రెండు హృదయాల స్పందన... ఏకమై పాడే రాగాలాపన... నిస్వార్థపూరిత ప్రేరణ... అమూర్తిమత్వ భావన... అచెంచల చిత్రణ... కల్పాంతపు సూచన... అనిర్వచనీయ శోధన... అనునిత్య స్ఫూరణ... ఆదిదేవుళ్లే ప్రతిగా సృష్టిం చిన స్నేహబంధ కీర్తన... వర్ణంలేనిది... వార్ధక్యం రానిఈది... వజ్రం కన్నా దృఢమైనది... త్యాగాన్ని కోరేది... సత్సాంగత్యాన్ని చాటేది... ఈ సృష్టిలో తీయనిది స్నేహమే... ‘‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నా పెన్నిధి స్నేహమే నాకున్నది’’ అంటూ... స్నేహం విలువ తెలి యజేసేది... ‘‘ఇచ్చింది మరచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే’ స్నేహం అని జాతిపిత మహాత్మాగాంధీ స్నేహం విలువను చాటారు.
ఈ సృష్టి ఉన్నంతకాలం నిలిచేది ఒక్క స్నేహమే... ఆదిదేవుళ్లు సృష్టి, స్థితి, లయకారకాలను కచ్చితంగా అమలుపరిచేది తమ స్నేహబంధంతోటే... జగన్మాతలు ముగ్గురూ స్నేహంగా ఉండబట్టే రాక్షస సంహారం గావించబడి లోకాలన్నీ శాంతించినాయి. ద్వాపరయుగంలో లేమికి నిర్వచనంగా చెప్పబడే కుచేలుడు ఇచ్చిన పిడికెడు అటుకులతో అతని స్నేహితుడైన శ్రీకృష్ణుడు అతనికి బంగారు పట్టణాన్నే బహూకరించి స్నేహం విలువను ఈ లోకానికి తెలియజేశాడు. మహాభారతంలో రారాజు ధుర్యోధనుడు, మానసపుత్రుడు కర్ణుడు మధ్యనున్న స్నేహం వెలకట్టలేనిది. స్నేహితుని కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి కర్ణుడు చరిత్ర లో నిలిచిపోయాడు. రామాయణంలో కూడా శ్రీరామునికి, ఆంజనేయునికి మధ్య ఉన్న స్నేహబంధం లతలా పెనవేసుకుపోయి భక్తిబంధంగా రూపుదాల్చింది. ఇలా యుగయుగాలలో భగవంతుడు స్నేహబంధం విలువను ఏదో ఒక రూపంలో మనుషులకు సూచిస్తునే ఉన్నాడు. స్నేహబంధంతో ఇరుదేశాల మధ్య రక్తపాతాన్ని ఆపవచ్చు... కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడ వచ్చు... దేశ ఉన్నతిని కాంక్షించవచ్చు... ఇలా చెప్పు కుంటూ పోతే స్నేహబంధం ఒక నిరంతర గంగా ప్రవాహం... దానిని అదుపు చేయడం గంగ వెల్లువను కమం డలంలో పట్టివుంచి నట్లవుతుంది...
‘జీవితపు టెడారిలో స్నేహాలు ఎండమా వులే... అయినా అక్కడక్కడా లేకపోలేదు అత్మీయతా ఒయాసి స్సులు’ అన్నాడో కవి. అటువంటి ఒయా సిస్సులలో సేదతీరే వారిదే అదృష్టం. స్నేహం లో పెరుగుతారు. స్నేహంలోనే వృద్ధులవుతారు. కొన్ని స్నేహాలు బంధాలవుతాయి. కొన్ని బంధనాలవుతా యి. కానీ అన్నీ సజీవంగానే వుంటాయి. ఇంత గొప్ప మానవ సంబంధానికి ప్రత్యేకంగా ఒక రోజు, వారం అంటూ కేటాయించడం మన సరదా అంతే. మానవ జీవితాలకి ఒక అర్థం కల్పించే స్నేహాలకి సలాం. స్నేహితులకు గులాం... రక్త సంబంధాలకూ, బీరకాయ పీచు బంధు త్వాలకూ, చత్వారపు చుట్టరికాలకూ అతీ తంగా ఉండేది స్నేహం. నిజానికి వాటన్నిటికన్నా అంద మైనదీ, అపురూపమైనదీ, అద్భుత మైనదీ, అత్యున్నతమైనదీ స్నేహమే. ఇటు వంటి ఎన్నో విశేషణాలు జోడించి స్నేహాన్ని వర్ణిం చడానికి చేసిన ప్రయత్నంలో ఎన్నెన్నో కథలు, కవితలు రూపొందాయి. కానీ స్నేహానికి వివరణలు, వర్ణనలు, తాఖీదు లు, హామీలు అవసరం లేదు. ఎందుకంటే స్నేహం మనసుకు సంబంధించిన విషయం. అనుభూతులకు నెలవు. అనుభవాలకు కొలువు. మనుషుల్లో, జంతువుల్లో కూడా సాంగత్యం, తోడు అవసరం. ఏకాకిగా, ఒంటరి గా జీవించడం కష్టం. చాలా మందికి అయిష్టం. అటువంటి తోడు ఎవరినుండైనా, ఎటువైపు నుండైనా రావచ్చు. మరీ చిన్నప్పుడు ‘తోడు’ ఎంచుకునే వీలు, అవకాశం లేక పోవడంతో అందరూ విపరీతంగా కురిపించే ఆప్యాయతా, గారాబాల జడితో తడిసి ముద్దయిపోయినా, వయసు పెరిగే కొద్దీ మనసు కావలసిన వారితోనే జతకట్టడం ప్రారంభమౌతుంది.
