ వదిలిపెట్టలేదు.
-రాజకీయ నాయకులతోపాటు నియమాలను ఉల్లంఘిస్తే రాష్ట్ర డిజిపిని సైతం ఉపేక్షించలేదు.
-తాజా ఉప ఎన్నికల్లో మోడల్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో సహా టీఆర్‌ఎస్ నేత కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీలపై చర్యలు చేపట్టిన ఐవీ గత సాధారణ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌కు సైతం ఈసీ తరపున నోటీసులందించారు.
ప్రొఫైల్
అందరికీ తెలిసిన పేరు : డాక్టర్ ఐవీ సుబ్బారావు
పూర్తిపేరు : డాక్టర్ ఇలపావులూరి వెంకట సుబ్బారావు
పుట్టిన రోజు : ఆగస్టు 12, 1955
పుట్టింది : బాపట్ల, గుంటూరు జిల్లా
విద్యార్హతలు : బీఏ ఆనర్స్ (ఇంగ్లీష్), ఎంఏ (ఇంగ్లీష్), బిఇడి, ఢిల్లీ యూనివర్సిటీ పిహెచ్‌డి (ఎడ్యుకేషన్), యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అమెరికా
తండ్రి : డాక్టర్ ఇలపావులూరి పాండురంగారావు (ఎంఏ, హిందీలో గోల్డ్ మెడలిస్టు,1955లో నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి చేసి హిందీ విభాగంలో డాక్టరేటు అందుకున్న తొలి ఆంధ్రుడుగా చరిత్రకెక్కారు), యూపీఎస్‌సిలో భాషా విభాగ డైరెక్టర్‌గా, భారతీయ జ్ఞానపీఠ్ అవార్డ్‌స డైరెక్టర్‌గా పనిచేశారు.
తల్లి : రాధాదేవి
భార్య : రేఖారావు
సంతానం : సమీరజ్ (కొడుకు), మానస (కుమార్తె)
తమ్ముడు : రఘు
చెల్లెల్లు : వాంగ్మయి, అనూప, సువర్ణ
ఐఏఎస్ కంటే ముందు...
జె.ఎన్.యూ(ఢిల్లీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్(ఇంగ్లీష్)గా పనిచేశారు.
ఐఏఎస్ బ్యాచ్ : 1979
శిక్షణ : మస్సోరిలో అకాడమీ ట్రైనింగ్, కరీంనగర్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ (1979-81)
తొలి పోస్టింగ్: వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా (1981-83)
కలెక్టర్‌గా తొలి పోస్టింగ్: అనంతపురం జిల్లా (1986-87)
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా: పాఠశాల విద్య (2000-2004), ఆరోగ్య శాఖ (2004-06), రెవెన్యూ విభాగం (2006-08)
ప్రస్తుతం: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (మార్చి 31,2008 నుంచి)
అందరికీ తెలిసిన పేరు : డాక్టర్ ఐవీ సుబ్బారావు
పూర్తిపేరు : డాక్టర్ ఇలపావులూరి వెంకట సుబ్బారావు
పుట్టిన రోజు : ఆగస్టు 12, 1955
పుట్టింది : బాపట్ల, గుంటూరు జిల్లా
విద్యార్హతలు : బీఏ ఆనర్స్ (ఇంగ్లీష్), ఎంఏ (ఇంగ్లీష్), బిఇడి, ఢిల్లీ యూనివర్సిటీ పిహెచ్‌డి (ఎడ్యుకేషన్), యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అమెరికా
తండ్రి : డాక్టర్ ఇలపావులూరి పాండురంగారావు (ఎంఏ, హిందీలో గోల్డ్ మెడలిస్టు,1955లో నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి చేసి హిందీ విభాగంలో డాక్టరేటు అందుకున్న తొలి ఆంధ్రుడుగా చరిత్రకెక్కారు), యూపీఎస్‌సిలో భాషా విభాగ డైరెక్టర్‌గా, భారతీయ జ్ఞానపీఠ్ అవార్డ్‌స డైరెక్టర్‌గా పనిచేశారు.
తల్లి : రాధాదేవి
భార్య : రేఖారావు
సంతానం : సమీరజ్ (కొడుకు), మానస (కుమార్తె)
తమ్ముడు : రఘు
చెల్లెల్లు : వాంగ్మయి, అనూప, సువర్ణ
ఐఏఎస్ కంటే ముందు...
జె.ఎన్.యూ(ఢిల్లీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్(ఇంగ్లీష్)గా పనిచేశారు.
ఐఏఎస్ బ్యాచ్ : 1979
శిక్షణ : మస్సోరిలో అకాడమీ ట్రైనింగ్, కరీంనగర్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ (1979-81)
తొలి పోస్టింగ్: వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా (1981-83)
కలెక్టర్‌గా తొలి పోస్టింగ్: అనంతపురం జిల్లా (1986-87)
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా: పాఠశాల విద్య (2000-2004), ఆరోగ్య శాఖ (2004-06), రెవెన్యూ విభాగం (2006-08)
ప్రస్తుతం: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (మార్చి 31,2008 నుంచి)
- ఉదయ్,
No comments:
Post a Comment