అది ఎలా మొదలౌతుందో, ఏ లక్షణాలు, పరిస్థితులు, ప్రభావాలు అందుకు ప్రేరేపిస్తాయో కూడా మనకు తెలీదు. సాధారణంగా సమవయస్కుల తోటే సహవాసం మొదలౌతుంది. అయితే ఇంట్లో సమవయస్కులు వుండడం అరుదు. స్నేహంలో విశేషమదే. ఒకరితో ఒకరు ప్రభావితమవ్వడం, ఒకరికి ఒకరు కలిసి ఎదగ డం. మిగతా సాంగత్యాలలో ఇటువంటివి కాస్త తక్కువ. బంధువుల్లో కూడా కాస్త దగ్గరి వయసున్న వారు ఫ్రెండ్స్‌గా వుండే అవకాశం వుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు వారి బంధుత్వం వారిమధ్య వున్న స్నేహాన్ని అధిగమిస్తుంది. అప్పుడు కొన్ని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తుతాయి. స్నేహానికి పరిధులూ, ఆటంకాలూ, అవరోధాలూ, లేనట్టే నిబంధనలూ, లెక్కలూ, నిర్వచనాలూ వుండవు. అటువంటివన్నీ సరదాగా ఎవరికి వారు తయారు చేసుకున్నవే. ఎప్పుడైతే మానవ సంబంధాలు ప్రారంభమౌతాయో వాటన్నిటి లో అవాంఛనీయ మైన కోపాలు కనిపిస్తాయి. స్నేహాల్లో ద్వేషాలూ, కోపాలు, తాపాలు, కొట్లాటలూ, కలిసిపోవడాలూ, మొహమాటాలూ, మర్యాదలూ, గౌరవాలూ, మన్ననలూ, మోసాలూ... అన్నీ వుండే అవ కాశముంది. అలాంటి పరిస్థి తులు ఎదుర్కొ న్న, అనుభవించి న స్నేహితులు చాలా చోట్ల తార సపడతారు.
‘‘నిజమైన స్నేహం అనేది ఒక సద్గుణాన్ని సూచిస్తుంది. పైగా ఈ సద్గుణం మనిషి జీవి తానికి ఎంతో అవసరం. ఒక మనిషిలో ఎన్ని మంచి లక్షణాలున్నా... స్నేహితుడు లేకుండా ఆ మనిషి జీవితం పరిపూర్ణత సాధించదు’’ అంటారు అరిస్టాటిల్. ఆయన నిర్వచించిన మూడు రకాల స్నేహాలను విపులీకరించి చూస్తే...
అవసరాలకోసం చేసే స్నేహం: ఈ స్నేహం తన అవసరాలను తీర్చుకునే సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది. నీ అవసరం తీర్చలేప్పుడు ఈ స్నేహం మరోచోటికి మళ్లిపోతుంది. ఈ స్నేహం కడవరకు సాగడం అసాధ్యం. ఇది ఎన్నో ఒడిదుడు కులకు, అడ్డంకులకు లోనవుతూ ఉంటుంది. ఇలాంటి స్నేహం పెద్దవారిలో, యుక్తవయసులో ఉన్న వారిలో, జీవితంలో పైకి వచ్చే స్థితిలో ఉన్న యువతలో ఈ స్నేహం ఎక్కువగా చిగురిస్తుంది. వీరు ఎక్కువ సమయం కలిసి ఉండలేరు. ఇందులో ఒకిరి గురించి ఒకరు ఆలోచించే అవసరం ఎంతమాత్రం ఉండదు కనుక కష్టాల్లో ఉన్నప్పుడు సైతం ఆ స్నేహితుడు గుర్తుకురాడు. స్నేహితుడు కష్టా ల్లో ఉన్నాడని తెలిసినా అతనికి సహాయం చేద్దామనే ఆలోచన ఈ రకమైన స్నేహంలో లేశమాత్రమైనా కనిపించదు. ఒకవేళ సహాయం చేస్తే తిరిగి మనకు లాభం చేకూరుతుందని భావించిన సందర్భాల్లో తప్ప.
ఉల్లాసం కోసం చేసే స్నేహం: ఈ రకమైన స్నేహం ఎక్కువగా చిన్నవయసులో ఏర్పడుతుంది. ఈ వయసులో తమ భావాలను, ఆసక్తులను గౌరవించుకుంటారు. ఎందుకంటే... వాటిద్వారా వీరు ఎనలేని ఆనందాన్ని పొందుతారు.
అయితే రానురాను అభిప్రాయాలు, ఉద్దేశాలు మారుతున్న కొద్దీ ఈ స్నేహంలో మార్పు వస్తుంది. అందువల్ల ఇలాంటి స్నేహాలు బలపడే అవ కాశాలు ఎంత ఉన్నాయో బ్రేక్ అయ్యే అవకాశాలూ అంతే ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ స్నేహంలో అనురాగం అప్యాయతల విష యంలో తేడాలను గమనించవచ్చు.
నిస్వార్థ స్నేహం: ఈ స్నేహాన్ని అరిస్టాటిల్ ‘పర్‌ఫెక్ట్ ఫ్రెండ్‌షిప్’ అని వర్ణిం చాడు. భవనం కలకాలం నిలబడాలంటే పునాది ఎంత గట్టిగా ఉండాలో స్నేహం నిలబడాలంటే మంచితనమనే పునాది కూడా అంతే గట్టిగా ఉం డాలి. ఒకసారి ఈ పునాది పైన ఏర్పడిన స్నేహం కలకాలం నిలుస్తుంది.
విద్యార్థులే కాకుండా ఉద్యోగరీత్య ఎక్క డెక్కడో స్థిరపడిన ప్రాణస్నేహితులు ఫ్రెండ్‌షిప్ డే రోజున కలుసుకొని పార్టీలు చేసుకుంటారు. ఆరోజు డిస్కో థెక్‌లు, బార్లు స్నేహితులతో నిండిపోతాయి. ఇలాంటి పార్టీల ద్వారా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటీవలికాలంలో అమెరికాతో పాటు అన్ని దేశాల్లో ఫ్రెండ్‌షిప్ డే ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. స్నేహితుల దినోత్సవం వస్తుందనగానే వ్యాపారసంస్థల సందడి మొదల వుతుంది రంగురంగుల గ్రీటింగ్స్‌ను డిజైన్ చేసి స్నేహితులను ఆకట్టుకు నే ప్రయత్నం చేస్తాయి. బార్లు, రెస్టారెంట్ల సంస్కృతి పెరిగిపోవడంతో స్నేహితులకోసం ఇవి స్పెషల్ డిస్కౌంట్లతో అదరగొడతాయి.
ఆ వివారాలు ఒకసారి పరిశీలించినట్లయితే. ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సం జరుపుకోవడం మనకు తెలి సిందే. అయితే పలురకాలైన ఫ్రెండ్‌షిప్‌డేలు కూడా ఉన్నాయి. ఆగస్టు మూడో ఆదివారం ‘వుమెన్స్ ఫ్రెండ్‌షిప్ డే’, ఫిబ్రవరి మాసాన్ని ‘ఇంటర్నే షనల్ ఫ్రెండ్‌షిప్ మంత్’గా కూడా జరుపుకోవడం విశేషం. అంతేకాకుం డా మే మూడవ వారాన్ని ‘ఓల్డ్ ఫ్రెండ్స్, న్యూ ఫ్రెండ్స్ వీక్’గా జరుపుకుం టారు. అయినా స్నేహాన్ని పంచుకోవడానిక ఒక సందర్భం అవసరంలే దు. స్నేహానికి హద్దులు లేవు. స్నేహాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక దినం అవసరంలేదనేది మాత్రం సత్యం. స్నేహం యొక్క విశిష్టతను శ్రీ కృష్ణుడు మహాభారతంలో ఆనాడే వర్ణించాడు. సృష్టిలో స్నేహానికన్నా విలువైనది మరేదీ ఉండదని ఆయన ప్రభోదించారు. స్నేహం అంటే నిస్వార్థంలేని ప్రేమ, సోదరభావం, రక్షణ, మార్గదర్శకం, అనుబంధం ఇలా స్నేహానికి ఎన్నో పర్యాయపదాలు.
స్నేహం... ఇది మనిషి జీవితానికి ఒక పరిపూర్ణ అర్ధాన్ని చేకూర్చే దివ్య ఔషధం. మన ఆశయాలకు మార్గదర్శకాలను ఏర్పరుచుకోవటంలో స్నే హితుని పాత్ర ఎనలేనిది. బాల్య స్నేహితుడైనా... ఇటీవలే పరిచయం అయిన కొత్త స్నేహితుడైనా... అతని పాత్ర ఎంతో విశిష్టమైనది. అలాం టి స్నేహితున్ని ప్రస్తుతిస్తూ... జరుపు కు నే అరుదైన పండుగ ‘స్నేహి తుల దినోత్సవం’... హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే...
ఈ సృష్టి ఉన్నంతకాలం నిలిచేది ఒక్క స్నేహమే... ఆదిదేవుళ్లు సృష్టి, స్థితి, లయకారకాలను కచ్చితంగా అమలుపరిచేది తమ స్నేహబంధంతోటే... జగన్మాతలు ముగ్గురూ స్నేహంగా ఉండబట్టే రాక్షస సంహారం గావించబడి లోకాలన్నీ శాంతించినాయి. ద్వాపరయుగంలో లేమికి నిర్వచనంగా చెప్పబడే కుచేలుడు ఇచ్చిన పిడికెడు అటుకులతో అతని స్నేహితుడైన శ్రీకృష్ణుడు అతనికి బంగారు పట్టణాన్నే బహూకరించి స్నేహం విలువను ఈ లోకానికి తెలియజేశాడు. మహాభారతంలో రారాజు ధుర్యోధనుడు, మానసపుత్రుడు కర్ణుడు మధ్యనున్న స్నేహం వెలకట్టలేనిది. స్నేహితుని కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి కర్ణుడు చరిత్ర లో నిలిచిపోయాడు. రామాయణంలో కూడా శ్రీరామునికి, ఆంజనేయునికి మధ్య ఉన్న స్నేహబంధం లతలా పెనవేసుకుపోయి భక్తిబంధంగా రూపుదాల్చింది. ఇలా యుగయుగాలలో భగవంతుడు స్నేహబంధం విలువను ఏదో ఒక రూపంలో మనుషులకు సూచిస్తునే ఉన్నాడు. స్నేహబంధంతో ఇరుదేశాల మధ్య రక్తపాతాన్ని ఆపవచ్చు... కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడ వచ్చు... దేశ ఉన్నతిని కాంక్షించవచ్చు... ఇలా చెప్పు కుంటూ పోతే స్నేహబంధం ఒక నిరంతర గంగా ప్రవాహం... దానిని అదుపు చేయడం గంగ వెల్లువను కమం డలంలో పట్టివుంచి నట్లవుతుంది...
‘జీవితపు టెడారిలో స్నేహాలు ఎండమా వులే... అయినా అక్కడక్కడా లేకపోలేదు అత్మీయతా ఒయాసి స్సులు’ అన్నాడో కవి. అటువంటి ఒయా సిస్సులలో సేదతీరే వారిదే అదృష్టం. స్నేహం లో పెరుగుతారు. స్నేహంలోనే వృద్ధులవుతారు. కొన్ని స్నేహాలు బంధాలవుతాయి. కొన్ని బంధనాలవుతా యి. కానీ అన్నీ సజీవంగానే వుంటాయి. ఇంత గొప్ప మానవ సంబంధానికి ప్రత్యేకంగా ఒక రోజు, వారం అంటూ కేటాయించడం మన సరదా అంతే. మానవ జీవితాలకి ఒక అర్థం కల్పించే స్నేహాలకి సలాం. స్నేహితులకు గులాం... రక్త సంబంధాలకూ, బీరకాయ పీచు బంధు త్వాలకూ, చత్వారపు చుట్టరికాలకూ అతీ తంగా ఉండేది స్నేహం. నిజానికి వాటన్నిటికన్నా అంద మైనదీ, అపురూపమైనదీ, అద్భుత మైనదీ, అత్యున్నతమైనదీ స్నేహమే. ఇటు వంటి ఎన్నో విశేషణాలు జోడించి స్నేహాన్ని వర్ణిం చడానికి చేసిన ప్రయత్నంలో ఎన్నెన్నో కథలు, కవితలు రూపొందాయి. కానీ స్నేహానికి వివరణలు, వర్ణనలు, తాఖీదు లు, హామీలు అవసరం లేదు. ఎందుకంటే స్నేహం మనసుకు సంబంధించిన విషయం. అనుభూతులకు నెలవు. అనుభవాలకు కొలువు. మనుషుల్లో, జంతువుల్లో కూడా సాంగత్యం, తోడు అవసరం. ఏకాకిగా, ఒంటరి గా జీవించడం కష్టం. చాలా మందికి అయిష్టం. అటువంటి తోడు ఎవరినుండైనా, ఎటువైపు నుండైనా రావచ్చు. మరీ చిన్నప్పుడు ‘తోడు’ ఎంచుకునే వీలు, అవకాశం లేక పోవడంతో అందరూ విపరీతంగా కురిపించే ఆప్యాయతా, గారాబాల జడితో తడిసి ముద్దయిపోయినా, వయసు పెరిగే కొద్దీ మనసు కావలసిన వారితోనే జతకట్టడం ప్రారంభమౌతుంది.
అది ఎలా మొదలౌతుందో, ఏ లక్షణాలు, పరిస్థితులు, ప్రభావాలు అందుకు ప్రేరేపిస్తాయో కూడా మనకు తెలీదు. సాధారణంగా సమవయస్కుల తోటే సహవాసం మొదలౌతుంది. అయితే ఇంట్లో సమవయస్కులు వుండడం అరుదు. స్నేహంలో విశేషమదే. ఒకరితో ఒకరు ప్రభావితమవ్వడం, ఒకరికి ఒకరు కలిసి ఎదగ డం. మిగతా సాంగత్యాలలో ఇటువంటివి కాస్త తక్కువ. బంధువుల్లో కూడా కాస్త దగ్గరి వయసున్న వారు ఫ్రెండ్స్‌గా వుండే అవకాశం వుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు వారి బంధుత్వం వారిమధ్య వున్న స్నేహాన్ని అధిగమిస్తుంది. అప్పుడు కొన్ని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తుతాయి. స్నేహానికి పరిధులూ, ఆటంకాలూ, అవరోధాలూ, లేనట్టే నిబంధనలూ, లెక్కలూ, నిర్వచనాలూ వుండవు. అటువంటివన్నీ సరదాగా ఎవరికి వారు తయారు చేసుకున్నవే. ఎప్పుడైతే మానవ సంబంధాలు ప్రారంభమౌతాయో వాటన్నిటి లో అవాంఛనీయ మైన కోపాలు కనిపిస్తాయి. స్నేహాల్లో ద్వేషాలూ, కోపాలు, తాపాలు, కొట్లాటలూ, కలిసిపోవడాలూ, మొహమాటాలూ, మర్యాదలూ, గౌరవాలూ, మన్ననలూ, మోసాలూ... అన్నీ వుండే అవ కాశముంది. అలాంటి పరిస్థి తులు ఎదుర్కొ న్న, అనుభవించి న స్నేహితులు చాలా చోట్ల తార సపడతారు.
స్నేహంపై అరిస్టాటిల్ భావన...
అనాది నుంచి నేటి వరకు ఎందరో మహానుభావులు స్నేహాన్ని అనేక రకాలుగా నిర్వచించారు. వారిలో అరిస్టాటిల్ ఒకరు. స్నేహాన్ని ఆయన మూడు రకాలుగా వర్గీకరించాడు. కొందరు అవసరం కోసం ఫ్రెండ్‌షిప్ చేస్తే... మరికొందరు ఆనందం కోసం చేస్తారు. కానీ, ఈ రెండు రకాల స్నేహాల్లో నిస్వార్థత లేదని అభిప్రాయపడ్డాడు. పైగా ఈ స్నేహాలు అవసరాలు తీర్చేవరకే నిలబడతా యి. అంతేగాని వీటికి ఒక ఖచ్ఛితమైన పునాది అంటూ ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే... ఈ రెండు రకాల స్నేహాలు గాలిమేడల్లాంటివి. ఎప్పుడు నిలబడతాయో, ఎప్పుడు కూలిపోతాయో చెప్పడం కష్టం. ఇక మూడవ రకం స్నేహం వీటికి పూర్తి భిన్నం... అదే నిజమైన స్నేహం (్ఛఠజ్ఛీ జటజ్ఛీఛీటజిజీఞ). ఇది అనంతమైనది. దీనికి ముగింపు అంటూ ఉండదు. ఒకరి అవసరాలను మరొకరు తనవని భావించే సహృద యత ఇందులో మెండుగా ఉంటుంది. ఇదే దీని ప్రత్యేక లక్షణం కూడా. ఇది పూర్తిగా మంచితనంపై ఆధారపడి వుంటుంది. మంచితనం లేని చోట ఇది నిలబడదు. స్వార్థ ప్రయోజనాలకు ఇక్కడ తావు లేదు. రెండు మంచి మనసుల మధ్య మాత్రమే ఈ స్నేహం చిగురిస్తుంది. అరిస్టాటిల్ భావన ప్రకారం నిస్వార్థమైన స్నేహం సదా స్నేహితు ని మంచిని తప్ప మరేదీ కోరదు.‘‘నిజమైన స్నేహం అనేది ఒక సద్గుణాన్ని సూచిస్తుంది. పైగా ఈ సద్గుణం మనిషి జీవి తానికి ఎంతో అవసరం. ఒక మనిషిలో ఎన్ని మంచి లక్షణాలున్నా... స్నేహితుడు లేకుండా ఆ మనిషి జీవితం పరిపూర్ణత సాధించదు’’ అంటారు అరిస్టాటిల్. ఆయన నిర్వచించిన మూడు రకాల స్నేహాలను విపులీకరించి చూస్తే...
అవసరాలకోసం చేసే స్నేహం: ఈ స్నేహం తన అవసరాలను తీర్చుకునే సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది. నీ అవసరం తీర్చలేప్పుడు ఈ స్నేహం మరోచోటికి మళ్లిపోతుంది. ఈ స్నేహం కడవరకు సాగడం అసాధ్యం. ఇది ఎన్నో ఒడిదుడు కులకు, అడ్డంకులకు లోనవుతూ ఉంటుంది. ఇలాంటి స్నేహం పెద్దవారిలో, యుక్తవయసులో ఉన్న వారిలో, జీవితంలో పైకి వచ్చే స్థితిలో ఉన్న యువతలో ఈ స్నేహం ఎక్కువగా చిగురిస్తుంది. వీరు ఎక్కువ సమయం కలిసి ఉండలేరు. ఇందులో ఒకిరి గురించి ఒకరు ఆలోచించే అవసరం ఎంతమాత్రం ఉండదు కనుక కష్టాల్లో ఉన్నప్పుడు సైతం ఆ స్నేహితుడు గుర్తుకురాడు. స్నేహితుడు కష్టా ల్లో ఉన్నాడని తెలిసినా అతనికి సహాయం చేద్దామనే ఆలోచన ఈ రకమైన స్నేహంలో లేశమాత్రమైనా కనిపించదు. ఒకవేళ సహాయం చేస్తే తిరిగి మనకు లాభం చేకూరుతుందని భావించిన సందర్భాల్లో తప్ప.
ఉల్లాసం కోసం చేసే స్నేహం: ఈ రకమైన స్నేహం ఎక్కువగా చిన్నవయసులో ఏర్పడుతుంది. ఈ వయసులో తమ భావాలను, ఆసక్తులను గౌరవించుకుంటారు. ఎందుకంటే... వాటిద్వారా వీరు ఎనలేని ఆనందాన్ని పొందుతారు.
అయితే రానురాను అభిప్రాయాలు, ఉద్దేశాలు మారుతున్న కొద్దీ ఈ స్నేహంలో మార్పు వస్తుంది. అందువల్ల ఇలాంటి స్నేహాలు బలపడే అవ కాశాలు ఎంత ఉన్నాయో బ్రేక్ అయ్యే అవకాశాలూ అంతే ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ స్నేహంలో అనురాగం అప్యాయతల విష యంలో తేడాలను గమనించవచ్చు.
నిస్వార్థ స్నేహం: ఈ స్నేహాన్ని అరిస్టాటిల్ ‘పర్‌ఫెక్ట్ ఫ్రెండ్‌షిప్’ అని వర్ణిం చాడు. భవనం కలకాలం నిలబడాలంటే పునాది ఎంత గట్టిగా ఉండాలో స్నేహం నిలబడాలంటే మంచితనమనే పునాది కూడా అంతే గట్టిగా ఉం డాలి. ఒకసారి ఈ పునాది పైన ఏర్పడిన స్నేహం కలకాలం నిలుస్తుంది.
విదేశీ ఒరవడి...
అమెరికాలో మొదలైన స్నేహితుల దినోత్సవం ఆ తరువాత ప్రపంచదేశాలన్నిటికీ పాకిపోయినట్టే మనదేశంలోకూడా వ్యాపించింది. మనదేశం లోనూ స్నేహితుల దినోత్సవానికి ఎనలేని ఆదరణ ఉంది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొ ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో స్థిరపడినవారం దరూ తమ స్నేహితులకు గ్రీటింగుల ద్వారా తమ ప్రేమను పంచుకుంటా రు. భౌతికంగా దూరంగా జీవి తం గడుపుతున్నా స్నేహితుల మనసుల ను మాత్రం ఏ హద్దు లూ విడదీయలేవు. మనదేశంలో ఫ్రెండ్‌షిప్ డే సెలెబ్రేషన్స్ ఎక్కువగా స్కూల్స్‌లో, కాలేజీలల్లో ఎక్కువగా జరుపుకుం టారు. దాదాపు వారంరోజుల ముందునుండే ఈ సందడి మొదలవుతుం ది. స్నేహితులకోసం గిఫ్ట్‌స, గ్రీటింగ్ కార్డ్‌స కొనుగోలు చేయడంలో బిజీ గా గడుపుతారు విద్యార్థులు. ఫ్రెండ్‌షిప్ డే బాండ్స్‌ను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. కొన్ని కాలేజీల్లో అయితే ఫ్రెండ్‌షిప్ డేను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలను రూపొందించుకొని సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. డాన్స్ ప్రోగ్రామ్స్, పాటల పోటీలు లాంటి ఎన్నో కల్చరల్ ప్రో గ్రామ్స్ నిర్వహిస్తుంటారు. ఇలాంటి ఈవెంట్‌ల ద్వారా స్నేహితులు ఆడు తూపాడుతూ తమ ఫ్రెండ్‌షిప్ డేను ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్రెండ్‌షిప్ డే పార్టీలు ఊపందుకుంటాయి.విద్యార్థులే కాకుండా ఉద్యోగరీత్య ఎక్క డెక్కడో స్థిరపడిన ప్రాణస్నేహితులు ఫ్రెండ్‌షిప్ డే రోజున కలుసుకొని పార్టీలు చేసుకుంటారు. ఆరోజు డిస్కో థెక్‌లు, బార్లు స్నేహితులతో నిండిపోతాయి. ఇలాంటి పార్టీల ద్వారా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటీవలికాలంలో అమెరికాతో పాటు అన్ని దేశాల్లో ఫ్రెండ్‌షిప్ డే ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. స్నేహితుల దినోత్సవం వస్తుందనగానే వ్యాపారసంస్థల సందడి మొదల వుతుంది రంగురంగుల గ్రీటింగ్స్‌ను డిజైన్ చేసి స్నేహితులను ఆకట్టుకు నే ప్రయత్నం చేస్తాయి. బార్లు, రెస్టారెంట్ల సంస్కృతి పెరిగిపోవడంతో స్నేహితులకోసం ఇవి స్పెషల్ డిస్కౌంట్లతో అదరగొడతాయి.
‘ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్‌డీడ్’
స్నేహితుల దినోత్సం పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాయి వ్యాపార సంస్థలు. నిజానికి ఫ్రెండ్‌షిప్ డే గురించి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. ఈ రోజును ఫలానా తేదీనే జరుపుకోవాలని ఎటువంటి నియమ నిబంధనలు కూడా లేవు. మరి ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్‌షిప్ డే కి ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది. ఈ స్నేహితుల దినోత్సవానికి సం బంధించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పౌరాణికేతిహాసాల్లో ఎందరో మహానుభావులు స్నేహానికి ఎనలేని ప్రాధాన్యతను కల్పించారు. మనిషి జీవితంలో అన్ని బంధాల్లోకెల్లా విలువైనది స్నేహబంధం. స్నేహం గురించి ఇంగ్లీష్‌లో ఓ సామెత ఉంది. ‘ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్‌డీడ్’ కష్టాల్లో తోడునిలిచి ప్రోత్సాహం అం దించేవాడే నిజమైన స్నేహితడని దాని అర్ధం. ప్రతి సంవత్సరం ఆగస్ట్ మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్‌షిప్ డేను జరుపుకోవడం ఆనవాయితి. అయితే ఆ రోజునే ఎందుకు ఫ్రెం డ్‌షిప్ డే ను జరుపుకోవాలి? అసలు ఫ్రెండ్‌షిప్ డేకి బీజం ఎలా పడిం ది? దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? మనదేశంలో ఫ్రెండ్‌షిప్ డేను ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారు? అనే విషయాలను తెలుసుకుందాం... మనదే శంలో విద్యార్థులు, ఉద్యోగస్థులు, ప్రముఖులు ఈ రోజును ఎలా జరు పుకుంటారో చూద్దాం...అంతర్జాతీయ గుర్తింపు
1935వ సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్ తొలిసారిగా ఫ్రెండ్‌షిప్ డే ను వెలుగులోకి తీసుకువచ్చింది. ఆగస్టు నెలలో వచ్చే తొలి ఆదివారం రోజున జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుండి అది ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవంగా మారిపోయింది. అలాం టి ఒక గొప్ప ఐడియా సృష్టిలోనే విలువైన స్నేహబంధాన్ని మరింత పటిష్టం చేసింది. అనతికాలంలోనే ఫ్రెండ్‌షిప్ డే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొంది అంతర్జాతీయ పండుగగా గుర్తింపుపొందింది. అమెరికా లో ఎంతో పాపులర్ అయిన స్నేహితుల దినోత్సవం అనతికాలంలోనే ఇతర ప్రపంచదేశాలకు పాకింది. అంతేకాదు ప్రఖ్యాత అమెరికన్ రచ యిత రాసిన ‘విన్నీ-ద-పూహ్’ను 1997లో ఫ్రెండ్‌షిప్ డే అంబాసిడర్ గా ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. మనదేశంలోకూడా ఇది విశేష ఆదరణను పొందింది. ఫ్రెండ్‌షిప్ డే వస్తోందనగానే స్నేహితుల్లో ఉత్సా హం ఉరకలేస్తుంది. తమ ప్రాణాతిప్రాణమైన మిత్రులకు విభిన్న రీతులలో శుభకాంక్షలు తెలియజేయడానికి తహతహలాడుతూ ఉంటారు. ఫ్రెండ్‌షిప్ డే ప్రపంచవ్యాప్తంగా వివిధ తేదీల్లోకూడా జరుపుకోవడం విశేషం.ఆ వివారాలు ఒకసారి పరిశీలించినట్లయితే. ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సం జరుపుకోవడం మనకు తెలి సిందే. అయితే పలురకాలైన ఫ్రెండ్‌షిప్‌డేలు కూడా ఉన్నాయి. ఆగస్టు మూడో ఆదివారం ‘వుమెన్స్ ఫ్రెండ్‌షిప్ డే’, ఫిబ్రవరి మాసాన్ని ‘ఇంటర్నే షనల్ ఫ్రెండ్‌షిప్ మంత్’గా కూడా జరుపుకోవడం విశేషం. అంతేకాకుం డా మే మూడవ వారాన్ని ‘ఓల్డ్ ఫ్రెండ్స్, న్యూ ఫ్రెండ్స్ వీక్’గా జరుపుకుం టారు. అయినా స్నేహాన్ని పంచుకోవడానిక ఒక సందర్భం అవసరంలే దు. స్నేహానికి హద్దులు లేవు. స్నేహాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక దినం అవసరంలేదనేది మాత్రం సత్యం. స్నేహం యొక్క విశిష్టతను శ్రీ కృష్ణుడు మహాభారతంలో ఆనాడే వర్ణించాడు. సృష్టిలో స్నేహానికన్నా విలువైనది మరేదీ ఉండదని ఆయన ప్రభోదించారు. స్నేహం అంటే నిస్వార్థంలేని ప్రేమ, సోదరభావం, రక్షణ, మార్గదర్శకం, అనుబంధం ఇలా స్నేహానికి ఎన్నో పర్యాయపదాలు.
స్నేహం... ఇది మనిషి జీవితానికి ఒక పరిపూర్ణ అర్ధాన్ని చేకూర్చే దివ్య ఔషధం. మన ఆశయాలకు మార్గదర్శకాలను ఏర్పరుచుకోవటంలో స్నే హితుని పాత్ర ఎనలేనిది. బాల్య స్నేహితుడైనా... ఇటీవలే పరిచయం అయిన కొత్త స్నేహితుడైనా... అతని పాత్ర ఎంతో విశిష్టమైనది. అలాం టి స్నేహితున్ని ప్రస్తుతిస్తూ... జరుపు కు నే అరుదైన పండుగ ‘స్నేహి తుల దినోత్సవం’... హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే...
- ఎస్.కె
No comments:
Post a Comment